Tuesday, 10 March 2026

Blog

తూర్పు గోదావరి

వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ పత్రిక ఆవిష్కరణ

(పున్నమి ప్రతినిధి చందు): తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాత గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఫిబ్రవరి 15, 2026 ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన తాళ్లపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మదన గోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ పత్రికను ఆవిష్కరించారు. మండలంలోని స్త్రీ-పురుషులు సతీసమేతంగా హాజరై స్వామివారి కళ్యాణాన్ని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలని విశ్వబ్రాహ్మణ సంఘం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గానుగుల వరహాలు, మండల అధ్యక్షులు పట్నాల సతీష్, ఉపాధ్యక్షులు బాబు, కార్యదర్శి కడలి కిరణ్ కుమార్, కోశాధికారి ముత్తోజు మురళి తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ప్రక్కిలంకలో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ

తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు నవచండీ యాగ మహోత్సవాలు భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ముళ్ల మల్లిబాబు ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆదివారం మహిళలు గోదావరి జలాలతో అమ్మవారికి పౌర్ణమి అభిషేకం నిర్వహించి అనంతరం మహాచండీ యాగాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం బ్యాండ్ బాజాలు, గరగ నృత్యాలు, బుట్టబొమ్మలు, వేషధారణలతో తాళ్లపూడి, ప్రక్కిలంక గ్రామ వీధుల గుండా అమ్మవారి భారీ ఊరేగింపు జరిగింది. ఫిబ్రవరి 3న సోమవారం అఖండ అన్నసమారాధన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు, బంధువులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

తూర్పు గోదావరి

గాయపడిన కానిస్టేబుల్‌కు అండగా నిలిచిన ఎస్సైకి ఘన సన్మానం

తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి చందు),ఫిబ్రవరి 01: అనపర్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందిన గోతం తమ్మారావు ఇటీవల విధులలో భాగంగా హనుమాన్ జంక్షన్ నుండి వస్తుండగా సిబ్బందితో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అనపర్తి ఎస్సై ఎల్. శ్రీను నాయక్ స్పందించి, ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచే తమ్మారావు పూర్తిగా కోలుకునే వరకు వైద్య సలహాలు అందిస్తూ, ప్రతిరోజూ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఈ సేవలను గుర్తించి తమ్మారావు సోదరుడు అడ్వకేట్ మల్లికార్జునరావు తాడిపూడి గ్రామంలో ఎస్సై శ్రీను నాయక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తమ్మారావు మాట్లాడుతూ, ప్రమాద సమయంలో కుటుంబ సభ్యుడిలా అండగా నిలిచి తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ఎస్సైకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామారెడ్డి

కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో భారీ ఘర్షణ!

