ఎలమంచిలిలో వైఎస్సార్సీపీ శక్తిప్రదర్శన.. భారీ ర్యాలీతో బొద్దపు తులసి–ఎర్రయ్య దొర నామినేషన్!
ఎలమంచిలి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలమంచిలిలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించి తన బలాన్ని ప్రదర్శించింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బొద్దపు తులసి–ఎర్రయ్య దొర వైఎస్సార్సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో, అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్, నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు సమక్షంలో నామినేషన్ కార్యక్రమం జరిగింది. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. పార్టీ శ్రేణుల నినాదాల మధ్య ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం అభ్యర్థి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









