Tuesday, 10 March 2026

Blog

విశాఖపట్నం

విశాఖ ఉత్సవ్‌లో జనవరి 30న ముగ్గుల పోటీలు

విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జనవరి 30వ తేదీన ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ పోటీలు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరగనున్నాయి. సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గలవారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ కార్యాలయం సూచించింది. ఉత్తమ ముగ్గులు వేసిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

విశాఖపట్నం

జీవవైవిధ్య పరిరక్షణకు పర్యావరణ విద్య అవసరం – జెవి రత్నం

విశాఖపట్నం, (జనవరి పున్నమి ప్రతినిధి) జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ విద్యను అలవర్చుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం అన్నారు. మంగళవారం మద్దిలపాలెంలోని శ్రీ భావన విద్యా నికేతన్, అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో అంతర్జాతీయ పర్యావరణ విద్యా దినోత్సవం, అంతర్జాతీయ స్వచ్ఛ విద్యుత్తు దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హిత జీవన విధానం అవలంబించాల్సిన అవసరం ఉందని, క్లీన్ ఎనర్జీ వినియోగంతో వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రతి విద్యా సంస్థలో గ్రీన్ సోల్జర్స్‌ను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రీన్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా..

తెలంగాణ జనవరి 27 (పున్నమి ప్రతినిధి) తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలకు మోగిన నగారా.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌ఈసీ.. ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలు. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ.116మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరపనున్న ఈసీ. ఫిబ్రవరి 12రీ పోలింగ్, దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది

ఆంధ్రప్రదేశ్

” రాచపాళి రత్నావళి ” ఆడియో విడుదల

పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నెల్లూరు లోని మినీ టౌనహాలు నందు ‘ రాచపాళి రత్నావళి ‘ పద్యాలు ఆడియో విడుదల మరియు బహుజన మహనీయుల చిత్రపటాల ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మేరాయువ భారత్ జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ నేటి యువతరానికి మహనీయుల చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉంది. బహుజనుల చిత్ర పటాలను చూపించడం చాలా సంతోషమని తెలిపారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్య నిర్వహణాధికారి ఎ. నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులు మురళీమోహన్ రాజు, రాచపాలెం ఎంతో అభినందనీయులని వివరించారు. ఈసందర్భంగా సంగీత దర్శకులు దారా సురేష్, గాయకులు ఆకుతోట రమణయ్య లను సత్కరించారు. ఈకార్యక్రమంలో షేక్ రియాజ్ బాషా, అందె శ్రీనివాసులు, పాల జోష్న, అరవ రాయప్ప, మిరియాల రమణయ్య, దయాకర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కళాకారులు, పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

తెలంగాణ లో మోగిన 116మున్సిపల్, 7 కార్పొరేషన్ ఎన్నికల నగారా

ఖమ్మం జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా స్టాఫర్) నేటి నుంచి జనవరి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 12న ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపడతామని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు.

E-పేపర్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల వచ్చే నెల 11న పోలింగ్.. 13న కౌంటింగ్ రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ నేటి నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలలో ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

విశాఖపట్నం

ఆర్‌ఐసీఎస్ విద్యుత్ శాఖ ఉద్యోగి బాలుకి ఘనసన్మానం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న సందర్భంగా సత్కారం

విశాఖపట్నం గాజువాక దువ్వాడ : జనవరి పున్నమి ప్రతినిధి ఆర్‌ఐసీఎస్ విద్యుత్ శాఖలో పనిచేస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న బాలును జె.ఎన్.ఎం.యు.ఆర్.ఎం కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాలనీవాసుల అవసరాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పగలు–రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరా సమస్యలు, అంతరాయాలపై వెంటనే స్పందిస్తూ సేవలందిస్తున్న బాలును ప్రజలు అభినందించారు. తన విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నందుకే ఆయనకు ఈ అవార్డు దక్కిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సభ్యులు ముమ్మిడివరపు రాము, ఈశ్వరరావు, శ్యాము, సంతోష్, వెంకటరమణ, సోమేశ్వరరావు, రాంబాబు, అప్పారావు, శివ తదితరులు పాల్గొని బాలును శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ప్రజలకు నిరంతరం సేవలందించే ప్రతి ఉద్యోగికి బాలూ ఆదర్శంగా నిలుస్తారని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. Uploaded Video:

వనపర్తి

ఘనపూర్ బాలికల ప్రార్థన సమయాన్ని పరిశీలి పరిశీలించిన జిల్లా టీం సభ్యులు

*బాలికల ఉన్నత పాఠశాల ఘన్పూర్ యందు ప్రార్థన సమయంలో హాజరై న జిల్లా తనిఖీ టీం సభ్యులు* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 27/01/2026* *జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఈరోజు బాలికల ఉన్నత పాఠశాల ఘనపూర్ యందు ప్రార్థన సమయంలో హాజరై పరిశీలించారు ప్రార్థన సమయంలో విద్యార్థులు క్రమశిక్షణగా వివిధ ఎక్సర్సైజులు, సూక్తులు, నేటి ప్రశ్న, ప్రతిజ్ఞ ,మంచి మాట తదితర విషయాలను చాలా చక్కగా వివరించారని టీం సభ్యులు శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయురాలు మునావర్ సుల్తానా, ఫిజికల్ డైరెక్టర్ జి .ఇందిర, ఉపాధ్యాయ బృందం మరియు టీం సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్, వేణుగోపాల్ రెడ్డి, అక్బర్, లక్ష్మీదేవి, రవి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు*

వనపర్తి

డిజిటల్ విద్య ద్వారా హిందీ సరళతరం చేయాలని రిసోర్స్ పర్సన్ పిలుపు

*డిజిటల్ విద్య ద్వారానే హిందీ సరళతరం చేయాలని ఉపాధ్యాయులకు సూచన* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 27/01/2026* *నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖిల్లా ఘనపూర్ బాలికలు జిల్లా తనిఖీ విభాగం, వనపర్తి హిందీ తొమ్మిదో తరగతి గదిలో హిందీ అభ్యసన సామర్ధ్యాలను హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు, డిజిటల్ బోధన పద్ధతులను ఉపయోగిస్తే హిందీ విద్యార్థులకు సులభంగా సరళతరంగా అర్ధమవుతుందని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*

వనపర్తి

డిజిటల్ విద్య ద్వారా హిందీ సరళతరం చేయాలని రిసోర్స్ పర్సన్ పిలుపు

*డిజిటల్ విద్య ద్వారానే హిందీ సరళతరం చేయాలని ఉపాధ్యాయులకు సూచన* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 27/01/2026* *నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖిల్లా ఘనపూర్ బాలికలు జిల్లా తనిఖీ విభాగం, వనపర్తి హిందీ తొమ్మిదో తరగతి గదిలో హిందీ అభ్యసన సామర్ధ్యాలను హిందీ రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు, డిజిటల్ బోధన పద్ధతులను ఉపయోగిస్తే హిందీ విద్యార్థులకు సులభంగా సరళతరంగా అర్ధమవుతుందని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.