Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: chilamathuru

తిరుపతి

ఆపరేషన్ త్రిశూల్‌ లో భాగంగా చిలమత్తూరు లో అవగాహన సదస్సు

తిరుపతి జిల్లా వరదయ్య పాలెం చిలమత్తూరు శ్రీ సిటీ ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వరదయ్య పాలెం మండలం చిలమత్తూరు గ్రామంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు శ్రీ సిటీ డి ఎస్పీ శ్రీనివాసులు మరియు సి ఐ పరి వేక్షణ లో ఎస్ ఐ ప్రియాంక ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ సందర్బంగా మహిళా భద్రత, గంజాయి నిర్మూలన మరియు రోడ్డు భద్రత అంశాలపై అక్కడ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు, యువత మరియు గ్రామ ప్రజలకు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న పోలీస్ సహాయ సేవలు, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదకద్రవ్యాల నిర్మూలన లో ప్రజల భాగస్వామ్యం గురించి వివరించడం జరిగింది. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమానికి 100 మంది గ్రామస్తులు పాల్గొన్నారు, అదేవిదంగా మహిళలు, యువత మరియు ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరడమైనది. ఈ కార్యక్రమం లో పోలీస్ కానిస్టేబుల్ రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

చిలమత్తూరు పంచాయతీలో ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమం పాల్గొన్న శ్రీ సిటీ ఎస్ఐ ప్రియాంక

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు గ్రామం ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి ప్రతి గ్రామంలో ప్రతిష్టతకంగా చేసుకొనే వినాయక వేడుకలకు పోలీసుల భద్రతా వలయం వినాయక చవితి నిమజ్జనంలో పురస్కరించుకుని చిలమత్తూరు గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పండుగ వేడుకలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా శ్రీ సిటీ ఎస్ఐ ప్రియాంక పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ఎస్‌ఐ ప్రియాంక భద్రతా ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. వినాయక బొమ్మ వద్ద భక్తులు, నిర్వాహకులు పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండమని సూచించారు. గ్రామాల్లో రాత్రివేళ పోలీసు సిబ్బందితో కలిసి పర్యటిస్తూ శాంతిభద్రతల పరిస్థితిని ఎస్‌ఐ ప్రియాంక పర్యవేక్షించారు. పండుగ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్‌ఐ ప్రియాంక . పండుగ సమయంలో పోలీసులకు ప్రజలు, సహకరించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.