పాస్‌పోర్టు జప్తు వార్తపై కేటీఆర్ నోటీసు
తన పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు ఈనాడు ప్రచురించిన వార్త వాస్తవ విరుద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫు న్యాయవాది లీగల్ నోటీసు పంపించారు. కోర్టు ఎలాంటి జప్తు ఉత్తర్వులు ఇవ్వలేదని, ఏసీబీ అధికారి కేవలం మెమో మాత్రమే దాఖలు చేశారని పేర్కొన్నారు. వార్తను 48 గంటల్లో ఉపసంహరించుకుని, అదే ప్రాధాన్యతతో సవరణ ప్రచురించడంతోపాటు బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే సివిల్, క్రిమినల్ పరువునష్టం చర్యలు చేపడతామని నోటీసులో హెచ్చరించారు.

