Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: రిపోర్టర్ ఆనంద్

అనకాపల్లి

వృద్ధురాలి బంగారు గొలుసు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. మహిళ అరెస్ట్!

సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితురాలి గుర్తింపు.. చోరీ సొత్తు స్వాధీనం యలమంచిలి: పట్టణంలో సంచలనం సృష్టించిన 80 ఏళ్ల వృద్ధురాలిపై కారం చల్లి, మూడున్నర తులాల బంగారు గొలుసును దోచుకెళ్లిన కేసును యలమంచిలి పట్టణ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళను అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ ధనుంజయరావు కేసు వివరాలను వెల్లడించారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌తో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితురాలిని గుర్తించినట్లు తెలిపారు. ఆమె స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న మహిళగా గుర్తించినట్లు వివరించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని, అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో పట్టణ పోలీసులు సమర్థంగా వ్యవహరించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్‌ఐ సావిత్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

పరిహారం, పునరావాసం కల్పించకపోతే ఉద్యమం: రైతు సంఘం హెచ్చరిక

రాంబిల్లి: అప్పన్నపాలెం, గొరపూడి, ఎస్‌ఈజెడ్‌ భూ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం, పునరావాసం, ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రీ అప్పారావు, జిల్లా నాయకుడు ఎన్‌.నారాయణరావు డిమాండ్ చేశారు. మంగళవారం నిర్వాసిత రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అప్పన్నపాలెం, గొరపూడి ప్రాంతాల్లో రైతుల భూముల చుట్టూ సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి, ఇనుప మెష్‌లు బిగించినా పరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. రైతులకు అండగా ఉంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం, ప్రైవేట్ ఫార్మా కంపెనీలకు భూములు కేటాయిస్తూ నిర్వాసితుల ప్రయోజనాలను విస్మరించిందని విమర్శించారు.నష్టపరిహారం, పునరావాసం, ఉపాధి కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే నిర్వాసితులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జి.దేవుడు నాయుడు, కూండ్రపు సోము నాయుడు, నిర్వాసిత రైతులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఎలమంచిలిలో 18 మందికి రూ.12.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

ఎలమంచిలి: అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.12.40 లక్షల చెక్కులను 18 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఏపీఆర్‌డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, అనకాపల్లి జిల్లా టీడీపీ ఎన్నికల ఇన్‌ఛార్జి కొండపల్లి అప్పలనాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ధూళి రంగనాయకులు, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, గొర్ల నానాజీ, పీల తులసీరామ్, విజయబాబు, ఎరిపిళ్లి చిట్టిబాబు, దాడి రమేష్, ఆర్‌ఎస్ నాగేశ్వరరావు, ఆడారి ఆదిమూర్తి, గొన్నబతుల నాగేశ్వరరావు, నారాయణమ్మ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో వైఎస్సార్‌సీపీ గ్రామస్థాయి సమావేశం

ఏటికొప్పాక గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు చింతలపాటి రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.అనంతరం జడ్పీటీసీ సంధ్య రామును నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సంధ్య రాము, మైలారు శ్రీను, కరణం రవి, విసం వాసు, ఉద్దాండం త్రినాథరావు (యూటీఆర్), విసం బంగారుబాబు, విసం శ్రీనివాసు, సెన్నంశెట్టి రాము, దిమిలి రమణబాబు, దేవారపు రమణ, జామి రమణ, విసరపు శ్రీను, పెదపూడి యేసు, బోగుడు గోవింద్, పంచదార్ల బాబ్జి, విసం కాసుబాబు, గొంతుమూర్తి రమణ, కుప్పిన బాబ్జి, శ్రీహరి బాబు, యర్రంశెట్టి వెంకటరమణతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి

జనరాజ్ దాస్ సేవలు చిరస్మరణీయం

మాజీ ఆర్‌ఈసీఎస్‌ చైర్మన్‌ పెంటకోట జనరాజ్ దాస్‌ 67వ జయంతి వేడుకలను మునగపాక మండల కేంద్రంలోని శ్రీ నందీశ్వర ప్రాంగణం, తులసి కళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ పప్పల చలపతిరావుతో పాటు ఏపీఆర్డీసీ చైర్మన్‌, యలమంచిలి టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనరాజ్ దాస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజానికి, నియోజకవర్గానికి ఆయన అందించిన సేవలను, ప్రజాక్షేత్రంలో చేసిన కృషిని ప్రగడ నాగేశ్వరరావు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునగపాక టీడీపీ మండల అధ్యక్షుడు పెంటకోట విజయ్‌, అచ్చుతాపురం మండల అధ్యక్షుడు పీలా తులసీరామ్‌, రాష్ట్ర గవర్నర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భీమరశెట్టి శ్రీనివాసరావు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు, అచ్చుతాపురం ప్రధాన కార్యదర్శి కాండ్రేగుల అప్పారావుతో పాటు పలువురు స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

అనకాపల్లి

ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ

ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన లోగోను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ సోమవారం ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ఈ అసోసియేషన్ అధికారిక లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ సమాజంలో పత్రికారంగం, మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, ముఖ్య సలహాదారులు, కార్యవర్గ సభ్యులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనకాపల్లి

రోడ్డు భద్రత, మహిళల రక్షణపై అవగాహన

లైనకొత్తూరు గ్రామంలో సోమవారం వీవోఏలు (VOAs), ఎంఎంఎస్‌ సభ్యులకు రోడ్డు భద్రత, మహిళలపై జరిగే నేరాల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర, ట్రాఫిక్ ఎస్‌ఐ రామకృష్ణతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే మహిళలపై జరిగే వేధింపులు, ఇతర నేరాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు మహిళల రక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర, ట్రాఫిక్ ఎస్‌ఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది పేర్కొన్నారు.

అనకాపల్లి

వాడ నరసాపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ

రాంబిల్లి: మండలంలోని వాడ నరసాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలకు స్వయంగా గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ, దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డు కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పించడంలో ఈ కార్డులు కీలకమని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలందరూ చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ధూళి నాగరాజు, మాజీ ఎంపీపీ శ్రీనుబాబు, నియోజకవర్గ నాయకుడు అప్పలసూరి మాస్టర్, ప్రచార కమిటీ అధ్యక్షుడు కోవిరి రామకృష్ణ, గ్రామ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి

జనసేన నిర్వాహక్ దళ్ సమన్వయ సమావేశం

అనకాపల్లి జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అనకాపల్లి పార్లమెంటు పరిధికి చెందిన సమన్వయకర్తలు, 32 మంది సభ్యులతో కూడిన నిర్వాహక్ దళ్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పీవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహక్ దళ్ సభ్యుల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతను నాయకులు వివరించారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి

యలమంచిలిలో జనసేన కీలక నియామకం.. అసెంబ్లీ నిర్వాహక దళ్‌గా గొర్లి సత్తిబాబు!

జనసేన అసెంబ్లీ నిర్వాహక దళ్‌గా గొర్లి సత్తిబాబు నియామకం యలమంచిలి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతల్లో భాగంగా జనసేన పార్టీ కీలక నియామకం చేపట్టింది. యలమంచిలి మండలం యర్రవరం గ్రామానికి చెందిన గొర్లి సత్తిబాబును అసెంబ్లీ నిర్వాహక దళ్‌గా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ సందర్భంగా గొర్లి సత్తిబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ముఖ్య ప్రతినిధి సుందరపు సతీష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, స్థానిక ఎన్నికల సమన్వయంలో చురుకుగా పనిచేస్తానని సత్తిబాబు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.