Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

కేసీఆర్ దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలి. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కేసీఆర్ దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలి. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

నర్సంపేట, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈనెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో నర్సంపేట ద్వారకపేట బైపాస్ రోడ్డులోని ఎంఏఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న మైదానాన్ని శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి ముందుండి నడిపించేవారని, ఆయన లేకుండా జరగనున్న తొలి కార్యక్రమం దీక్షా దివస్ అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బలమైన పునాది వేసిందని అన్నారు.
ఈనెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

కేసీఆర్ దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలి. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *