Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Breaking news

BHADRADRI

వెలుగు లేని భద్రాద్రి కొత్తగూడెం – ప్రమాదాలకు కారణమవుతున్న సెంట్రల్ డివైడర్ లైట్లు

వెలుగు లేని భద్రాద్రి కొత్తగూడెం – ప్రమాదాలకు కారణమవుతున్న సెంట్రల్ డివైడర్ లైట్లు భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని ప్రధాన రహదారులపై సెంట్రల్ డివైడర్ లైట్లు గత ఐదేళ్లుగా సరిగా పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగినంత వెలుతురు లేకపోవడం వల్ల పాల వ్యాన్లు, లారీలు మరియు ఇతర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో కూడా సరైన వీధి వెలుతురు లేకపోవడం ఒక కారణమని ప్రజలు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తరచుగా నమోదవుతున్నాయి. స్థానిక ప్రజలు, వాహనదారులు పలుమార్లు అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదని ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి సెంట్రల్ డివైడర్ లైట్లను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. “వెలుగు ఉంటే ప్రాణాలు కాపాడవచ్చు – చీకటి ప్రమాదాలకు దారి తీయకూడదు.” Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టిడిపి మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెదర్ల తిమోతి మృతి

కొండాపురం మండలం గొట్టి గుండాల గ్రామవాసి టిడిపి సీనియర్ నేత మండల టిడిపి మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెదర్ల తిమోతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన టిడిపి మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు. తిమోతి మృతి దేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పిచి తిమోతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన కొండాపురం మండలం కన్వీనర్ పోలినేనీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టిడిపి సీనియర్ నేత పదర్ల తిమోతి మృతి

కొండాపురం మండలం టిడిపి సీనియర్ నేత గొట్టి గుండాల వాసి మండల టిడిపి మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పదర్ల తిమోతి మృతి గ్రామం లోని గోట్టిగుండాలలొ గురువారం సాయంత్రం గుండెపోటుతో మృతి తిమోతి మృతి పట్ల విచారణ వ్యక్తం చేసిన టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లునేని రామారావు. తిమోతి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన బొల్లినేని

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాఖీ పౌర్ణమి సందర్భంగా కొండాపురం మండల ఎస్సై శుభాకాంక్షలు తెలిపారు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం ఎస్సై కాసుల శ్రీనివాసులు గారు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు, ప్రేమకు ప్రతీక రక్షాబంధన్ చిన్ననాటి జ్ఞాపకాల నుంచి జీవితంలోని ప్రతి మలుపులో తోడుగా నిలిచే అన్నాచెల్లెళ్ల బంధం ఎంతో ప్రత్యేకమైనది. రాఖీ కట్టే ఆ చిన్న క్షణంలో దాగి ఉండేది కేవలం ఒక దారం కాదు… జీవితాంతం నిలిచే ప్రేమ, నమ్మకం, అనుబంధం. ప్రతి అన్నాచెల్లెలి జీవితంలో ఈ బంధం మరింత ఆనందాన్ని, ఆప్యాయతను నింపాలని కోరుకుంటూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లాలో రూ .3 లక్షల లంచం తీసుకుంటుoదగా ACB రెడ్

నెల్లూరు జిల్లాలో రూ .3 లక్షల లంచం తీసుకుంటుoదగా ACB రెడ్ నెల్లూరు లో తెలుగు గంగా ఇరిగేషన్ శాఖకు చెందిన EE మహేశ్,DE గౌతమ్, ఏఈ నారాయణ రాజు రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ACB కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి కార్యాలయాలు సోదాలు నిర్వహించారు ఘటనపై విచారణ కొనసాగుతుంది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరులో గ్యాస్ గోడౌన్ సమీపంలో అగ్నిప్రమాదం

వింజమూరు పట్టణంలోని గ్యాస్ గోడౌన్ సమీపంలో ఉన్న స్క్రాప్ ఏరియాలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్‌లోని చెత్తకు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం.మంటలు ఒక్కసారిగా పెద్దఎత్తున వ్యాపించడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. మంటల ధాటికి స్క్రాప్ ఏరియాలో ఉన్న పలు పరికరాలు, వివిధ రకాల సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే గ్యాస్ గోడౌన్ ఉండటంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మంటలు గ్యాస్ గోడౌన్ వైపు వ్యాపించకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం ఎంతమేరకు ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియసి ఉంది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ట్రాఫిక్ పై సీఐ స్పెషల్ డ్రైవ్

