డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి 75వ జయంతి సందర్భంగా రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. మలికిపురం మండలం దిండి బాలయోగి సెంటర్‌లోని ఆయన విగ్రహానికి, అనంతరం రాజోలు కాటన్ పార్క్‌లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి ఎదిగి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నత స్థాయికి చేరుకున్న బాలయోగి జీవితం ఆదర్శప్రాయమన్నారు. కోనసీమ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ సాధనకు ఆయన చేసిన ప్రయత్నాలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
