వార్త ముఖ్యాంశాలు
- 📡 రెండు రోజులుగా జియో సిగ్నల్ కష్టాలు విశాఖపట్నం జిల్లా,,ఆనందపురం,, అక్టోబర్ 10 (పున్నమి ప్రతినిధి) :: విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శోంఠ్యం పరిసర ప్రాంతాల్లో జియో మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ సమస్య వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
- గత రెండు రోజులుగా సిగ్నల్స్ సరిగా అందకపోవడంతో ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఇంటర్నెట్ వినియోగించడం వంటి సేవలకు అంతరాయం కలుగుతోందని స్థానిక వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- నీళ్ల కుండీలు, మింది వానిపాలెం, గుమ్మడివానిపాలెం, గొంతెనవానిపాలెం, దిబ్బ మీద పాలెం తదితర గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య కారణంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
📡 రెండు రోజులుగా జియో సిగ్నల్ కష్టాలు
విశాఖపట్నం జిల్లా,,ఆనందపురం,, అక్టోబర్ 10 (పున్నమి ప్రతినిధి) ::
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం శోంఠ్యం పరిసర ప్రాంతాల్లో జియో మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ సమస్య వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. గత రెండు రోజులుగా సిగ్నల్స్ సరిగా అందకపోవడంతో ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఇంటర్నెట్ వినియోగించడం వంటి సేవలకు అంతరాయం కలుగుతోందని స్థానిక వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీళ్ల కుండీలు, మింది వానిపాలెం, గుమ్మడివానిపాలెం, గొంతెనవానిపాలెం, దిబ్బ మీద పాలెం తదితర గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య కారణంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్ కాల్స్ చేసుకోవడంలోనూ, ఆన్‌లైన్ సేవలు వినియోగించుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
ప్రస్తుతం మొబైల్ ఫోన్ వినియోగం రోజువారీ జీవితంలో కీలకంగా మారిన నేపథ్యంలో, నెట్‌వర్క్ సమస్యలు ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఆన్‌లైన్ సేవలపై ఆధారపడే వారు సైతం ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
📌 జియో సంస్థ అధికారులు స్పందించాలి!
శోంఠ్యం పరిసర గ్రామాల్లో నెలకొన్న నెట్‌వర్క్ సమస్యపై సంబంధిత జియో సాంకేతిక సిబ్బంది స్పందించి, సమస్యకు గల కారణాలను పరిశీలించి, వీలైనంత త్వరగా సిగ్నల్స్‌ను పునరుద్ధరించాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రజలకు అంతరాయం లేని మొబైల్ సేవలు అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల అవసరాలకు కీలకమైన మొబైల్ సేవల్లో అంతరాయాలు లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత సంస్థపై ఉందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.