Friday, 24 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్యానెల్ స్పీకర్ గా ఫస్ట్ టైం మాగుంట

ఇప్పటికి ఆరు దఫాలుగా పార్లమెంటు సభ్యుడు గా వ్యవహరించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి తొలి సారిగా ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించారు. యమ్.పి.గా తన కంచు కంఠంతో వాగ్ధాటి తో పాలు ప్రజా సమస్యలను పార్లమెంటు దృష్టి కి తీసుకు రావడం లో ఆయన అందరి ప్రశంసలను ఇప్పటి వరకు అందుకున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఆయన పార్లమెంటు చర్చల్లో ఎలాంటి వివాదాలలో కూడా లేక పోవడం విశేషం. మాగుంట ప్రశ్న వేసి ప్రసంగిస్తుంటే ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా సర్దుబాటు ధోరణితో ఆయనకే అవకాశం కల్పించి చర్చకు ప్రాధాన్యత ఇస్తారు.అలాంటిది నేడు ఒంగోలు పార్లమెంటు సభ్యులు గా మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం ప్యానల్ స్పీకర్ గా వ్యవహరించి పార్లమెంటు సమావేశాలను నిర్వహించారు. సీనియర్ పార్లమెంటేరియన్ అయిన మాగుంట ప్యానల్ స్పీకర్ గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఈరోజు జరిగిన సమావేశాలను ఆయన శైలి లో ముసి ముసి నవ్వులతో సభను సజావు గా నడిపించారు. శీనన్న ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించిన తీరు ను నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లోని ఆయన అభిమానులు ప్రత్యేకంగా ఫోన్లలో,టి.వి.లలో తిలకించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలెక్టర్ కు జై భీమ్ రావు పార్టీ విజ్ఞప్తి

జై భీమ్రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ నాయకత్వంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు డా మైనంపాటి యేసురత్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ని కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు జిల్లాలో ఎక్కడా పార్కింగ్ ప్లేసెస్ కూడా చూపించకుండా డిజిటల్ చాలానాలు వేయడం సరైన పద్ధతి కాదని మున్సిపాలిటీ వారు భవన నిర్మాణాలు షాపింగ్ మాల్స్ సరైన పార్కింగ్ ప్లేస్ చూపించకుండా బిల్డింగులు రోడ్డులో కల్లా కడుతుంటే వారి ఉద్యోగ ధర్మాన్ని సక్రంగా నిర్వహించకపోవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ విపరీతమైన ప్రభుత్వ చలానాలు నో పార్కింగ్ కట్టవలసిన పరిస్థితులు వస్తున్నాయి అని తెలిపారు.కావున వాహనాలకు పార్కింగ్ ప్లేసెస్ చూపించాలని రోడ్ల వరకు భవనాలు నిర్మించిన నిర్మాణాలతో తొలగించి నిర్మాణాలు క్రమబద్ధీకరించాలని కలెక్టర్ కి తెలియజేశారు. అలాగే ప్రజలకు సేవలు అందించిన ఎందరో మహనీయులు విగ్రహాలు రద్దీగా ఉండే రోడ్లలో నిర్మించడం ఆ నిర్మాణాలను పబ్లిసిటీ స్థలాలుగా మార్చుకొని ఫ్లెక్సీలు నిర్మించడం వారిని అవమాన పరచడమే అవుతుందని తక్షణమే మున్సిపాలిటీ వారు అలాంటి ఫ్లెక్సీలు పెట్టనివ్వకుండా తొలగించాలని కలెక్టర్ గారి ద్వారా ఆ మహనీయులకు తగిన గౌరవాన్ని ఇవ్వాలని కూడా ఏసురత్నంకోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భేటీ బచావో భేటీ పడావో పై సదస్సు

బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో మహిళా & శిశు సంక్షేమ శాఖ ఐ సి డి యస్ పీడీ బి. హేన సూజన్. గారి సూచనల మేరకు టి నేజ్ ప్రెగ్నెన్సీలపై డివిజన్ స్థాయి వర్క్‌షాప్ ను బుధవారం నిర్వహించారు.తహాశీల్థార్ శ్రవణ్ కుమార్ , మెడికల్ ఆఫీర్ శ్రీలక్ష్మి . కావలి సి డి పి ఓ పి. కే. సౌజన్య , కోవూరు సి డి పి ఓ శారద వింజమూరు సిడిపిఓ పద్మజ సఖి వన్ స్టాప్ సెంటర్ నుంచి కేసు వర్కర్లు సాధన.. శారదా, డిసిపియు యూనిట్ నుండి పిఓ సమత, సోషల్ వర్కర్ పావని, లీగల్ కౌన్సిలర్ జోష్నా పాల్గొన్నారు . ఈ వర్క్ షాప్ నందు కేస్ వర్కర్ జి.సాధన శారద లు .టీనేజ్ గర్భధారణల ప్రభావం, కారణాలు నివారణ చర్యలపై విలువైన సూచనలు అందించారు. పోక్సో యాక్ట్ గురించి రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ రెస్క్యూ, నష్టపరిహారం గురించి, ఈ చట్టం కింద పడే శిక్షల గురించి కూడా వివరించారు. అంతేకాకుండా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ గ మహిళలకు పిల్లలకు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్స్ 1098,181,112,గురించి వివరించారు.. తదుపరి icps ఐసిపియస్ పి.ఒ సమతా చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ రైట్స్ గురించి వివరించారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ ఏ.ఎన్.ఎం.లు, ఎం.ఎస్. కె.లు సిబ్బంది, సూపర్‌వైజర్లు పాల్గొని బాలికల ఆరోగ్యం, విద్య, భద్రత, మరియు అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. . బాలికల విద్యను కొనసాగించడం, చిన్న వయసులో వివాహాలను నిరోధించడం, మరియు బాలికల హక్కులను సంరక్షించడం అత్యంత ముఖ్యమని కార్యక్రమంలో హాజరైన పాల్గొనేవారికి సమాచారం విస్తృతంగా అందించి, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

జనగాం

వ్యవసాయ మార్కెట్ లను మరింత అభివృద్ధి చేయాలని కోరిన AMC చైర్మన్ ల ఫోరం

జనగామ,ఫిబ్రవరి23,పున్నమి న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు (రాజకీయ వ్యవహారాలు) శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని సోమవారం ఉదయం గచ్చిబౌలి లోని వారి నివాసంలో కలిసి రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల సమస్యలు,మార్కెట్ ల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవలసిన నిర్ణయాలను వారి దృష్టికి తీసుకువెళ్లిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ ల చైర్మన్ ల ఫోరం నాయకులు అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో సురేందర్ కుమార్,(డైరెక్టర్ వ్యవసాయ శాఖ తెలంగాణ) గారిని కలిసి పెండింగ్ లో ఉన్న ఔట్ సోర్స్ (తాత్కాలిక ఉద్యోగుల) జీతాలు త్వరగా ఇవ్వాలని మరియు పెండింగ్ లో ఉన్న బిల్లు చెల్లించాలని ప్రభుత్వం అధికారులను కోరిన ఫోరం నాయకులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర AMC చైర్మన్ ల ఫోరం అధ్యక్షులు గంగా రెడ్డి (నిజామాబాద్),గౌరవ అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి(గడ్డి అన్నారం), ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ ( మేడ్చల్),ఉమ్మడి జిల్లాల AMC చైర్మన్ లు పుష్పా రెడ్డి(కూకట్ పల్లి),బనుక శివరాజ్ యాదవ్(జనగామ), చెందుపట్ల రాజిరెడ్డి(పరకాల), రాణి రవీందర్(కమలాపూర్),నల్లా అండాలు శ్రీరామ్(కోడకండ్ల),శ్వేతా వెంకట్(చేర్యాల), రమేష్(మద్నూర్), రాజు మరియు వివిధ AMC ల చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు.

Blog

ఐజేయూ ప్లీనరీ సమావేశాలకు ఎమ్మెల్యే యార్లగడ్డకు ఆహ్వానం

విజయవాడ/గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్ ఈనెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో మూడు రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) జాతీయ ప్లీనరీ సమావేశాలకు హాజరుకావాలని కోరుతూ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సాదరంగా ఆహ్వానించారు.​బుధవారం సాయంత్రం విజయవాడలోని ఎమ్మెల్యే నివాసంలో ఏపీయూడబ్ల్యూజే (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి సుబ్బారావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, జనరల్ సెక్రెటరీ సోమసుందర్ తదితరులు యార్లగడ్డ వెంకట్రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్లీనరీ ఆహ్వాన పత్రాన్ని అందజేసి, మూడు రోజుల పాటు జరిగే సమావేశాల విశేషాలను వివరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు: ఈ నెల 28వ తేదీన జరిగే ప్లీనరీ సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు. జర్నలిస్టుల జాతీయ స్థాయి సమావేశాలు విజయవాడలో నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తాను తప్పనిసరిగా హాజరవుతానని ఆయన నిర్వాహకులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు అట్లూరి రాజశేఖర్, కోడూరి రామకృష్ణ, నల్లగంచు రామకృష్ణ నిర్వహించారు.

Others

ఉదయం నిమ్మరసం – ఆరోగ్యానికి సూపర్ స్టార్ట్!

ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మెటబాలిజాన్ని పెంచి, ఆహారం జీర్ణం కావడాన్ని సులభం చేస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ C శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే శరీరంలో టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది. రోజును ఫ్రెష్‌గా ప్రారంభించడానికి ఇది మంచి అలవాటు. చర్మం కాంతివంతంగా మారడానికీ ఇది ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలని భావిస్తున్న వారికి కూడా ఇది సహాయకారి. అయితే ఎక్కువగా నిమ్మరసం వాడకూడదు. సరైన పరిమితిలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఇస్తుంది.

E-పేపర్ మహబూబాబాద్

ఎస్ ఎఫ్ ఐ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి: గంధసిరి జ్యోతి బసు

ఎస్.ఎఫ్.ఐ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి ఎస్.ఎఫ్‌.ఐ మహబుబాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గందసిరి‌ జ్యోతి బసు,పట్ల మధు ఛలో అసెంబ్లీ లో అక్రమ అరెస్టులను ఖండిస్తూ,,మహబుబాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం మహబుబాబాద్ జిల్లా ఛలో అసెంబ్లీ కి వెళ్లిన ఎస్.ఎఫ్.ఐ నేతలు విద్యార్థులు గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ సర్కార్ ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గుండా రాకేష్ జిల్లా నాయకులు వంశీ,చందు, అషర్ఫ,ప్రకాశ్,విక్రమ్,వినయ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

గిరిజన బిడ్డపై చేతివాటం ప్రదర్శించిన బేకరీ ఓనర్

భూక్యా మేఘనాథ్ కు కొట్టిన మరిపెడ బంగ్లా బస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఎంకే బేకరీ ఓనర్ ఉరువకుండా మహేష్ పై వెంటనే ఎస్ టి ఎస్ టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఎల్ హెచ్ పి ఎస్ లంబాడ హక్కుల పోరాట సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు భూక్యా రామ్మూర్తి నాయక్ డిమాండ్ మరిపెడ బస్ స్టేషన్ లో వెహికల్ టూ వీలర్ స్టాండ్ లో పనిచేస్తున్నటువంటి భూక్యా మేఘనాథ్ కు కొడితే చాతి దగ్గర నల్లగా కందిపోయి లోపట విపరీతమైన నొప్పి ఎంత బలంగా గుద్దితే అంత పెద్ద దెబ్బ తగిలిందో ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి అసలు ఇంత దెబ్బ కొట్టటానికి గల కారణాలు ఏంటిది ఏమన్నా దొంగతనం చేసిండా ఇంకేమైనా చేసిండా చేస్తే కూత పెట్టు దూరంలో మరిపెడ పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్తే మేఘనాథ్ ది తప్పయితే వారు శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కానీ అలా చేయకుండా ఎంకే బేకరీ ఓనర్ ఉరువకుండా మహేష్ ఆయనకు బలం ఉందని కొట్టినా కూడా నాకు ఎవరు ఏం చేయలేరని ఒక అహంకార ధోరణితో ఒక గిరిజన యువకుడిని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ లాండ్ ఆర్డర్ ని చేతిలో తీసుకొని కొట్టవచ్చా అందుకే ఇలాంటివి మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే మహేష్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి జీవన ఉపాధి కోసం పని చేస్తున్నటువంటి ఒక గిరిజన లంబాడ బిడ్డను కొట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్న ఇలాంటి వారిపై తక్షణమే ఎస్టి ఎస్సి కేసు నమోదు చేయాలని చెప్పేసి ఎల్ హెచ్ పి ఎస్ లంబాడ హక్కుల పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను లేనియెడల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం వారితోపాటు లూనావత్ జగ్గు నాయక్ హరి నాయక్ రవీందర్ నాయక్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు🙏🙏

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా – మనుబోలులో రక్తదాన శిబిరం ఏర్పాటు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మనుబోలు పట్టణంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నాయకులు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో బీఎస్పీ “గడప గడపకు” కార్యక్రమం

అందరికీ జై భీమ్ నినాదాలతో ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం తూర్పుపాలెం, సాయిపేట తదితర గ్రామాలలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో “గడప గడపకు బీఎస్పీ” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్, నియోజకవర్గ ఇన్‌చార్జి క్రాకుటురు పుష్పాంజలి ప్రజలను కలుసుకుని పార్టీ సిద్ధాంతాలను వివరించారు. నియోజకవర్గ కన్వీనర్ బెజవాడ ప్రకాశరావు సహా సంకే మల్లిఖార్జున, మదన్, మంద నాగేశ్వరరావు, కే. సురేష్, అభినాష్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.