Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: ఎలమంచిలి

అనకాపల్లి

ఒకేసారి నాలుగు బ్రహ్మకమలాలు వికాసం

ఆహ్లాదకరమైన సువాసనతో ఆకట్టుకున్న అరుదైన పుష్పాలు పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) హరిపాలెం, అందలపల్లి: అరుదైన బ్రహ్మకమలం పుష్పాలు ఒకేసారి నాలుగు వికసించడంతో అందలపల్లిలోని ఓ ఇంటి పెరటి తోట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, ఎస్ఎస్ఎఫ్ సబ్ డివిజన్ కన్వీనర్ బి.వి. రమణ పెరటి తోటలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మూడు సంవత్సరాల క్రితం తీర్థయాత్ర సందర్భంగా తీసుకొచ్చిన బ్రహ్మకమలం మొక్కను అప్పటి నుంచి ఎంతో శ్రద్ధగా సంరక్షిస్తున్నారు. సాధారణంగా రాత్రివేళ వికసించే బ్రహ్మకమలం తెల్లని రేకులతో అందంగా కనిపించడమే కాకుండా, వికసించిన సమయంలో ఆహ్లాదకరమైన సువాసనను వెదజల్లుతుంది. రాత్రి సమయంలో పుష్పాలు పూర్తిగా విచ్చుకుని ఉదయం వరకు మాత్రమే అందంగా కనిపించడం దీని ప్రత్యేకత. ఒకేసారి నాలుగు పుష్పాలు వికసించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. భారతీయ సంప్రదాయాల్లో బ్రహ్మకమలానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని భావిస్తారు. సరైన సంరక్షణతో ఇళ్ల పెరటి తోటల్లోనూ ఈ అరుదైన పుష్పాన్ని పెంచుకోవచ్చని రమణ తెలిపారు.

అనకాపల్లి

నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అనకాపల్లి, అక్టోబర్ 4: రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ఆదివారం అనకాపల్లిలోని శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ హోంమంత్రి అనితకు సాదర స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానం సిబ్బంది పూర్ణకుంభంతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం హోంమంత్రి అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ శ్రీ పీల నాగశీను, ఆలయ ఈవో వై. శ్రీధర్, ఆలయ డైరెక్టర్లు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

నూతగుంటపాలెం లో మెగా మెడికల్ క్యాంపు..

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి సెప్టెంబర్ 04: సమిద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నూతగుంటపాలెం లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 250 మందికి బీపీ, షుగర్ పరీక్షలతో పాటు వివిధ రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అలాగే సుమారు 250 మందికి ఐసీటీసీ ( ఐ సి టి సి) పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమిద స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డి. వీరభద్రరావు, ప్రెసిడెంట్ పి. రమణ, ప్రోగ్రామ్ మేనేజర్ వరహాలు బాబు, ఎం&ఈ సంధ్యారాణి, ఏఎన్‌ఎం కే.లక్ష్మి, ఔట్రీచ్ వర్కర్లు కే.నాగు, సీహెచ్. బాల, టీ.నాగదుర్గ, కె. అనురాధ మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది మరియు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ మెగా మెడికల్ క్యాంపునకు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

అనకాపల్లి

సీడ్ బాల్స్‌తో పచ్చదనానికి బాట..!

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: అప్పికొండ గణేష్ పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అనకాపల్లి: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా హేమగిరి సత్యనారాయణ స్వామి కొండపై గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్ పాల్గొని కొండ ప్రాంతంలో సీడ్ బాల్స్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. సీడ్ బాల్స్ ద్వారా ఖాళీ ప్రదేశాల్లో సహజసిద్ధంగా మొక్కలు పెరిగేలా చేయవచ్చని తెలిపారు. భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ, గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు, వృక్షమిత్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల పణిభూషణ్ శ్రీధర్ పాల్గొన్నారు. “ఒక సీడ్ బాల్–ఒక మొక్కకు నాంది” అనే సందేశంతో కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గ్రీన్ క్లబ్ సభ్యులు, మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసి, నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.

అనకాపల్లి

రైతు మృతిపై కరణం ధర్మశ్రీ ఆవేదన

మృతదేహానికి గౌరవం ఇవ్వకుండా టెంట్‌ ఏర్పాటుకు అడ్డంకులా? పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) రాంబిల్లి: మండలంలోని గొరపూడి పంచాయతీలో భూసేకరణ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయనకు.. అంత్యక్రియల సమయంలో టెంట్‌ ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు, పోలీసులు అనుమతించలేదనే విషయం దృష్టికి వచ్చింది. దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైతు మృతి చెందిన విషాద సమయంలోనైనా మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ధర్మశ్రీ పేర్కొన్నారు. కనీసం అంత్యక్రియలకు టెంట్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడి అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మృతి చెందిన రైతు కుటుంబానికి గౌరవం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.

