Saturday, 25 April 2026

Blog

రాజన్న సిరిసిల్ల

ప్రజల నీటి సమస్యలు తెలుసుకుంటున్న ముస్తాబాద్ గ్రామ సర్పంచ్

పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ 26-3-2026 ముస్తాబాద్ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై సర్పంచ్ మట్ట వెంకటేష్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి, నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి కొరత తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థను మరమ్మతు చేయించి, అవసరమైతే అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు..

Others

ఎండకాలంలో బయటకు వెళ్లేప్పుడు తప్పనిసరి జాగ్రత్తలు

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బ, అలసట వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు కొన్ని అవసరమైన వస్తువులు వెంట తీసుకెళ్లడం చాలా ముఖ్యం. తప్పనిసరిగా వాటర్ బాటిల్ తీసుకెళ్లి శరీరానికి నీరు సరిపడా అందించాలి. సన్‌గ్లాసెస్ కళ్లను UV కిరణాల నుంచి రక్షిస్తాయి. SPF 30 పైగా ఉన్న సన్‌స్క్రీన్ చర్మాన్ని కాపాడుతుంది. గొడుగు ఎండ నుంచి రక్షణ ఇస్తుంది. స్కార్ఫ్ ముఖం, మెడకు కవచంలా పనిచేస్తుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో ఆరోగ్యంగా ఉండవచ్చు.

రాజన్న సిరిసిల్ల

గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు

పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ 26-3-2026 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చికోడు గ్రామంలో భూస మల్లేష్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోట అగన్న. హాజరై గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి , ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు , చికోడు గ్రామ సర్పంచ్ బొమ్మన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భూస మల్లేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

కామారెడ్డి

పాఠశాలకు 2025–26 ఎస్‌ఎస్‌సి బ్యాచ్ విద్యార్థుల నుంచి బీరువా బహుకరణ

పున్నమి ప్రతినిధి కామారెడ్డి 26-3-2026 కామారెడ్డిలోని స్థానిక జి.ప.గంజ్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు తమకు 5 సంవత్సరాల నుండి విద్యను అందించిన, జిల్లా పరిషత్ గంజ్ ఉన్నత పాఠశాలకు 2025-26 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు థ్యాంకింగ్ సమావేశంలో తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలం లింగం గారికి ఉపాధ్యాయ బృందంకు బీరువాను బహుకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తమందరినీ సన్మార్గంలో నడిపించిన ఉపాధ్యాయుల సేవలు మరుపురానివని, ఉపాధ్యాయుల ఋణం తీర్చుకోలేనిదని పిల్లలు అన్నారు. ఇలాంటి విద్యార్థుల సేవలకు గాను ఉపాధ్యాయ బృందం ఆశీస్సులు అందించారు. ఇట్టి సమావేశంలో సునీత మేడం, రాజేంద్ర, గీత, రాజేందర్ రాధాదేవి మొదలగు వారు పాల్గొన్నారు

ఖమ్మం

చిరునోముల గ్రామంలో ‘శ్రీరక్ష ఆరోగ్య యాత్ర’

ఖమ్మం ( మార్చి ) పున్నమి జిల్లా ఇంచార్జి ) ప్రజల ఆరోగ్యమే నిజమైన సంపద అని చెప్పే మాటను చిరునోముల గ్రామం ఇంకోసారి నిజం చేసింది. డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన “శ్రీరక్ష ఆరోగ్య యాత్ర” గ్రామ సమాజానికి ఒక కొత్త ఆరోగ్య చైతన్యాన్ని అందించింది. గ్రామస్తులకు అరుదుగా లభించే కిడ్నీ, లివర్, రక్త పరీక్షలు ఈ యాత్రలో పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. చాలా మంది గ్రామస్థులు తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. సర్పంచ్ శ్రీమతి చంద్రకళ స్వయంగా కార్యక్రమానికి హాజరై, గ్రామ ప్రజలు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన పరీక్షలు నిర్లక్ష్యం చేయకుండా చేయించుకోవాలని సూచించారు. గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తల కలిసి చేసిన సేవా యత్నం ఈ యాత్రను విజయవంతం చేసింది. గ్రామంలో ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు తరచూ జరగాలని, అందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని పాల్గొన్నవారు ఆకాంక్షించారు.