మాజీ నాయకులు సీఎం రేవంత్‌పై తీవ్ర విమర్శలు.. – 420 హామీల ‘దద్దమ్మ’, ‘నోటు సూట్ ప్రధాన నిందితుడు’ అంటూ ఫైర్! కామారెడ్డి, 01 ఫిబ్రవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో భూకంపం! మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, టిఆర్ఎస్ వర్కింగ్ సెక్రటరీ బుచ్చిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రామారెడ్డి ప్రసాద్.. సీఎం రేవంత్‌పై ఫుల్ ఫైర్! ‘420 హామీల దద్దమ్మ’, ‘నోటు సూట్ ప్రధాన నిందితుడు’ అంటూ బాంబు లు విసరారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామారెడ్డి మండల కేంద్రంలో గల బస్టాండ్ ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.జిల్లా పంచాయతీ రాజకీయాల్లో కొత్త తుఫాను రేగింది. రామారెడ్డి మండల మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ సెక్రటరీ బుచ్చిరెడ్డి, రామా రెడ్డి మాజీ ఉపసర్పంచ్ ప్రసాద్ లు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సీటు నోటీసు లు ఇవ్వడం సిగ్గుచేటని, 420 హామీలు ఇచ్చి అమలు చేయని ‘దద్దమ్మ’ అని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి మాట్లాడుతూ,సీఎం 420 హామీల దద్దమ్మ! అని విమర్శించారు.మాజీ సీఎం కేసీఆర్‌కు సీటు నోటీసులు ఇవ్వడం పూర్తిగా సిగ్గుచేటని ఘాటుగా ఆక్షేపించారు.సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి, ఇప్పటికీ ఒక్కటి అమలు చేయలేదని అన్నారు. ఇది దద్దమ్మ పాలన అని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. అంటూ మాస్ పంచ్ వేశారు. జిల్లా ప్రజల సమస్యలు – రోడ్లు, నీరు, విద్యుత్ – అన్ని నీరు కారుస్తున్నాయని అన్నారు. కేసీఆర్ పాలన లో జిల్లా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. స్థాని కులు ఈ మాటలకు నివ్వెరపోయారు!టిఆర్ ఎస్ వర్కింగ్ సెక్రటరీ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, మహా కావ్యం: ‘కేసీఆర్ = బోళ శంకరుడు టిఆర్స్ పార్టీ వర్కింగ్ సెక్రటరీ బుచ్చిరెడ్డి మాటలు మరింత చురకలు అంటించారు! “బోలా శంకరుడు ఆనాటి దైవాత్పడు గరళం మింగి ప్రపంచాన్ని కాపాడిన మహాత్ముడు. ఆ బహుళ శంకరుడే మా మాజీ సీఎం కేసీఆర్!” అంటూ పోలీస్ పురాణ కథను సూచించి కేసీఆర్‌ను దైవత్వపరిచారు. ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్‌పై కుట్రలు పన్నుతోందని, తెలం గాణ ప్రజలు దీన్ని గుర్తించాలని అన్నారు.ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా యి.మాజీ ఉపసర్పంచ్ రామారెడ్డి ప్రసాద్ డైరెక్ట్ హెచ్చరిక: ‘రేవంత్ ను ముందస్తు అరెస్టు!’ చేయా లంటూ మాజీ ఉపసర్పంచ్ రామారెడ్డి ప్రసాద్ నోటు సూట్ కేసుపై ఫుల్ అట్ టాపిక్ మాట్లాడారు. “నోటు సూట్ కేసులో ప్రధాన నిందితుడు సీఎం రేవంత్ రెడ్డి! నీ ముందస్తుగా అరెస్టు చేసి, సీబీఐ అధికారుల ముందు వరుసలో ఉండాలి!” అంటూ ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నోటు సూట్ ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు.జిల్లా స్థాయి పంచాయతీల్లో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నా యని అన్నారు.ప్రజలు మేకిన్ అవుతారని చెప్పా రు.జిల్లా ప్రభావం: కౌన్సిలర్ ఎన్నికలకు ముందు రాజకీయ డ్రామా! మొదలైందని ఎద్దేవా చేశారు. స్థానికులు “కేసీఆర్ పాలనలో జిల్లా మారింది, ఇప్పుడు హామీలు మాత్రమే!” నోటి మాటలకే అంటూ విమర్శించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను నిప్పు పెట్టి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఉప సర్పంచు లు ఎంపిటిసిలు వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఆత్మ నిర్భయ భారత్ ను బలోపేతం చేసే బడ్జెట్..

భారత్ లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మాణమయ్యే బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ఉందని బిజెపి నేత మిడతల రమేష్ పేర్కొన్నరు. *ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని కాంక్షించే బడ్జెట్ ను కేంద్రం రూపొందించింది*. సముద్ర తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో జల రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.. బకింగ్ హోమ్ కెనాల్ ద్వారా తక్కువ రవాణా ఖర్చుతో వేగవంతంగా వాణిజ్య సరుకుల రవాణా అందుబాటులోకి వస్తుంది.. ఆంధ్రసముద్ర తీర ప్రాంతంలో కొబ్బరి.. గంధం చెట్లు ఏర్పాటు చేయనున్నారు.. ఆంధ్రప్రదేశ్లో *అరుదైన ఖనిజాలు వెలికితీత కు ఈ బడ్జెట్ లో నిధులు* కేటాయించబడ్డాయి.. ప్రపంచ స్థాయి రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయింపు ఉంది. అత్యంత విలువైన గంధం చెట్ల వనాలు ఏర్పాటు ద్వారా అంతరించిపోతున్న ప్రకృతి సంపద వృద్ధి లోకి రానుంది.. పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్లలో ఉన్న పరిస్థితులకు తగిన విధంగా రక్షణ రంగ బలోపేతానికి… *రక్షణ రంగ రహస్య ప్రాజెక్టులకు అధిక నిధులు* కేటాయించబడ్డాయి.. ఆత్మానిర్బర భారత్ దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని రమేష్ బడ్జెట్ పై వ్యాఖ్యానించారు…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు గ్రంథాలయ చైర్మన్‌గా శాంతకుమారి* గారి ప్రమాణ స్వీకారం

* – విద్యా రంగానికి గర్వకారణం : * *కిషోర్ గునుకుల గారు* > జిల్లా ప్రధాన కార్యదర్శి > జనసేన పార్టీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా మాజీ ఉదయగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి శాంతకుమారి గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం నెల్లూరు జిల్లా విద్యా–సాంస్కృతిక రంగానికి గర్వకారణమని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు ఉన్న భవనాలు మాత్రమే కాకుండా జ్ఞానానికి ఆలయాలు, విద్యార్థులకు దిశానిర్దేశం చేసే దీపాలు, సమాజాన్ని విజ్ఞానవంతంగా తీర్చిదిద్దే కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. అలాంటి కీలక బాధ్యతను శాంతకుమారి గారు స్వీకరించడం ద్వారా జిల్లాలోని విద్యార్థులు, యువత, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎన్నో అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరపున, పార్టీ అధ్యక్షులు, *డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి* ఆలోచనలకు అనుగుణంగా విద్య, విజ్ఞానం, విలువల ఆధారిత సమాజ నిర్మాణానికి ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టంగా తెలిపారు. శాంతకుమారి గారు తన పదవీకాలంలో గ్రంథాలయాలను ఆధునీకరించి, డిజిటల్ సదుపాయాలను విస్తరించి, పేద విద్యార్థులకు జ్ఞాన ద్వారాలు మరింత విస్తృతంగా తెరవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీజేవైఎం రాష్ట్ర సహా కోశాధికారిగా మురగ.నరేష్**

** నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని మూలాపేటకు చెందిన మురగ నరేష్ కు భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో రాష్ట్ర సహాయ కోశాధికారిగా పదవి ఇవ్వడం జరిగింది. చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవక్ గా శిక్షణ పొంది పలు బాధ్యతలు నిర్వహించి అనంతరం విద్యార్థి దశలో ఏబీవీపీ కార్యకర్తగా చేరి గతంలో ఏబీవీపీ వి.ఆర్. కళాశాల అధ్యక్షులుగాను, నెల్లూరు నగర సహాయ కార్యదర్శి గాను, నగర సెంట్రల్ జోన్ ఇన్చార్జిగాను, నగర కార్యదర్శి గాను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగాను, ఎస్.ఎఫ్.డి నెల్లూరు జిల్లా కన్వీనర్ గాను, అనంతరం బిజెపిలో చేరి భారతీయ జనతా యువమోర్చాలో నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి గాను, మూలాపేట మండల బిజెపి అధ్యక్షులు గాను, బీజేవైఎం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం బీజేవైఎం రాష్ట్ర సహాయ కోశాధికారిగా నియమించడం జరిగింది. ఆయనకు పై బాధ్యతను ఇచ్చిన రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు కే. సునీల్ రెడ్డి మరియు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్. మాధవ్ రాష్ట్ర బిజెపి ఆర్గనైజింగ్ సెక్రటరీ నూకల. మధుకర్ నెల్లూరు జిల్లా బిజెపి అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డి మరియు ఇతర జిల్లా రాష్ట్ర నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రం నలుమూలల పర్యటించి అన్నివర్గాల విద్యార్థి, యువతను సమీకరించి పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. అలాగే రాష్ట్ర, కేంద్ర పార్టీలు ఇచ్చే అన్ని కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలలోకి విశేషంగా తీసుకువెళతానని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని, విద్యార్థి, యువతలో దేశభక్తి, జాతీయ భావాలు, నైతిక విలువలతో కూడిన సమాజంలో అన్ని వర్గాలలో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించే దిశగా పనిచేస్తానన్నారు.

E-పేపర్

మరో ఉద్యమంలా నిరసన!* BRS

పున్నమి న్యూస్ ప్రతినిధి 01 ఫిబ్రవరి 2026 తెలంగాణ ఇంచార్జ్: 9640204826 మరో ఉద్యమంలా నిరసన!* తెలంగాణ రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించి, తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఎనలేని సేవలందించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత *కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)* SIT నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో బైక్ ర్యాలి నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లి రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేసి, ముఖ్యమంత్రి “రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన” జిల్లా పార్టీ అధ్యక్షులు *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* , రాష్ట్ర నాయకు *మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి)* , ఇబ్రహీంపట్నం నియోజకవర్గ *బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు*. *అనంతరం ప్రశాంత్ రెడ్డి(బంటన్న) ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.*

E-పేపర్

మున్సిపల్ ఎన్నికల వేళ బిఎస్పీలో చేరికలు.

*మున్సిపల్ ఎన్నికల వేళ బిఎస్పీలో చేరికలు…* పున్నమి న్యూస్ ప్రతినిధి: 01 ఫిబ్రవరి 2026 తెలంగాణ ఇంచార్జ్ : బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా ,రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలో , గత పాలకుల పాలన లానే అదే తరహాలో , 24 నెలలు దాటినా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్,బి.ఆర్.ఎస్,&బిజెపి పార్టీల పై , తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది., అంతేకాకుండా ఆ పార్టీ నేతలను జనం ప్రశ్నిస్తుండడంతో వారికి సమాధానం చెప్పలేక పోవడంతో, మున్సిపల్ ఎన్నికల వేళ రాజేంద్ర నగర్ నియోజకవర్గ నుండి సుమారుగా 50 మంది నాయకులు నేడు బహుజన్ సమాజ్ పార్టీ లో చేరారు . వీరిని రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి ,అభినందనలు తెలిపారు. ఈ చేరిక కొరకై చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు తప్ప కృష్ణ గారు కీలక పాత్ర పోషించారు. జై భీమ్…! జై భారత్

హెల్త్ టిప్స్

☘️రోజూ మొలకెత్తిన పెసలు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు 🌱

రోజూ మొలకెత్తిన పెసలు (Green Gram Sprouts / మొలకెత్తిన మినపప్పు) తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సహజంగా అందుతాయి. ఇవి జీర్ణానికి సులభంగా ఉండి, శరీరాన్ని లోపలినుంచి బలపరుస్తాయి. ముఖ్యంగా బలహీనత, అలసట, జీర్ణ సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మొలకెత్తిన పెసల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, విటమిన్ C, B-కాంప్లెక్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఆహారం. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో హిమోగ్లోబిన్ పెంచడంలో తోడ్పడతాయి. మహిళలకు, ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో శక్తిని ఇచ్చే ఆహారంగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన పెసలు తినడం వల్ల బరువు నియంత్రణ, చర్మం కాంతివంతంగా మారడం, జుట్టు రాలడం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు—అందరికీ ఇది ఒక సంపూర్ణ ఆరోగ్యాహారం. 👉 ఎలా తినాలి? ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం వేసి, ఉల్లిపాయ/క్యారెట్‌తో సలాడ్‌లా తినవచ్చు. తేలికగా ఉడికించి కూడా తీసుకోవచ్చు. 🌿 రోజూ చిన్న పరిమాణంలో తీసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.