Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: బీఆర్‌ఎస్

హైదరాబాద్

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అనుముల కుటుంబ అవినీతిని ఆధారాలతో ప్రశ్నించినందుకే క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఢిల్లీలో రాజ్యాంగంపై మాట్లాడుతున్న రాహుల్, తెలంగాణలో రేవంత్ రెడ్డి ద్వారా అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, ఆధారాలతో ప్రశ్నించిన వారిని జైలుకు పంపడం ప్రజాస్వామ్య విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్

పాస్‌పోర్టు జప్తు వార్తపై కేటీఆర్ నోటీసు

తన పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు ఈనాడు ప్రచురించిన వార్త వాస్తవ విరుద్ధమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తరఫు న్యాయవాది లీగల్‌ నోటీసు పంపించారు. కోర్టు ఎలాంటి జప్తు ఉత్తర్వులు ఇవ్వలేదని, ఏసీబీ అధికారి కేవలం మెమో మాత్రమే దాఖలు చేశారని పేర్కొన్నారు. వార్తను 48 గంటల్లో ఉపసంహరించుకుని, అదే ప్రాధాన్యతతో సవరణ ప్రచురించడంతోపాటు బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే సివిల్‌, క్రిమినల్‌ పరువునష్టం చర్యలు చేపడతామని నోటీసులో హెచ్చరించారు.