Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: తాజా వార్త పర్యావరణం పరిరక్షణ స్వచ్ఛభారత్ జనగామ జిల్లా జఫర్గడ్ మండలం షా పల్లి గ్రామం

జనగాం

షాపల్లిలో ప్లాస్టిక్ నివారణే ధ్యేయంగా క్లాత్ బ్యాగ్స్ పంపిణీ

​షాపల్లి గ్రామంలో పర్యావరణ పరిరక్షణను కాపాడే ముఖ్య ఉద్దేశంతో బాలవికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచితంగా క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది. మన దైనందిన జీవితంలో విచ్చలవిడిగా మారుతున్న ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే తీవ్రమైన దుష్పరిణామాలపై గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా విస్తృతమైన అవగాహన కల్పించడం జరిగింది. ​ఈ సత్కార్యానికి ముందుకు వచ్చిన దాతలు కొడారి యాకయ్య, ఎండీ ముస్తఫా, ఊకంటి పద్మ మరియు యాతం మమతలు తమ సొంత ఖర్చులతో ఈ క్లాత్ బ్యాగ్స్‌ను సమకూర్చి గ్రామస్తులకు అందజేశారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించి, ప్రతి ఒక్కరూ వస్త్ర సంచులను మాత్రమే ఉపయోగించడం ద్వారా మన పరిసరాలను, పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. భావి తరాలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.