కలిగిరి పట్టణంలోని ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. రోడ్డుకు ఆనుకుని వాహనాలు నిలపడం, తోపుడు బండ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారంతో సీఐ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులు రోడ్డుపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపకుండా, వ్యాపారులు రహదారిని ఆక్రమించకుండా అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరించాలని సీఐ సూచించారు.ఈ డ్రైవ్ లో కలిగిరి ఎస్సై లతీ ఫున్నిసా వింజమూరు ఎస్సై ఉమా మహేశ్వర రావు, సిబ్బంది ఉన్నారు. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ వల్ల నష్టపోయిన ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని కావలి భారతీయ జనతా పార్టీ ఆగ్రహం

భారతీయ జనతా పార్టీ జనతా వారధి 24 ఆగస్ట్ 2026… విషయం : *సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కు న్యాయం చేయాలి. ఈ కేసులో వంచన మోసం దోపిడి హత్య లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉన్నది. షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర DGP, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించాలి.* YSRCP కాకినాడ నాయకుని సిఫార్సుతో ఇంటర్నేషనల్ స్కూల్ లో రైఫిల్ షూటింగ్ శిక్షకునిగా పని చేస్తూ పరిచయమైన సాధిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబం కు న్యాయం చేయాలి. ఈ కేసులో వంచన మోసం దోపిడి హత్య లవ్ జిహాదీ ఉగ్రవాదం ఉన్నది. షాదిక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి, ఇతనికి సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర DGP, హోం మంత్రి ఈ సంఘటనపై స్పందించాలి.* పోలీసులు ఇటువంటి కేసులను ప్రేమ ఆర్థిక అంశంగా చూడటం వల్లే పోలీస్ స్టేషన్లకు బాధితులు వెళ్లడం లేదు. సాధారణంగా ఫిర్యాదు సమయంలో బాధితురాలి క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం వలన ఫిర్యాదులకు ముందుకు రావడం లేదు. ఫిర్యాదుదారులు పదేపదే పోలీస్ స్టేషన్లకు తిరగవలసి వస్తుంది. కేసులు పెట్టకుండా కఠినంగా వ్యవహరించకుండా కౌన్సిలింగ్ పేరుతో తిరిగి పంపేస్తున్నారు. రాష్ట్రంలో గో హత్యలు నిరోధించమని అడుగుతున్న గోరక్షణ రక్షకులపై కేసులు పెడుతున్నారు. లవ్ జిహాది కోసం మాట్లాడుతున్న వారిపై ఆంక్షలు పెడుతున్నారు. హిందూ సమాజానికి పోలీసు వ్యవస్థపై విశ్వాసం కలిగించలేకపోతున్నారు. ఈ లవ్ జిహాది సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరించిన ఒక్క సంఘటన కూడా లేదు. అందుకే ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నారు. ఇదే లవ్ జిహాది ముఠాకు అవకాశంగా మారుతున్నది. మొదట స్నేహం చేయడం, నమ్మకంగా ఉండటం, కుటుంబం మొత్తం పరిచయం చేసుకోవడం, కుటుంబం విశ్వాసం పొందడం, ఆర్థిక లావాదేవీలు ప్రారంభించడం, ఇంట్లో మహిళలను వంచించడం, ఆ మహిళ ప్రైవేట్ ఫొటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బెదిరించడం, కుటుంబంలో బలమైన వారిని హత్య చేయడం, చివరగా ఆస్తులన్నీ స్వాధీనం చేసి ఇస్లాం మతంకు మారాలని ఒత్తిడి తీసుకురావడం ఇదే “లవ్ జిహాద్” హిందూ మహిళలకు బాలికలకు రక్షణ లేకుండాపోయింది. జిమ్ములు, జుంబా డాన్సులు, సెలూన్ / బ్యూటీ పార్లర్ సెంటర్లు, కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ ప్రధాన కేంద్రాలుగా లవ్ జహాజీ లు పనిచేస్తున్నారు. వీరికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీరికి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ఏ మసీదులు, మదర్సాలు శిక్షణ ఇస్తున్నాయి? అనే విషయం పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. సరికాదా యువత లో అవగాహన కలిగించే కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదు. ఆల్ ఉమా ఉగ్రవాదుల కార్యకర్తలు కాకినాడలో దొరికారు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు పెద్దాపురంలో దొరికారు, కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో లవ్ జిహది బయటకు వచ్చింది. ఏఈ నూకరాజు గారి కుటుంబం యొక్క సంఘటన చాలా తీవ్రమైనది, విచారకరమైనది. ఈ సంఘటన వివరాలు తెలుసుకుంటే ఆందోళన