Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన నూతన కమిటీ

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందికిషన్ డైరెక్టర్లు ఇమామ్ కంచర్ల రాజు చందు నాయక్ కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అభివృద్ధి రైతులకు మెరుగైన సేవలు అందించే అంశాలపై చర్చించినట్లు తెలిపారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం వైస్ చైర్మన్ నందికిషన్ మరియు డైరెక్టర్లు రైతులకు మెరుగైన మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు

రాజన్న సిరిసిల్ల

భూ భారత్ కింద భూముల రీ సర్వే ప్రక్రియ

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా భూభారతి కింద భూముల రి సర్వే రైతుల సమక్షంలో చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు బోయినపల్లి మండలం వరద వెళ్లి లో భూభారత్ కింద రోవర్ యంత్రంతో భూముల రీ సర్వే పనులు కొనసాగుతుండగా జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు సర్వే యంత్రంతో వివరాలు ఎలా తీసుకుంటారు పరిశీలించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా భూభారతి కింద భూముల రీ సర్వే పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు గ్రామంలో సర్వేపై రైతులకు ముందుగా జిపిఓలు పంచాయతీ కార్యదర్శులు సమాచారం అందించాలని సూచించారు భూముల వివరాలను పూర్తి కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు

రాజన్న సిరిసిల్ల

జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసన

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 31 మంది జూనియర్ డాక్టర్ల నిరసన కొనసాగుతుంది అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి ఓపి విధులు బహిష్కరించి ప్లకార్డులతో నిరసన తెలిపారు ప్రభుత్వ ఆమోదిత స్టైఫెండ్ రూ.29.792 కాగా జూనియర్ డాక్టర్లకు కేవలం రూ. 5000 అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రోజుకు రూ.166 తో కనీస అవసరాలు తీర్చుకోవడం కష్టంగా ఉందన్నారు ఇతర ఎంబీబీఎస్ ఇంటర్నల్ తో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు సమాన స్టైఫెండ్ చెల్లించాలని ప్రభుత్వం తమ సమస్యను తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు

రాజన్న సిరిసిల్ల

రోడ్డు నిర్మాణం కోసం నిరసన AIFTU న్యూ నాయకులు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట ఎక్స్ రోడ్ నుంచి మొదటి బైపాస్ ను కలుపుతూ 80 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని AIFTU న్యూ నాయకులు డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో రోడ్డు మంజూరైన ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రంపేట తో పాటు శ్రీనగర్ శాంతినగర్ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేలా రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు లేని పక్షంలో రోడ్డుపై టెంట్ వేసి ఆందోళన చేపడుతామని AIFTU న్యూ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సోమిశెట్టి దశరథం అన్నారపు శ్రీనివాస్ AIFTU న్యూ నాయకులు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు

రాజన్న సిరిసిల్ల

రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు బాధ్యతలు తీసుకోవడం జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందికిషన్ మరియు డైరెక్టర్లు ఎండి ఇమామ్ మిట్టపల్లి లక్ష్మణ్ వీర్నపల్లి స్వరూప దండు శ్రీనివాస్ కంచర్ల రాజు బొల్లు గంగయ్య పందుల నాగేష్ సిరిపురం మహేందర్ అంతడుపుల గోపాల్ భూక్య చందర్ ముత్యాల సత్యనారాయణ అజ్మీర విశ్వనాథ్ ఈరోజు బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాల యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నంది కిషన్ డైరెక్టర్లు బాధ్యతలు తీసుకున్నారు

రాజన్న సిరిసిల్ల

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కలిసిన విప్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిన మల్లికార్జున ఖర్గే ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలతో కలిసి ఆది శ్రీనివాస్ మల్లికార్జున ఖర్గే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పని తీరుపై చర్చించినట్లు సీఎం సభను విజయవంతం చేసినందుకు పార్టీ కార్యకర్తలకు నాయకులు ప్రత్యేక అభినందనలు తెలపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని అని తెలిపారు

రాజన్న సిరిసిల్ల

వేములవాడలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో బతుకమ్మ పండుగకు ముందస్తుగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అన్ని వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు రోడ్డుపై చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా స్వచ్ఛ ఆటో లకు అందించి మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ పండుగను పరిశుభ్రమైన వాతావరణం లో జరుపుకునేలా చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు బతుకమ్మ వేడుకల సందర్భంగా వేములవాడలో వివిధ వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి బతుకమ్మ వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఆటపాటలతో దాండియా కోలాటాలతో ఆనందోత్సవాలు మధ్య పండుగను జరుపుకునేలా ఏర్పాట్లు చేశారు

రాజన్న సిరిసిల్ల

బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ సంబరాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పర్యాటక సంస్కృతిక శాఖ ఏ వాని ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు బతుకమ్మ వేడుకల నిర్వాహనతోపాటు పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుగా అమలు నిధుల సమీకరణ ప్రాముఖ్యం పర్యాటక ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఐ డి ఓ సి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ వాణి ప్రసాద్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలు గ్రామాలు పట్టణాల్లో ప్రజల భాగస్వామ్యంతో పండుగ వాతావరణం లో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మహిళలు యువతలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలన్నారు

రాజన్న సిరిసిల్ల

హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 161 వ హనుమాన్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 161 హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రగణంలోని ఆంజనేయ స్వామి సన్నిధిలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 161 సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని చాలీసా పఠించారు అనంతరం సమితి సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు హిందూ ఉత్సవ సమితి సభ్యులు భక్తులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ చాలీసా పటించి భక్తిలో నిమగ్నమై ఉన్నారు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం పట్టించారు భక్తజన సభ్యులు పాల్గొని స్వామివారిని పూజించారు

రాజన్న సిరిసిల్ల

37వ వార్డులో అంబా భవాని అమ్మవారికి ఒడిబియ్యం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 37వ వార్డులో అంబ భవాని దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి దంపతులు అంబా భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని విద్య వ్యాపారం వ్యవసాయం వంటి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరమన్నారు దసరా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకున్నారు