Friday, 24 April 2026

Blog

హైదరాబాద్

హనికర రసాయనాలకు సహజ ప్రతిఘటక (Natural Antidote) ఉపయోగం

హనికరమైన విషాలు శరీరంలో వెళ్ళినప్పుడు సహజ ప్రతిఘటకాలు (Natural Antidotes) ప్రాథమిక రక్షణగా ఉపయోగపడతాయి. కొన్ని మొక్కలు, సేంద్రీయ పదార్థాలు (అల్లం, వెల్లుల్లి, activated charcoal) విషాన్ని శోషించి, దుష్ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇది అత్యవసర పరిసరాల్లో ప్రాథమిక సహాయం చేస్తుంది, కానీ వైద్య చికిత్సను వాయిదా పెట్టరాదు. వెంటనే వైద్య సలహా, హాస్పిటల్ చేరిక అవసరం. సహజ ప్రతిఘటకాలు శరీర రక్షణలో తాత్కాలిక సహాయంగా పనిచేస్తాయని World Health Organization సూచిస్తుంది.

హైదరాబాద్

నిద్రలో మెలటోనిన్ విడుదల – ఆరోగ్యానికి ముఖ్యం

నిద్ర సమయంలో మెలటోనిన్ హార్మోన్ విడుదల అవ్వడం శరీరానికి, మానసిక ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం. ఇది శరీర స్వభావిక circadian rhythm ని నియంత్రిస్తుంది, నిద్రను మెరుగుపరుస్తుంది. మెలటోనిన్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది, హార్మోనల్ సమతుల్యతను కాపాడుతుంది. రాత్రిపూట చీకటి, శాంతమైన వాతావరణంలో నిద్రపోవడం మెలటోనిన్ స్రవణానికి సహాయపడుతుంది. సరైన నిద్ర, మెలటోనిన్ విడుదల కలిగి ఉండడం సమగ్ర ఆరోగ్యానికి, శరీర పునరుద్ధరణకు పునాది. దీని కీలకతను World Health Organization సూచిస్తుంది.

హైదరాబాద్

సహజ రక్షణ మరియు సురక్షిత లైంగిక జీవితం

సహజ రక్షణ (Natural Protection) మరియు సురక్షిత లైంగిక జీవనం రోగనిరోధక శక్తిని పెంచి లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. కండోమ్ వంటి బారియర్ పద్ధతులు HIV, HPV, సిఫిలిస్ వంటి సంక్రమిత వ్యాధుల వ్యాప్తిని తగ్గిస్తాయి. వ్యక్తిగత శుభ్రత, మోసకట్టని సంబంధాలు, ధ్యానం మరియు అవగాహనలతో సురక్షిత జీవనం సాధ్యం. వైద్య సలహా తీసుకొని, నియమిత టెస్టులు చేయించడం మరింత రక్షణ ఇస్తాయి. సహజ రక్షణ మరియు సురక్షిత లైంగిక జీవనం ఆరోగ్య రక్షణలో కీలకమని World Health Organization సూచిస్తుంది.

హైదరాబాద్

ఆరోగ్యకరమైన నూనెలు – సాధారణ మరియు హృదయ ఆరోగ్యానికి

సరైన నూనెలు (Healthy Oils) శరీరానికి అవసరమైన కొవ్వు, విటమిన్లు అందిస్తాయి. ఒలివ్, కెనోలా, అండ్ వంటగోడ నూనెలు హృదయానికి మేలు చేస్తాయి, కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడతాయి. ఎక్కువ కొవ్వు, తక్కువ న్యూట్రిషియస్ నూనెలు హృదయ రుగ్మతలకు దారితీస్తాయి. నూనెలను పరిమిత మోతాదులో, సుమారుగా వంటల్లో ఉపయోగించడం, క్రమిత ఆహారం, వ్యాయామంతో కలిపి ఆరోగ్యకర జీవనశైలికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకర నూనెలు ఉపయోగించడం సాధారణ శరీర శక్తి మరియు హృదయ రక్షణలో కీలకమని World Health Organization సూచిస్తుంది.

హైదరాబాద్

పిల్లలకు కొన్ని మందులు ఇవ్వకూడదు

పిల్లలకు చాలా మందులు వయస్సు, శరీర భారం, మेटాబాలిజం పరిమితుల కారణంగా కాపీగా ఇవ్వకూడదు. కొన్ని ఔషధాలు చిన్నారుల్లో ప్రతికూల ప్రభావాలు, లివర్ లేదా కిడ్నీ హాని, అలర్జీలు సృష్టించవచ్చు. వైద్యులు మాత్రమే వయస్సు, లక్షణాలు, డోస్‌ను పరిగణించి మందులను సూచిస్తారు. రోగ నిర్ధారణ, సురక్షిత డోసింగ్, ఫార్మకోకినెటిక్స్ అనుసరించడం కీలకం. ఇంట్లో స్వయం మందుల వినియోగం ప్రమాదకరం. పిల్లలకు ప్రత్యేక వైద్య సలహా తీసుకోవడం మరియు కొన్ని మందులను ఇవ్వకూడదని World Health Organization సూచిస్తుంది.

