Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: Breaking news

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి: 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని వినతి ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న ప్రభుత్వ హామీని వెంటనే అమలు చేయాలని ఆవాజ్ ఉదయగిరి మండల కమిటీ

ఉదయగిరి: 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని వినతి ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న ప్రభుత్వ హామీని వెంటనే అమలు చేయాలని ఆవాజ్ ఉదయగిరి మండల కమిటీ కోరింది. ప్రస్తుతం పింఛన్ల ప్రక్రియ జరుగుతున్నందున 50 ఏళ్లు నిండిన మైనారిటీలకు కూడా ఇవ్వాలని MPDOను కోరారు. చిన్న వయసు నుంచే కూలి, చేతివృత్తులపై ఆధారపడుతున్న మైనారిటీలకు 50 ఏళ్లకే ఆర్థిక భరోసా అవసరమని కమిటీ పేర్కొంది. ఇచ్చిన హామీని అమలు చేసి పింఛన్ అందించాలని కోరారు.

ప్రకాశం

తౌషిక్ మృతి కేసులో న్యాయం కోసం తల్లి ఆత్మహత్యాయత్నం

సింగరాయకొండ: శ్రీ చైతన్య నవోదయ స్కూల్‌లో ఆరు నెలల క్రితం ఆరో తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై ఇప్పటికీ న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.తౌషిక్ మృతికి బాధ్యులను గుర్తించి స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అతని తల్లి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.ప్రస్తుతం ఆమె సంఘమిత్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.హాస్టల్ అనుమతులపై విచారణ జరిపి, జిల్లా విద్యాశాఖ అధికారి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ఆర్టీసీలో డ్రైవర్లకు అవకాశం! ఆసక్తి, అర్హత ఉన్న డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలి ఈ నెల 15లోపు దరఖాస్తులు సమర్పించాలి: డిపో మేనేజర్ రమేష్…..

ఉదయగిరి ఆర్టీసీ డిపో పరిధిలో ఆన్కాల్ పద్దతిలో డ్రైవర్లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు, లైసెన్స్ పొందిన తేదీ నుంచి కనీసం 18 నెలలు పూర్తయి ఉండటం తప్పనిసరి అని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న డ్రైవర్లు ఈ నెల 15వ తేదీలోపు ఉదయగిరి ఆర్టీసీ డిపోలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు అవసరమైన శిక్షణ అందించిన అనంతరం ఆన్కాల్ విధానంలో డ్రైవర్ సేవలను వినియోగించుకుంటామని రమేష్ తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ఈ విధానం ద్వారా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీలో డ్రైవర్గా విధులు నిర్వహించాలనుకునే అర్హత కలిగిన వారికి ఈ అవకాశం ఉపయోగకరంగా ఉంటుందని డిపో మేనేజర్ రమేష్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వినాయక మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి

వినాయక మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి. SPSR నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 8 పున్నమి తెలుగు దిన పత్రిక కలిగిరి మండలం వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్టించే వారు తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాలని ఎస్సై సయ్యద్ లతీ పున్నిషా గారు సూచించారు. ఉత్సవ కమిటీలు ఉచిత ghaneshustav ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు స్థల యజమాని, పంచాయతీ అనుమతులతో పాటు ఫైర్, విద్యుత్‌ శాఖల నిబంధనలు పాటించాలన్నారు. రహదారులు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకూడదని సూచించారు. లౌడ్‌స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, డీజేలు, సామగ్రి నిషేధమన్నారు. నిమజ్జన సమయంలో మద్యం, మత్తు పదార్థాలు సేవిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి పరిధిలో ఏసీబీ దాడులు

కావలి పరిధిలో జాతీయ రహదారిలో ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఏసీబీ దాడులు. RTO గోపి నాయక్ వాహనం తనిఖీ చేయగా రెండున్నర లక్షల రూపాయలు పట్టుబడినట్లు సమాచారం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు దుత్తలూరు మండలం మురళి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ తరుపున మన రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు దుత్తలూరు మండలం మురళి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ మన రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు అధర్మంపై ధర్మం, చెడుపై మంచికి విజయాన్ని చాటిన శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినమైన శ్రీ కృష్ణాష్టమి పర్వదినం. శ్రీకృష్ణుని దివ్య బోధనలు, ధర్మమార్గం, కర్తవ్యనిష్ఠ మనందరికీ స్ఫూర్తిదాయకం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో శ్రీ కృష్ణుడు ఎనిమిదవ అవతారం వేణుగాన లోలుడు శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.ఓం నమో వాసుదేవాయ…జై శ్రీ కృష్ణ అని తెలిపారు

BHADRADRI

“పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా… కొత్తగూడెంలో కేక్ కట్ చేసిన జనసేన నేతలు – తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ప్రకటన!”