హైదరాబాద్

వైరస్ – మూలం నుండి అవయవాల వరకు హాని

వైరస్లు శరీరంలో చిన్న రకాల సెల్‌లను సోకించటం ద్వారా రోగాన్ని సృష్టిస్తాయి. కొన్ని వైరస్లు కేవలం మూలస్థాయిలో (cell level) ప్రభావం చూపిస్తాయి, కానీ తీవ్రమైన సంక్రమణలో అవయవాల పని (Organ level) దెబ్బతీస్తాయి. ఉదాహరణకు, కోవిడ్-19 ఊపిరితిత్తులను, గుండె, కిడ్నీలు ప్రభావితం చేయవచ్చు. రక్తనాళాలు, నరాల వ్యవస్థ కూడా వైరస్ ప్రభావానికి లోనవవచ్చు. వైరస్ సంక్రమణను తగ్గించడానికి మాస్క్, హైజీన్, వ్యాక్సినేషన్, timely వైద్య సలహాలు ముఖ్యమని World Health Organization సూచిస్తుంది.

హైదరాబాద్

ఇంట్లో మాస్క్ అవసరం లేదు, బయట మాస్క్ ధరించాలి

ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణంలో, కుటుంబ సభ్యులందరికి జ్వరాలు లేకపోవడం, కరోనా లేదా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్‌ లక్షణాలు లేని పరిస్థితుల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. కానీ బయట, crowded ప్రదేశాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఆసుపత్రులు వంటి ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి. మాస్క్ ధరించడం వాయువులో ఉండే వైరస్, బాక్టీరియాల సంక్రమణను తగ్గిస్తుంది. చేతులు తరచూ కడకడం, పరిశుభ్ర పరిసరాలను కాపాడడం అదనపు రక్షణ ఇస్తుంది. ఇంట్లో సౌకర్యం, బయట మాస్క్ వినియోగం combined గా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని World Health Organization సూచిస్తుంది.

హైదరాబాద్

నియమిత ప్రాథమిక ఆరోగ్య పరీక్ష – తప్పనిసరి

ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నియమిత ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు (Basic Health Checkup) చేయించుకోవడం ముఖ్యం. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్, హార్మోన్ స్థాయిలు మొదలైన పరీక్షలు ప్రారంభ దశలో సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి. వ్యాధుల ప్రారంభ లక్షణాలను గుర్తించడం, అవసరమైన వైద్య సలహా తీసుకోవడం రికవరీని వేగవంతం చేస్తుంది. సమతుల ఆహారం, వ్యాయామం, హైజీన్ పాటించడం తో పాటు రెగ్యులర్ చెకప్ ఆరోగ్య సంరక్షణలో పునాది. ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు సమయానికి చేయించడం ఆరోగ్య రక్షణకు ముఖ్యమని World Health Organization సూచిస్తుంది.

కడప

ప్రొద్దుటూరు: పర్యవేక్షణ లేమి.. బ్లాక్ మార్కెట్లో రేషన్ బియ్యం.!

ప్రొద్దుటూరులో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేమితో ప్రభుత్వం రేషన్ బియ్యం భారీగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తంది. పేదలకు అందాల్సిన బియ్యం, చక్కర, జొన్నలు, కందిపప్పు, వంటనూనె తదితర సరకులు ప్రభుత్వం గోడౌన్ నుంచి నేరుగా బ్లాక్ మార్కెట్లోకి రవాణా అవుతున్నాయి. గోడౌన్ నుంచి రేషన్ దుకాణాలకు చేరకుండానే అటు నుంచి అటే బయటికి వెళ్తేంది. తెలిసీ కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి.

కడప

పొద్దుటూరు బియ్యం గూడెం ఇన్ఛార్జ్ప వేటు….?

ప్రొద్దుటూరు ప్రభుత్వ MLS పాయింట్ ఇన్ఛార్జ్ లింగస్వామిపై అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. బుధవారం జిల్లా విజిలెన్స్ &ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రొద్దుటూరు బియ్యం గోడౌన్లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను గుర్తించారు. బియ్యం, చక్కర, జొన్నలు, ఇతర సరకులను రేషన్ షాపులకు తక్కువగా పంపిణీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు లింగస్వామిపై నేడు JCకి రిపోర్ట్ పంపనున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.