అనకాపల్లి

పచ్చదనం.. పరిశుభ్రతే ధ్యేయం ప్రతి ఆదివారం శ్రమదానంతో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ జ్యోతి యువత

పున్నమి ప్రతినిధి ఆనంద్ యలమంచిలి: గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లి గ్రామానికి చెందిన గ్రామ జ్యోతి యువత ప్రతి ఆదివారం శ్రమదానం చేపడుతున్నారు. ఆదివారం ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు గ్రామంలోని పలు ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆదివారం గ్రామ ప్రధాన మార్గంలోని శివాలయం వద్ద రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలు, తీగలు, చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. రోడ్డు పక్కన పిచ్చిమొక్కలు, చెత్త పేరుకుపోవడం వల్ల విషపురుగులు, విషజంతువుల సంచారంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యగా శుభ్రత చేపట్టారు. అనంతరం రహదారి ఇరువైపులా చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని ప్రయాణికులకు చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ జ్యోతి యువత సభ్యులు నిఖిల్, జయరాజ్, దరిణి, యామిని, రజని, సీతా మహాలక్ష్మితో పాటు పలువురు చిన్నారులు పాల్గొన్నారు

అనకాపల్లి

వరాహ నది బ్రిడ్జి కింద వ్యర్థాల డంపింగ్‌పై గ్రామస్థుల ఆందోళన

స్మశానవాటిక దారికి చెత్త అడ్డంకి! పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) ఏటికొప్పాక గ్రామంలోని వరాహ నది బ్రిడ్జి కింద చెత్త, వ్యర్థ పదార్థాలను వేస్తుండటంతో స్మశానవాటికకు వెళ్లే దారి ఇబ్బందికరంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సేకరించిన చెత్తను పారిశుద్ధ్య కార్మికులు బ్రిడ్జి కిందకు తరలించి వేస్తుండటంతో అక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇదే మార్గం మీదుగా మృతదేహాలను స్మశానవాటికకు తరలిస్తుండగా, చెత్త కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంబంధిత పంచాయతీ అధికారులు, కార్యదర్శి వెంటనే స్పందించి బ్రిడ్జి కింద పేరుకుపోయిన చెత్తను తొలగించి మార్గాన్ని శుభ్రం చేయించాలని కోరుతున్నారు. చెత్తను ఇష్టానుసారంగా వేయకుండా డంపింగ్ యార్డు లేదా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి తరలించి శాస్త్రీయంగా నిర్వహించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అనకాపల్లి

లారస్ ఫార్మా భూసేకరణపై సీపీఎం ఆగ్రహం

రైతులకు న్యాయం చేయాలని డిమాండ్.. నలుగురు సీపీఎం నాయకుల అరెస్ట్ పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) రాంబిల్లి: లారస్ ఫార్మా కంపెనీ కోసం అప్పన్నపాలెం, గోరపూడి, జెడ్‌ చింతవ గ్రామాల రైతుల భూములను సేకరించే చర్యలను సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించింది. రైతులకు మద్దతుగా వెళ్లిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌. శంకరరావు, మండల కార్యదర్శి జి. దేముడు నాయుడు, మండల కమిటీ సభ్యులు ధోని కాశి, ఎర్రిపల్లి రాములను పోలీసులు అరెస్టు చేసి రాంబిల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారని పార్టీ పేర్కొంది. సుమారు 576 ఎకరాల జిరాయితీ, ప్రభుత్వ భూముల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపింది. పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలపై రైతులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో భూసేకరణ చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేసింది. న్యాయస్థానంలో వ్యవహారం కొనసాగుతుండగా పోలీసు బలగాలను మోహరించి కంచె ఏర్పాటు చేయడం అన్యాయమని విమర్శించింది. రైతులకు న్యాయమైన పరిహారం, పునరావాస ప్యాకేజీలు చెల్లించిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. Uploaded Video:

అనకాపల్లి

ఏటికొప్పాకలో ఆరు అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు సత్కారం

సేవా సంకల్ప అభియాన్‌లో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) ఏటికొప్పాక: ఎలమంచిలి రూరల్ మండలం ఏటికొప్పాక గ్రామంలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఆరు అంగన్వాడీ కేంద్రాల టీచర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలను గుర్తిస్తూ టీచర్లను అభినందించారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషణలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నూకరాజు, మండల యువమోర్చా అధ్యక్షులు కడారి అప్పలరాజు, మండల కిసాన్ మోర్చా కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

అనకాపల్లి

అచ్యుతాపురంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం అచ్యుతాపురం ఎస్‌కేఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఏపీ ఆర్‌డీసీ చైర్మన్, నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మాజీ ఎంపీ పప్పల తిరుపతిరావు, మాజీ జడ్పీ చైర్మన్ లాలం భవాని భాస్కర్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. పప్పల చలపతిరావు, గోంతిన హరీష్, పీలా తులసీరామ్, గొర్లె శివనారాయణమూర్తి (నానాజీ), ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, లాలం శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. అనంతరం 43 మంది బాధితులకు రూ.25.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి శివఅప్పారావు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దూళి రంగనాయకులు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ డొక్కా నాగభూషణం, దాడి రమేష్, ఆడారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.