Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: న్యాయ విజ్ఞాన సదస్సు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మధ్యవర్తిత్వ ఫలితాన్ని పక్షాలే నియంత్రిస్తారు

మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఫలితాన్ని పక్షాలే నియంత్రించవచ్చని లోక్ అదాలత్ జడ్జి వై.జె. పద్మశ్రీ తెలిపారు. జొన్నవాడలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ, మధ్యవర్తిత్వంలో గోప్యతకు ప్రాధాన్యం ఉంటుందని, కుటుంబ, వాణిజ్య వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చన్నారు. మహిళా హక్కులు, డ్రగ్స్, సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, భ్రూణహత్య నిరోధక చట్టాలపై అవగాహన కల్పించారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుతుందని తెలిపారు.