Saturday, 25 April 2026

Blog

కడప

పొద్దుటూరు బియ్యం గూడెం ఇన్ఛార్జ్ప వేటు….?

ప్రొద్దుటూరు ప్రభుత్వ MLS పాయింట్ ఇన్ఛార్జ్ లింగస్వామిపై అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. బుధవారం జిల్లా విజిలెన్స్ &ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రొద్దుటూరు బియ్యం గోడౌన్లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను గుర్తించారు. బియ్యం, చక్కర, జొన్నలు, ఇతర సరకులను రేషన్ షాపులకు తక్కువగా పంపిణీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు లింగస్వామిపై నేడు JCకి రిపోర్ట్ పంపనున్నారు.

తిరుపతి

జియో టవర్ సామగ్రి దొంగల ముఠా గుట్టురట్టు – శ్రీకాళహస్తి పోలీసులు కీలక పట్టివేత

తొట్టంబేడు, మార్చి 25 (పున్నమి, క్రైం న్యూస్):తొట్టంబేడు కండ్రిగ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిమ్మయ్య వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న టవర్ సామగ్రి దొంగతనాలపై పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి సూచనల మేరకు, తొట్టంబేడు సబ్ ఇన్‌స్పెక్టర్ బి. బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక పురుషుడు, ఒక మహిళను పోలీసులు గుర్తించారు. వారిని ఆపేందుకు ప్రయత్నించగా పారిపోవడానికి యత్నించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్, హెల్మెట్లు, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వాహనంపై నెంబర్ ప్లేట్లు మార్పులు చేసినట్లు గుర్తించారు. అదేవిధంగా, అదే ప్రాంతంలో జియో కంపెనీకి చెందిన రెండు సిస్కో రూటర్లు లభించగా, అవి లాంకో ఫ్యాక్టరీ, పల్లంపేట ప్రాంతాల నుంచి దొంగిలించబడినవని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. విచారణలో నిందితులు మోడిగుంట కిరణ్ కుమార్ (A1), జె. రహేలు (A2)గా గుర్తించారు. వీరు నెల్లూరు జిల్లాకు చెందిన వారని తెలిపారు. నిందితుడు గతంలో జియో కంపెనీలో టవర్ టెక్నీషియన్‌గా పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో టవర్ రూటర్లు, బ్యాటరీలు తదితర సామగ్రిని దొంగిలించినట్లు వెల్లడించాడు. దొంగిలించిన వస్తువులను చెన్నై నగరంలోని “ది సర్వర్ స్టోర్”లో విక్రయించినట్లు తెలిపిన నేపథ్యంలో, పోలీసులు అక్కడ దాడి నిర్వహించి మొత్తం 16 సిస్కో రూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో రూటర్‌ను రూ.5,000కు కొనుగోలు చేసినట్లు షాప్ ప్రతినిధి అంగీకరించారు. ఈ కేసులో మొత్తం 16 సిస్కో రూటర్లు, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, పరికరాలు తదితర సామగ్రిని పోలీసులు కేసు ప్రాపర్టీగా స్వాధీనం చేసుకుని, దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

తిరుపతి

గిరిజన గడపకు జనసేన సిద్ధాంతం-పవన్ కళ్యాణ్ ఆశయాలే మాకు శ్రీరామరక్ష

శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా పార్టీ నాయకులు ప్రతి గిరిజన కాలనీని సందర్శించి, జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రతి కుటుంబానికి వివరించారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ మనోగతాన్ని చాటుతూ.. “మా గిరిజనుల పట్ల పవన్ కళ్యాణ్ చూపిస్తున్న బాధ్యత, భద్రత, అభిమానం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి” అని హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సాదక్ పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్తూ పార్టీ సభ్యత్వ ప్రాధాన్యతను వివరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే బొజ్జల పరామర్శ

తొట్టంబేడు, మార్చి 25 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బుధవారం నాడు పరామర్శించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు బిజెపి నాయకులు కోలా ఆనంద్ కుమార్ కూడా పాల్గొన్నారు. ముందుగా పూడి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే, అక్కడ కన్నుమూసిన టిడిపి సీనియర్ నాయకులు చెత్తమ నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అక్కడి నుండి గుర్రప్ప నాయుడు కండ్రిగ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే దంపతులు, ఇటీవల స్వర్గస్తులైన కుమారి తల్లి గోగినేని సుబ్బమ్మ నివాసానికి చేరుకున్నారు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో గ్యాస్ కొరతకు చెక్ – ఏజెన్సీలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కఠిన ఆదేశాలు

శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గ్యాస్ కొరత లేకుండా చూడటమే లక్ష్యంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బుధవారం నాడు పలు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజలకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్లు సమయానికి అందేలా అధికారులు ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించడం, అక్రమ విక్రయాలకు పాల్పడటం వంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ పంపిణీలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని సూచించారు. ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సేవల నాణ్యతను మెరుగుపరచాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏజెన్సీల నిర్వాహకులకు స్పష్టం చేశారు.

