Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి మైనార్టీ నేత షేక్ గయాజ్

Punnami Newsroom Published:
వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి మైనార్టీ నేత షేక్ గయాజ్

Story highlights

  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ గయాజ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
  • తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలోని తాజా రాజకీయపరిస్థితులు మైనార్టీ సమస్యలపై చర్చించారు.
  • ఈ సందర్భంగా షేక్ గయాజ్ మాట్లాడుతూ..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ గయాజ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలోని తాజా రాజకీయపరిస్థితులు మైనార్టీ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా షేక్ గయాజ్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో కనిగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ భేటీలో ఒంగోలు మాజీ డిసిసిబి చైర్మన్ ప్రసాద్ రెడ్డి, కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ సరిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *