ఆర్య వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కోనా శ్రీనివాస్ బాధ్యతల స్వీకారం
అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోనా శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం వేలాదిమంది ఆర్య వైశ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా కోనా శ్రీనివాసరావు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన పలువురు ఆర్య వైశ్యులను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి, అర్హులైన ఆర్య వైశ్యులకు 30 కుట్టు మిషన్లు, మహిళలకు 100 గ్రైండర్లు, పేదరికంలో ఉన్న ఆర్య వైశ్య విద్యార్థులకు 20 ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే అన్నదేవరపేట, చిడిపి, పెద్దేవం గ్రామాలకు చెందిన ఆర్య వైశ్యులలో పేదవారిని గుర్తించి, ఐవిఎఫ్ సెక్రటరీ మారం కృష్ణ ప్రసాద్ (కె.పి) సూచన మేరకు రెండు గ్రైండర్లు, ఒక కుట్టు మిషన్‌ను కె.పి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్య ప్రముఖులు, ఆర్య వైశ్య కుటుంబ సభ్యులు, సంఘ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.











