Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: సర్దార్ సర్వాయి పాపన్న జనగామ స్టేషన్గన్పూర్ సముద్రాల

జనగాం

​సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో తెలంగాణ ధీరుడు, బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను మంగళవారం గ్రామస్తుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ​ఈ కార్యక్రమంలో సముద్రాల గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు వీరగోని నారాయణ, ఉపాధ్యక్షులు సముద్రాల యాదగిరి, కార్యదర్శి కన్నరాజు, జనగామ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ పాల్గొని ప్రసంగించారు. సర్వాయి పాపన్న పోరాట పటిమను, ఆయన ఆశయాలను ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని, సమాజ శ్రేయస్సు కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు వీరగోని గణేష్, వీరగోని అశోక్, వీరగోని నవీన్, వీరగోని యాదగిరి,ప్రవీణ్ అజయ్ సత్తయ్య శ్రీకాంత్ అనిల్ , సముద్రాల శ్రీను సత్తనరాయణ గుండె లక్ష్మణ్ తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.