“పంజా వస్తే పవర్ ఎలా ఉంటుందో మరోసారి చూపిస్తున్న కొత్తగూడెం అభిమానులు! 🔥 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా SVC పూర్ణ థియేటర్ వద్ద పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సందడితో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవా దృక్పథం, రాజకీయ నాయకత్వాన్ని కొనియాడుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా అభిమానులు, రాజకీయ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లాలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని స్థానిక నాయకులు పేర్కొన్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు. తెలంగాణలో కూడా జనసేనకు మంచి ఆదరణ లభిస్తోందని, రాబోయే రోజుల్లో కొత్తగూడెం ప్రాంతంలో పార్టీని మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని నాయకులు అభిప్రాయపడ్డారు. (ఈ భాగం స్థానిక నాయకుల వ్యాఖ్యల ఆధారంగా పేర్కొనబడింది

BHADRADRI

భద్రాద్రి కొత్తగూడెం నుంచి పారంపర్య వైద్యుల రాష్ట్ర మహాసభలు భద్రాచలంలో సెప్టెంబర్ 8–10 వరకు

భద్రాచలం కేంద్రంగా త్రివిధ చికిత్సా విధానాలు, మూలికా వైద్యం, గ్రామీణ ఆరోగ్య సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర స్థాయి పారంపర్య వైద్యుల మహాసభలు సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 మంది వైద్యులు హాజరుకానున్నారు. మహాసభల ఏర్పాట్లపై స్థానిక నిర్వాహకులు, వైద్య సంఘ ప్రతినిధులు సమావేశమై చర్చించారు.పారంపర్య వైద్య మహా సంఘం (పివిఎంఎస్) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘ రాష్ట్ర సలహాదారు మొక్కల వెంకటయ్య, ఉపాధ్యక్షులు వైద్య రా మంచి శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ వైద్య సుగుణారావులు విజ్ఞప్తి చేశారు.ఆదివారం ఎస్పీబీ నగర్ లోని మొక్కల వెంకటయ్య ప్లాంటేషన్ లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. భారతీయ సనాతన సాంప్రదాయ వైద్యంలోని మెలకువలను, మూలాలను, విజ్ఞానవంతుల అనుభవాలను ఇతరులకు నేర్పించే నిరంతర వైద్య విజ్ఞాన సదస్సులో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.శ్రీ సీతారాముల సన్నిధి భద్రాచలంలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో జరిగే ఈ మహాసభలకు 400 మంది వైద్యులు హాజరవుతారని తెలిపారు.భక్త మార్కండేయ పద్మశాలి భవన్ లో జరుగనున్న ఈ సభలకు ముఖ్య అతిథులుగా శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామీజీ, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వైద్య శ్రీ జమాల్ ఖాన్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు వైద్య దొంత యాతి మహర్షి ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు, కోశాధికారులు టి.దుర్గారాణి, వి.అరుణలతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్, హరిత దీక్షురాలు చిన్నారి నైనిక రజువ, సభ్యులు వైద్య వీర్ల నరసింహారావు(లక్ష్మీదేవిపల్లి – కొత్తగూడెం), ఎండి ముస్తఫా, శంకర్ బంగారి, రాయి లక్ష్మి, దశరథ్ రజువ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

BHADRADRI

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్ దిశగా అడుగులు.. కేంద్ర మంత్రిని కలిసిన తుమ్మల నాగేశ్వరరావు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసి ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనపై చర్చించారు. సెప్టెంబర్ 7న కేంద్ర సాంకేతిక బృందం జిల్లాలోని ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించనుంది. నివేదిక ఆధారంగా ఎయిర్‌పోర్ట్ స్థలంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి Tummala Nageswara Rao ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి Kinjarapu Ram Mohan Naidu ను కలిసి కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అంశంపై చర్చించారు. ఆ భేటీలో: కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌కు గతంలో పరిశీలించిన రెండు స్థలాలు అనుకూలంగా లేవని వివరించారు. కొత్తగా గుర్తించిన 4–5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందాన్ని పంపాలని కోరారు. సెప్టెంబర్ 7న కేంద్ర బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చి స్థలాలను పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. కేంద్ర సాంకేతిక బృందం నివేదిక వచ్చిన తర్వాతే ఖరారు చేసే అవకాశం ఉంది.

ఖమ్మం

కాకరవాయిలో అఖిలపక్ష సమావేశం

తిరుమలాయపాలెం మండలం,కాకరవాయి కోతుల బెడద, ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రభుత్వానికి హెచ్చరిక కాకరవాయి గ్రామంలో రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోతుల బెడద, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వివిధ పార్టీల నాయకులు చర్చించి ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాల్సి ఉన్నప్పటికీ, కోతుల బెడద కారణంగా పంటలు వేసుకోలేకపోతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే కోతులను పట్టుకుని పునరావాస చర్యల్లో భాగంగా అడవుల్లో వదిలి, కాకరవాయి పరిసర ప్రాంతాల్లో కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాకరవాయి గ్రామపంచాయతీ పరిధిలోని ఐలమ్మ సెంటర్, సర్దార్ పాపయ్య గౌడ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను కొందరు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. గతంలో అధికారులు నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజల అవసరాలకు వినియోగించాలని కోరారు. ఈ అంశాలపై ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించారు. సమస్యలను పరిష్కరించకపోతే అన్ని పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో బీఎస్పీ నాయకులు నల్లగట్టు శంకర్ మహరాజ్, ఎన్నవైన రమేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కటుకూరి శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకులు ఇందూరి మహేష్, సీపీఐ జిల్లా నాయకులు దంతాల బాలరాజు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు కొత్తపల్లి శివయ్య, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షులు పెనుగొండ ఉప్పలయ్య, టీడీపీ నాయకులు దేశోజు పూర్ణాచారి, సీపీఎం నాయకులు కొత్తపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.