Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మస్కట్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళకు జిల్లా యంత్రాంగం అండ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మస్కట్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళకు జిల్లా యంత్రాంగం అండ

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం సానపల్లి లంకకు చెందిన వేణుకుమారి మస్కట్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి సురక్షితంగా బయటపడి స్వదేశానికి చేరుకున్నారు.
  • డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం సానపల్లి లంకకు చెందిన వేణుకుమారి మస్కట్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి సురక్షితంగా బయటపడి స్వదేశానికి చేరుకున్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ రావిరాల ఆదేశాలతో అధికారులు తక్షణమే స్పందించి, మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్ సహకారంతో ఆమెను భారత్‌కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు, సంబంధిత ఏజెంట్ సమన్వయంతో వేణుకుమారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించారు. స్వదేశానికి చేరుకున్న అనంతరం వేణుకుమారి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, తనకు అందించిన సహకారం, అధికారుల చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో జిల్లా యంత్రాంగం చూపిన చొరవను కుటుంబ సభ్యులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *