Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: రంపచోడవరం

తూర్పు గోదావరి

రంపచోడవరం ఎస్టీ కమిషన్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం

పోలవరం, రంపచోడవరం, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 5 పోలవరం, రంపచోడవరం మండల కేంద్రంలోని ఎస్టీ కమిషన్ కార్యాలయంలో సోమవారం, 05-10-2026న గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో పోలవరం జిల్లా పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన గిరిజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ సోళ్ల బొజ్జిరెడ్డిగారుప్రజలనుంచిఅర్జీలుస్వీకరించనున్నారు.గిరిజనులకు సంబంధించిన భూమి, విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణం, తాగునీరు, రహదారులు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు తదితర సమస్యలపై అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నారు.గిరిజనులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సోమవారం రంపచోడవరం ఎస్టీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ గారు అందుబాటులో ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతి గిరిజనుడు ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.అలాగే కూటమి పార్టీ నాయకులు, ఆదివాసీ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని సమస్యలను చైర్మన్ గారి దృష్టికి తీసుకువచ్చి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు