ఇంటి దొంగతనాలకు చెక్ పెట్టిన కాకినాడ జిల్లా, పెద్దాపురం పోలీసులు – నిందితుడు అరెస్ట్, సుమారు రూ. 30 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం పెద్దాపురం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ : 194/2026 u/s 331(4), 305(a) BNS ప్రాపర్టీ లాస్:- 276 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండి మరియు రూ.75,000/- ప్రాపర్టీ రికవరీ:- రూ.15,00,000/- నగదు మరియు బంగారు వస్తువులు మొత్తం 105.4 గ్రాములు ముద్దాయి వివరాలు :- మామిడి శివకుమార్ @ శివ, S/o సూరిబాబు, వయస్సు 30 సంవత్సరాలు, కులం కొండరెడ్డి, కొత్తపాలెం గ్రామం, అడ్డతీగల మండలం. కేసు వివరాలు: తేదీ 25.07.2026 అర్ధరాత్రి సమయంలో పెద్దాపురం, రామారావుపేట, డి.ఎల్.పి.ఓ. కార్యాలయం ఎదురుగా ఉన్న పెద్దాపురం ఆర్.డి.ఓ. గారి నివాసంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంటి వెనుక భాగంలోని తలుపుకు కేవలం మెస్ డోర్ మాత్రమే వేసి ఉండటాన్ని గమనించి, తలుపు గడియను తెరిచి ఇంటిలోకి ప్రవేశించాడు. అనంతరం ఎవరూ లేని రెండవ గదిలోని కప్‌బోర్డ్‌లో ఉన్న తాళాన్ని తీసుకొని, దాని సహాయంతో ఇనుప అల్మారాను తెరిచి, అందులోని బంగారం భద్రపరిచే లాకర్‌లో ఉన్న సుమారు 276 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండి మరియు రూ.75,000/- నగదును అపహరించాడు. ఈ ఘటనపై ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దాపురం పోలీస్ స్టేషన్ క్రైమ్ నం.194/2026, సెక్షన్లు 331(4), 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా ముద్దాయిని పట్టుకున్న పెద్దాపురం SDPO శ్రీ ABG తిలక్ గారిని, ఈ కేసులో దర్యాప్తు అధికారి అయిన పెద్దాపురం CI శ్రీ YRK శ్రీనివాస్, పెద్దాపురం CCS CI శ్రీ అంకబాబు, IT కోర్ CI దుర్గా శేఖర్ రెడ్డి,పెద్దాపురం SI U. పాపారావు, పెద్దాపురం PS సిబ్బంది V.శేషరావు, CCS సిబ్బంది బలరాముర్తి, శ్రీహరి, మూర్తి, నాగరాజు, రమణ, S.బాలాజీ, A.మురళి లను కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ IPS గారు అభినందించారు