తిరుపతి

బీమాపై అవగాహన కల్పించాలి-శ్రీకాళహస్తిలో ఎల్ఐసి ఏజెంట్ల భారీ ర్యాలీ

శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎల్ఐసి శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో బీమా పట్ల విస్తృత అవగాహన కల్పించడమే ధ్యేయంగా బుధవారం నాడు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది బీమా ఏజెంట్లు, కార్యాలయ సిబ్బంది, డెవలప్‌మెంట్ ఆఫీసర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్ బ్రాంచ్ మేనేజర్ జి. వెంకటేశ్వర్లు ఈ ర్యాలీని ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 31తో ముగియనున్న నవజీవన్ శ్రీ పాలసీ గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో వివిధ బీమా పథకాలకు సంబంధించిన బ్రోచర్లు, కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ బీమా రక్షణ కలిగి ఉండాలని, ఎల్ఐసి అందించే అద్భుత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ర్యాలీని విజయవంతం చేసిన ఏజెంట్లను, సిబ్బందిని ఈ సందర్భంగా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ప్రత్యేకంగా అభినందించారు.

తిరుపతి

మారుతున్న వాతావరణానికి అనుగుణంగా సాగు పద్ధతులపై ముచ్చువోలు రైతులకు శిక్షణ

శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు గ్రామంలో జిల్లా వనరుల కేంద్రం, తిరుపతి ఆధ్వర్యంలో రైతులకు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రైతులకు ఆధునిక వ్యవసాయంపై కీలకమైన మార్గదర్శకంగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి సౌభాగ్య లక్ష్మి మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరైన పంటల ఎంపిక, భూసార పరీక్షల ప్రాముఖ్యత, భూమి ఆరోగ్యం పరిరక్షణపై వివరించారు. అలాగే సేంద్రియ ఎరువుల వినియోగం పెంచి, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించారు. శ్రీకాళహస్తి మండల వ్యవసాయ అధికారి మమత రెడ్డి మాట్లాడుతూ, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం చేయడం, ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాల వినియోగం, డ్రోన్ సాంకేతికత ఉపయోగం, అలాగే ‘రైతన్న మీకోసం’ వంటి ప్రభుత్వ కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా సరైన విత్తన రకాల ఎంపిక, సేంద్రియ ఎరువుల వినియోగం పెంచడం ద్వారా వర్షాభావం లేదా అధిక వర్షపాతం పరిస్థితుల్లో కూడా పంటలు నిలదొక్కుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ విస్తరణ అధికారి రవి ప్రసాద్, రైతు సేవ కేంద్రం వ్యవసాయ సహాయకురాలు విజయలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సమన్వయకర్త ప్రసాద్, ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ప్రతినిధులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

తిరుపతి

పెద్ద సింగమలలో రామచంద్రుని సేవలో ఎమ్మెల్యే బొజ్జల

తొట్టంబేడు, మార్చి 25 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలంలోని పెద్ద సింగమల గ్రామంలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంత సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం శుభసూచకమని కొనియాడారు. కుంభాభిషేక మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులకు, భక్తులకు ఆయన తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు.

తిరుపతి

పంగూరులో తాగునీటి సమస్యకు ఎంపీ నిధులతో శాశ్వత పరిష్కారం

శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గం పంగూరు గ్రామంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. తిరుపతి తిరుపతి పార్లమెంటు సబ్యుడు మద్దిల గురుమూర్తి చొరవతో గ్రామంలో ఆధునిక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామస్థుల అభ్యర్థనలు, నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి సూచనల మేరకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయగా, ఆ నిధులతో ప్లాంట్ నిర్మాణం పూర్తి అయింది. బుధవారం గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల సమక్షంలో ప్లాంట్‌ను ఘనంగా ప్రారంభించారు. దీంతో చాలా కాలంగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న పంగూరు ప్రజలకు ఇప్పుడు స్వచ్ఛమైన నీరు సులభంగా లభించనుంది. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ సమస్యను పరిష్కరించిన బియ్యపు మధుసూదన రెడ్డి, అలాగే నిధులు మంజూరు చేసి గ్రామానికి ఉపశమనం కలిగించిన ఎంపీ మద్దిల గురుమూర్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

సీతారామస్వామి కృపతో ప్రజలంతా బాగుండాలి-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 25 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామంలో వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామస్వామి వారి దివ్య దేవాలయ మహా కుంభాభిషేక మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన ధర్మపత్ని బొజ్జల రిషిత రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు గ్రామస్తులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. “సీతారామచంద్రుని కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించానని ఆయన తెలిపారు. భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులకు, భక్తులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.