తూర్పు గోదావరి

“ఆర్డీవోగా ఆనందరావు బాధ్యతలు… పుష్కరాల ఏర్పాట్లపై అలర్ట్!”

కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా కాకర ఆనందరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తాళ్లపూడి రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి, ఎమ్మార్వో సమక్షంలో కార్యాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోపాలపట్నంకు చెందిన ఆనందరావు బి.కాం, ఎం.ఏ., పీహెచ్ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) అమరావతిలో ఎస్టీసీగా విధులు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. నూతన ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అధికారులు, కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువ ప్రెస్ టీం సభ్యులతో మాట్లాడిన ఆనందరావు, మండల ఎమ్మార్వో ద్వారా వ్యవసాయం, క్రాఫ్ట్ మరియు మండలంలోని గ్రామాల వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. రాబోయే పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్లను ముందస్తుగా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు, నాయకులకు మరియు అధికారులకు మధ్య వారధిగా పనిచేసే విలేకరుల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో ప్రజా సమస్యలను వార్తల రూపంలో అధికారుల దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, విలేకరులపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ప్రతి అధికారికి మీడియా సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్

యుద్ధ గాయాలకు వెండి (Silver) ఉపయోగం

చారిత్రకంగా వెండి (Silver) యుద్ధ సమయంలో గాయాలను శుభ్రపరచడానికి, సంక్రమణను తగ్గించడానికి ఉపయోగించబడింది. వెండి యాంటీబాక్టీరియల్ లక్షణాలు కలిగినది, ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది మరియు ఇన్ఫెక్షన్ అవకాశాన్ని తగ్గిస్తుంది. పురాతన యుద్ధాల్లో గాయాలపై వెండి పొడి, వెండి రైట్లు ఉపయోగించి వేగవంతమైన రికవరీ సాధించబడింది. ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా కొన్ని సర్జికల్ పరికరాలు, కుట్టు గాయాలు కోసం వెండి-ఆధారిత క్రీమ్‌లు ఉపయోగిస్తారు. వెండి సహాయంతో గాయాల నాణ్యమైన సంరక్షణ సాధ్యమని World Health Organization సూచిస్తుంది.

తూర్పు గోదావరి

ఆపదలో అండగా ‘మానవత’… పక్షవాతంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థికసాయం

తాళ్లపూడి (పున్నమి ప్రతినిధి, తూర్పుగోదావరి), మార్చి 26:తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట గ్రామానికి చెందిన కాయిత రాములు పక్షవాతంతో మృతి చెందడంతో, వారి కుటుంబానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. మట్టి ఖర్చులు మరియు కుటుంబ పోషణ కోసం సంస్థ ఆధ్వర్యంలో రూ.6,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి ఒక్క కన్నీటి బొట్టునైనా తుడవాలన్నదే మానవత ధ్యేయమని తెలిపారు. విద్య, వైద్య సేవల కోసం సంస్థ అధికంగా ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇంజరపు వెంకటకృష్ణ సత్యనారాయణ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవతను ఆశ్రయిస్తే తగిన సహాయం అందిస్తామని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, ఇంజరపు వెంకటకృష్ణ సత్యనారాయణ, రామన శ్రీనివాస్, వెంకటలక్ష్మి, వెలుగుబంటి రఘుకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

చిట్వేలు మండలంలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహణ

చిట్వేలు మండలంలో ఉపాధి హామీ పథకం 20వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు (26-03-2026) మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజావేదిక నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి డ్వామా పీడీ వెంకట రత్నం ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. సోషల్ ఆడిట్ బృందం మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో చేపట్టిన పనుల వివరాలను సభలో చదివి వినిపించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి శ్రామికులకు వేతనాల రూపంలో రూ. 7,46,98,580 ఖర్చు చేయగా, సామాగ్రి ఖర్చులుగా రూ. 34,54,563 వినియోగించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ. 81,794 మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించగా, రూ. 2,60,000 విలువ గల పనులపై విచారణకు ఆదేశాలు జారీ చేయబడినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంబుడ్స్‌పర్సన్ శ్రీరాములు, ఏపిడీ ప్రతాప్, ఎస్‌ఆర్‌పీ సూర్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏపీఓ నాగరాజు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ మరియు ఉపాధి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గుంటూరు బాపనయ్య గారి 48వ వర్ధంతి సందర్బంగా పలువురు నివాళులు*

గుంటూరు బాపనయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు శాసనసభ్యునిగానూ, ఒకసారి శాసన మండలి సభ్యునిగాను పనిచేసారు. ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని వారి సంక్షేమానికి, ప్రజా సేవకు మాత్రమే ఉపయోగించి స్ఫూర్తిగా నిలిచారు. సిపిఎం అగ్రనేత మాకినేని బసవ పున్నయ్య స్ఫూర్తితో ఉద్యమంలోకి వచ్చి తుదిశ్వాస వరకూ దానికే అంకితమయ్యారు. ఆయన 1952 మద్రాసు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలలో “దివి” నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. 1962 శాసనసభ ఎన్నికలలో నిడుమోలు శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఓ నిరుపేద దళిత వ్యవసాయ కార్మిక కుటుంబంలో సోమమ్మ, రామస్వామి దంపతులకు 1919 లో జన్మించారు. ఆరోజుల్లో నాగాయతిప్ప నుంచి అవనిగడ్డ వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. అవనిగడ్డలో చదువుకునేందుకు బాపనయ్య పడవ మీద వెళ్తుండేవారు. దళితుడు పాఠశాల విద్యనభ్యసించుటను అగ్రవర్ణాలవారు సహించలేకపోయారు. పడవెక్కడానికి వీల్లేదంటూ ఓ రోజున బాపనయ్యను అడ్డగించారు. తన అమ్మమ్మ గారింటికి వచ్చి అదే పడవపై తిరిగి వెళ్తున్న కమ్యూనిస్టు నేత మాకినేని బసవపున్నయ్య దీన్ని గమనించి అప్పటికే కమ్యూనిస్టుపార్టీలో చేరి పనిచేస్తున్న స్థానికులు కంఠంనేని పెద అచ్యుతరామయ్య, కంఠంనేని చిన అచ్యుతరామయ్య, గరికిపాటి మల్లయ్య తదితర యువకులను పోగుచేసి బసవపున్నయ్య ఆ అగ్రవర్ణ దురహంకారాన్ని ఎదిరించి పోరాడారు. ఫలితంగా బాపనయ్యతోపాటు దళితులందరికీ రేవులో పడవ ఎక్కే హక్కువచ్చింది. ఈ ఘటన బాపనయ్యను ఎంతగానో ఆలోచింపజేసింది. కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్షింపజేసింది. దళితుల సామాజిక, ఆర్థిక, సమానత్వం ‘మార్క్సిస్టు-లెనినిస్టు’ సిద్ధాంతం ద్వారానే సాధ్యమని ఆచరణలో అర్థం చేసుకున్నారు. 1942 నుంచి చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా మంగళాపురంలో ముదిరాజులకే బంజరు చెందేటట్లు సాగిన పోరాటానికి చండ్ర రాజేశ్వరరావు, చల్లపల్లి నారాయణరావులతోపాటు నాయకత్వం వహించారు. ఆ పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నారు. గుర్రాలతో తొక్కించబడ్డారు. 1946లో 17 వేల ఎకరాల చల్లపల్లి జమీందారీ భూముల్లో ‘గట్ల ఉద్యమానికి’ కృషి చేశారు. 1947లో రాష్ట్రవ్యాప్తంగా పాలేర్ల జీతాల పెంపుదలకూ, పనిగంటల తగ్గింపుకూ జరిగిన పోరాటానికీ నాయకత్వం వహించారు. 1948లో జమీందారీ విధానం రద్దు, దున్నేవారికే భూమి కోసం ఉవ్వెత్తున సాగిన పోరాటాల సందర్భంగా ప్రభుత్వం బాపనయ్యను అరెస్టు చేసి రాజమండ్రి, కడలూరు జైళ్లలో 1951 వరకూ నిర్బంధించింది. 1964లో కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక సందర్భంగా సిపిఎం ఆవిర్భావాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం వారిని 1964 నుంచి 1966 వరకూ హైదరాబాద్‌ సెంట్రల్‌ జైలులో ఉంచింది. తన శత్రువుకు సైతం సాయం చేసే సహృదయుడైన బాపనయ్య సిద్ధాంతం విషయంలో ఏనాడూ రాజీపడలేదు. సి.పి.ఎం. పార్టీలో ఆయన పలు బాధ్యతలు నిర్వహించారు. 1943 నుండి 1945 వరకూ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడుగా, 1945 నుంచి 1962 వరకూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, 1958 నుంచి 1964 వరకూ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నారు. 1964 నుంచి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా పనిచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగానూ, కార్యదర్శిగానూ చివరి వరకూ పనిచేశారు. 1952, 1962, 1978లలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1968-1972 వరకూ శాసనమండలి సభ్యునిగా వచ్చిన జీతాలను పార్టీకి ఇచ్చివేశారు. పార్టీ ఇచ్చే కొద్దిపాటి అలవెన్సుతోనే జీవితాన్ని గడిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.