కలుగుతున్నది. రైఫిల్ ట్రైనర్ గా ఉన్న సాజిద్ ఖాన్ వద్దకు చదువుకుంటున్న స్కూల్ ద్వారా శిక్షణ కోసం వచ్చిన ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి. తరచూ శిక్షణకు తీసుకొని వెళ్తున్న సందర్భంలో తల్లి సౌజన్యను వంచించి ఆమె ప్రైవేటు ఫోటోలతో ఆ కుటుంబం మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిన సాదిక్ ఖాన్. కొన్ని కోట్ల రూపాయల నగదు,బంగారం తీసుకొని మళ్ళీమళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిన సాదిక్ ఖాన్, ఇంటి మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషయం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్. చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదఆస్తిని తన పేరు రాసి ఏఈ నూకరాజు, తను భార్య మనవడు కార్తికేయ ,సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్, లేనిపక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు వీడియోలు బయటికి ప్రపంచానికి చెప్పడమే కాకుండా, తన భర్తను హతంచేసినట్టు కుమారుణ్ణి కూడా హతమారుస్తానని బెదిరింపులు. ఏమి చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో అర్థం కాక, చేసేదేమీ లేక తీవ్రమైన ఆందోళనతో జీవితం పై విసుగ చెంది AE నూకరాజు కుటుంబం ఈ విషయాలన్నీ ఒక ఉత్తరంగా రాసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ మనవడు కార్తికేయకి ఈత రావడం 12 సంవత్సరాల లోపుఉన్న బాలుడు బ్రతికాడు. ఆ బాలుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి ఈ సంఘటన తర్వాత పారిపోయిన సాదిక్ ఖాన్ ఢిల్లీలో దొరికాడు. ఆ దొరికిన స్థలంలో ఉండేటువంటి వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని బయట సమాచారం నడుస్తుంది. ఈ విషయాలన్ని పత్రికల్లో రావడం ప్రజలందరికి తెలియడం జరిగింది. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. లవ్ జిహాదీ సాదీక్ ఖాన్ ని కఠినంగా శిక్షించాలి అని కోరుచున్నది. అంతేకాకుండా, పోలీస్ లు లవ్ జిహాదీపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్నటువంటి కేసులు ఏమిటి? చేస్తున్న సమీక్ష ఏమిటి? ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులు ఏమిటి? దీనిపై తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? FIR అయిన కేసులపై రిఫర్ చేసిన సంఘటనలు ఎన్ని? పూర్తి వివరాలుతో రాష్ట్ర డిజిపి మరియు హోం శాఖ మంత్రి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రకాశం

రిజర్వేషన్లు తొలగిస్తే ప్రళయం సృష్టిస్తాం

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు తొలగించాలని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనను రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు తీవ్రంగా ఖండించారు. రిజర్వేషన్లు తొలగించాలంటే ముందుగా కుల, మత వివక్షను పూర్తిగా నిర్మూలించాలని ఆయన అన్నారు. భూమి, నీరు, సహజ వనరులను అన్ని వర్గాలకు సమానంగా పంచిన తర్వాత రిజర్వేషన్లపై చర్చించవచ్చని పేర్కొన్నారు. నేటికీ దళితులు వివక్ష, అవమానాలు, దాడులను ఎదుర్కొంటున్నారని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులే వారికి రక్షణగా ఉన్నాయని తెలిపారు. రిజర్వేషన్లపై అపోహలు, విద్వేషాలు రెచ్చగొడుతూ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

‘ 23 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం’

విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను కుత్బుల్లాపూర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు గంజాయి చాక్లెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో సుమారు 23 కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాజులరామారం, మహదేవపురం ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులతో పాటు ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. నిందితులను జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు సమాచారం. గంజాయి చాక్లెట్ల సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు, వీటి విక్రయానికి సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.