Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం.. పురుగుల మందు తాగి పాల వ్యాపారి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నరసరావుపేట: భార్యతో గొడవ కారణంగా మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.వివరాల్లోకి వెళితే..
  • రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలేనికి చెందిన శ్రీనివాసరావు (45), కృష్ణకుమారి పాల వ్యాపారం చేసుకుంటారు.
  • వ్యాపారం నిమిత్తం రెండేళ్ల క్రితం నరసరావుపేట పట్టణంలోని బాపనయ్యనగర్‌కు వచ్చారు.

నరసరావుపేట: భార్యతో గొడవ కారణంగా మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.వివరాల్లోకి వెళితే.. రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలేనికి చెందిన శ్రీనివాసరావు (45), కృష్ణకుమారి పాల వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారం నిమిత్తం రెండేళ్ల క్రితం నరసరావుపేట పట్టణంలోని బాపనయ్యనగర్‌కు వచ్చారు. మద్యానికి బానిసైన శ్రీనివాసరావు తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు.గురువారం ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.దీంతో మనస్తాపానికి గురైన భర్త మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు.మృతుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. వారిద్దరికీ వివాహాలు జరిగాయి. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *