Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించాలి: కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించాలి: కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. SIR–2026లో ఇప్పటివరకు 57,902 కేసుల విచారణ పూర్తయిందని తెలిపారు. అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫారం–6, 7, 8 దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, ముఖ్యంగా ఫారం–8 దరఖాస్తులను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని, యువత ఓటు హక్కు వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించాలి: కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *