Tuesday, 10 March 2026

Blog

తిరుపతి

ఎంబీఏ ద్వితీయ సెమిస్టర్ లో 92 శాతం ఉత్తీర్ణత సాధించిన SKIIMS కళాశాల

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నేరి గ్రామ సమీపంలోవున్న శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ( SKIIMS) కళాశాలలో 31-01-2026 న MBA రెండవ సెమిస్టర్ (2024-26 బ్యాచ్) ఫలితాలు విడుదల అయిన సందర్భంగా విజయోత్సవ సభ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిద్దెల హరి ప్రసంగిస్తూ… జూలై మాసంలో జరిగిన రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు 31 జనవరి 2026 న విడుదల అయ్యాయి, ఇందులో SKIIMS కళాశాల విద్యార్థులు 92% ఉత్తీర్ణత సాధించి, విశ్వవిద్యాలయం స్థాయిలోనే అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారిలో ప్రథమ స్థానం మెరుం మమత, ద్వితీయ స్థానం, బొడుగు రజినీ, తృతీయ స్థానంలో జలదంకి లిఖితలు నిలిచారన్నారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన అధ్యాపక బృందాన్ని, విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ తన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్, హెచ్ ఓ డి లు, అధ్యాపక బృందం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని 31 వార్డులో జనసేన నాయకులు జయప్రకాష్ కూటమి నాయకులతో కలసి లబ్దిదారుల ఇంటికే వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతో.. ఫిబ్రవరి 1వ తేది ఆదివారం కావడంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒకరోజు ముందుగానే పెన్షన్లు లబ్దిదారులకు అందించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు జనసేన నాయకులు జయప్రకాష్, డిల్లీ బాబు, భార్గవ్, తెలుగుదేశం నాయకులు ప్రతాప్, బాబు రెడ్డి, మురళి, మునిరాజ యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

తిరుపతి

జాబ్ పోస్టింగ్

ఉద్యోగ వివరాలు కంపెనీ పేరు: ఆర్వీ డిజిటల్స్ (Aarvi Digitals) ఉద్యోగ స్థలం: మంగళం, ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా, తిరుపతి – 517509 ఖాళీలు (మొత్తం 7): అకౌంటెంట్ – 1 కంప్యూటర్ ఆపరేటర్ – 1 రిసెప్షనిస్ట్ – 1 ఆఫీస్ బాయ్ – 1 డిజైనర్ – 2 జీతం: నెలకు ₹12,000 నుండి ₹20,000 వరకు అనుభవం: 1 – 3 సంవత్సరాలు అర్హత: డిగ్రీ లింగం: పురుషులు / మహిళలు షిఫ్ట్: డే షిఫ్ట్ ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే సంప్రదించండి

ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ డెమోగా పదోన్నతి పొందిన శివరామరాజు గారికి సన్మానం*

30.01.2026 చుట్టుగుంట విజయవాడ * డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ నందు దీర్ఘకాలంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా సేవలందించి విధినిర్వహణలో రాష్ట్రస్థాయి ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు, ఆగస్టు 15 జనవరి 26 రాష్ట్ర పర్వదినాల్లో వైద్యారోగ్య శాఖ తయారు చేసే శకటాల తయారీలో చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్ర ఉన్నతాధికారుల మన్ననలు పొంది గత నెలలో కడప జోన్ లో డిప్యూటీ డెమోగా పదోన్నతి పొందిన శుభసందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ పద్మావతి గారి ఛాంబర్ నందు మేడం గారిచే శివరామరాజు డిప్యూటీ డెమో గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు డబ్ల్యూ. వెంకటరమణ, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చేజర్ల సుధాకర్ రావు, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జయ ప్రకాష్, స్టేట్ ట్రెజరర్ నున్న హరిప్రసాద్ గార్లు శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్టేట్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి గారు మాట్లాడుతూ శివరామరాజు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా గొప్పగా సేవలు అందించారు అని వారి సేవలు అభినందనీయమని కొనియాడారు.

వనపర్తి

మామిడిమాడ ఉన్నత పాఠశాల కు సీఎం కప్ వాలీబాల్ విన్నర్ టీమ్ కు అభినందనలు

*మామిడిమాడ క్లస్టర్ అండర్ 18 లో సీఎం కప్ విన్నర్ టీంకు అభినందనలు* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 31/01/ 2026* *సీఎం కప్ మామిడి మాడ క్లస్టర్ అండర్ 18 లో ఈరోజు ఘనపూర్ మండలంలో జరిగిన వాలీబాల్ పోటీల లో విన్నర్ గా నిలిచిందని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ షైనీ జేమ్స్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు మామిడి మాడ ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ బాల్ లింగయ్య మరియు వార్డు మెంబర్లు, విద్యాభిమానులు అందరూ టీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు మున్ముందు జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో అనేక బహుమతులు గెలుచుకోవాలని వారు క్రీడాకారులను అభినందనలు తెలియజేశారు*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ

​కొండాపురం జనవరి 31: నేడు కొండాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ​గ్రామ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గారు ఎస్సీ కాలనీలోని ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ నగదును పంపిణీ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే సోమిరెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శనివారం బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద వీర ఆంజనేయ స్వామి 28వ వార్షికోత్సవ పూజల్లో పాల్గొని ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మనుబోలులోని శివాలయం, మాతమ్మ గుడులను పరిశీలించారు. ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.