జనసేన చైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కర్రి ఝాన్సీ..
యలమంచిలి పురపాలక సంఘం రెండవ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిరోజు శుక్రవారం జనసేన పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిగా కర్రి ఝాన్సీ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జనసేన పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమెకు స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం స్థానిక సౌభాగ్య అపార్ట్మెంట్ వద్ద నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. పట్టణ ప్రధాన రహదారి మీదుగా సాగిన ఈ ర్యాలీ కోలాహలంగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ వరహాలకు కర్రి ఝాన్సీ తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. పార్టీ ‘బి-ఫామ్’ పత్రాలను త్వరలోనే సమర్పిస్తామని ఈ సందర్భంగా ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కర్రి ఝాన్సీ మాట్లాడుతూ… ప్రజలకు నిరూపమానమైన సేవలు అందించాలనే దృక్పథంతోనే జనసేన పార్టీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీకి దిగానని చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బొద్ధపు శ్రీను మాట్లాడుతూ, మొదటి నుంచి పార్టీ అభివృద్ధికి శ్రమిస్తున్న ఝాన్సీకి పార్టీ అధిష్ఠానం, నాయకత్వపు పూర్తి ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శేషు, పట్టణ అధ్యక్షుడు బొద్ధపు శ్రీను, నూకన్నదొర, శ్రీరామదాసు, రమేష్ నాయుడు, లోవరాజు, కొట్టారు శ్రీను, శేఖర్, లంక రాజు, నరేష్, గోపి, సత్యనారాయణతో పాటు జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









