Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

కబడ్డీలో ఖమ్మం పబ్లిక్ స్కూల్ సత్తా ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కబడ్డీలో ఖమ్మం పబ్లిక్ స్కూల్ సత్తా ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

SGF ఖమ్మం మండల స్థాయి కబడ్డీ సీనియర్స్ పోటీల్లో ఖమ్మం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజేత విద్యార్థులకు డీఈఓ, ఎంఈఓ, ఎస్‌జీఎఫ్ నిర్వాహకుల చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభపై పాఠశాల చైర్మన్ దాలువాయి కిషోర్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే లక్షణాలు పెంపొందుతాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచేలా విద్యార్థులకు భవిష్యత్తులో మరింత మెరుగైన శిక్షణ అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉచితంగా అత్యుత్తమ కబడ్డీ కోచింగ్ అందిస్తామని చైర్మన్ దాలువాయి కిషోర్ కుమార్ భరోసా ఇచ్చారు. విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ అందించి జిల్లా స్థాయికి తీసుకెళ్లిన పీఈటీ నువ్వుల మురళి, కురుసుం కిరణ్ లని కుడా ఆయన అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

కబడ్డీలో ఖమ్మం పబ్లిక్ స్కూల్ సత్తా ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *