Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

చేజర్ల మండలాన్ని కైవసం చేసుకునే దిశగా కొమ్మి వ్యూహం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • చేజర్ల మండలాన్ని కైవసం చేసుకునే దిశగా కొమ్మి వ్యూహం..
  • రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన దిగ్గజం...
  • స్థానిక ఎన్నికల్లో తన సత్తా మరోసారి చూపనున్న కొమ్మి..

చేజర్ల మండలాన్ని కైవసం చేసుకునే దిశగా కొమ్మి వ్యూహం..

రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన దిగ్గజం…

స్థానిక ఎన్నికల్లో తన సత్తా మరోసారి చూపనున్న కొమ్మి..

చేజర్ల (జర్నలిస్ట్ వినోద్‌కుమార్ )

           ఆత్మకూరు నియోజవర్గ పరిధిలోని చేజర్ల మండలం ఆది నుంచి రాజకీయంగా ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు అడ్డాగా నిలుస్తోంది. ప్రస్తుత రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా చేజర్ల మండలాధ్యక్ష పదవి జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. జడ్పిటిసి జనరల్ మహిళకు కేటాయించడం జరిగింది.దీంతో ఆది నుంచి కొనసాగుతున్న కొమ్మి హవా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ను అదే ఒరవడిని కొనసాగించేందుకు రిజర్వేషన్లు దోహద కారిగా మారాయి. మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలలో తూర్పుపల్లి, మడపల్లి ఎంపిటిసి స్థానాలను జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. దీంతో ఈ రెండు స్థానాల్లో విజయం సాధించే అభ్యర్థులు మండల పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తూర్పుపల్లి నుండి కూటమి అభ్యర్థిగా ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు సోదరుడు కొమ్మి సిద్దుల నాయుడు పోటీ చేస్తారని చర్చ సాగుతుంది. ఆయన ఆస్థానంలో విజయం సాధించి మండలాధ్యక్షుడుగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో 1994 ,2004 సంవత్సరంలో కొమ్మి లక్ష్మయ్య నాయుడు ఆత్మకూరు శాసనసభ్యులుగా విజయం సాధించడంతోపాటు తన సొంత మండలం అయిన చేజర్లలో మంచి ఆధిక్యత సాధించారు. మండల వ్యవస్థ ఆరంభంలో చేజర్ల మండల అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఆయన సతీమణి కొమ్మి ప్రమీలాదేవి చేజర్ల మండల జడ్పిటిసి సభ్యురాలుగా విజయ కేతనం ఎగరవేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయం సాధించడంలో కొమ్మి లక్ష్మయ్య నాయుడు కీలకపాత్ర పోషించారు. ఈ మండలం తో పాటు ఆత్మకూరు నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో కొమ్మి  ప్రాధాన్యత ఎంతగానో ఉంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆయనకు అభిమానులు, అనుచరులు  పెద్ద సంఖ్యలో ఉన్నారు.కొమ్మి సిద్దుల నాయుడు మండలాధ్యక్షుడుగా ఎంపిక అయితే..కూటమి అధిష్టానం సహాయ సహకారాలతో మండలాన్ని విలక్షణ రీతిలో అభివృద్ధి చేయగలరని సర్వత్రాచర్చ సాగుతుంది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు వ్యూహకర్తలుగా ఎలాంటి రాజకీయ సమీకరణాలను, ప్రత్యర్ధుల ఎత్తులకు పైఎత్తులను ఎలా వేస్తారో చూడాలి.కొమ్మి సిద్ధుల నాయుడు కూటమి అభ్యర్థిగా పోటీకి నిలిస్తే మండలంలోని అన్ని ఎంపిటిసి స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించు కొనే సత్తా కూడా ఆయనకు ఉందని అంటున్నారు.ప్రత్యర్థులు కూడా సిద్ధులు నాయుడు పై పోటీకి నిలిచేందుకు సాహసించరని చెబుతున్నారు. ఇక అంతిమ తీర్పు ఓటర్ల చేతుల్లో ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *