Tuesday, 10 March 2026

Blog

కడప

కడప లో ఏడవ తేదీ న భూపేష్_రెడ్డి, జబీవుల్లా ప్రమాణస్వీకారం

*కడప లో ఏడవ తేదీ న భూపేష్_రెడ్డి, జబీవుల్ల ప్రమాణస్వీకారం.! రాజకీయంగా కీలక ఘట్టం* *#కడప_జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన #దేవగుడి_భూపేష్_రెడ్డి ప్రధాన కార్యదర్శిగాఎన్నికైన వై యస్ జబీవుల్లా #ప్రమాణస్వీకార_కార్యక్రమం ఈ నెల 7వ తేదీన కడప నగరంలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో టీడీపీకి దిశానిర్దేశం చేసే రాజకీయ ఘట్టంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కడప నగరంలోని సున్నం బట్టీల సమీపంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయ ఆవరణంలో జరిగే ఈ కార్యక్రమానికి #భారీ_ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతో పాటు జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి జబీవుల్ల మరియు 40 మంది కార్యవర్గ సభ్యులంతా కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.*

ఆంధ్రప్రదేశ్

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

సాగు నీటి సంఘాలను బలోపేతం చేసి రైతుల సమస్యలకు పరిష్కారం చూపే విధంగా సీఎం చంద్రబాబునాయుడు అమరావతి లో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమానికి బంటుమిల్లి నుండి బస్సు లో తరలి వెళ్లిన బంటుమిల్లి మండల నీటి సంఘాల అధ్యక్షులు.ఈ కార్యక్రమాన్ని స్థానిక MLA కాగితకృష్ణప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యలు, కాలువల పటిష్టత, నీటి సంఘాల బలోపేతమే ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ సదస్సుకు తరలి వెళ్లిన వారిలో బంటుమిల్లి DC చైర్మన్ బొర్రా కాశీ, ములపర్రు నీటి సంఘం అధ్యక్షులు చింతా వెంకటేశ్వరావు, కంఠమనేని మురళి, మరియు కూటమి నాయకులు తదితరులు ఉన్నారు.

తిరుపతి

పుస్తకాలు పట్టే వయస్సులో పుస్తెల భారం వద్దు- ప్రగతి స్వచ్ఛంద సేవ సంస్థ

శ్రీకాళహస్తి, పిబ్రవరి 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలంలోని వేలవేడు గ్రామంలో ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు నిరోధించాలని అంగన్వాడీ టీచర్లు, మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ గ్రేడ్ వన్ సూపర్వైజర్ హరిత మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండని బాలిక 21 సంవత్సరాలు నిండని బాలుడు పెళ్లి చేసుకునే ఇద్దరిలో ఏ ఒక్కరికి వైసురీత్యా తక్కువగా ఉంటే దానిని బాల్య వివాహం అంటారని గ్రామీణ ప్రాంతాల్లో శివరాత్రి పురస్కరించుకుని ఎక్కువగా బాల్య వి వాహాలు జరిగే అవకాశం ఉందని అంగన్వాడీ టీచర్లు కిషోర్ బాలికలకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రగతి స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పుస్తకాలు పట్టే వయస్సులో పుస్తెల భారం వద్దని చట్టంతో పాటు సామాజిక దృక్పథాన్ని మార్చడానికి మన వంతు ప్రయత్నాలు చేయాలి బాలికలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను వారికి అందే అందేటట్లు చేయడం యుక్త వయసులో పిల్లలతో సంఘాలు ఏర్పాటు చేసి వారికి అవగాహన పెంచడం 18 సంవత్సరాలలోపు పిల్లలను పాఠశాలలో ఉండే విధంగా చదువుకునేటట్లు తల్లిదండ్రులను ప్రోత్సహించాలి అవగాహన కల్పించాలి గ్రామస్థాయిలో అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచి బాలికల సంరక్షణకు పనిచేస్తున్న ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలతో నిరంతరం సమావేశాలు నిర్వహించి వారిలో అవగాహన పెంచడం బాల్యవివాహాలు జరగడానికి మూల కారణాలు పేదరికం సాంప్రదాయాలు అధిక సంతానం వరకట్నం సమస్య నిరక్షరాస్యత సామాజిక భద్రత లేకపోవడం బాలల హక్కుల పట్ల అవగాహన లేకపోవడం ఆడపిల్లల పెంపకం చదువు భారంగా భావించడం బాల్యవివాహాలు వలన జరిగే అనర్ధాలు తెలుసుకో లేకపోవడం ముఖ్య కారణాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కో కన్వీనర్ రామచంద్ర మహిళా సంరక్షణ కార్యదర్శి తులసి అంగన్వాడీ టీచర్లు ముద్దుముడి ఎర్రగుడిపాడు ఓరందూరు అక్కుర్తి ఉడుములపాడు గంగులపూడి ఓబులాయిపల్లి తదితర గ్రామాల నుండి అంగనవాడి టీచర్లు మహిళలు పాల్గొన్నారు.

తిరుపతి

నిరుద్యోగులకు వరం శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా-జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి

శ్రీకాళహస్తి, పిబ్రవరి 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యుల బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని విక్రమ్ డిగ్రీ కళాశాల మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నిరుద్యోగుల నుండి విశేష స్పందన లభించి విజయవంతమైంది. ఈ జాబ్ మేళా ను ఉద్దేశించి తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి 20 లక్షలు ఉద్యోగాలలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారికి 13000/- నుంచి 20000/- వరకు కనీస వేతన సదుపాయం కలదని తెలియజేశారు అదేవిధంగా ఉద్యోగంలో సెలెక్ట్ కాని వారికి త్వరలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఎస్ వి ఏ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, స్కిల్ హబ్ ఏర్పాటు చేశామని అందులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం నిరంతరం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అనంతరం విక్రమ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్,పట్టాభి మాట్లాడుతూ.. చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి వారికి, ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారికి ఇలాంటి జాబ్ మేళా జరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు పొంది ఆర్థికంగా, సాంఘికంగా వారి కుటుంబానికి అండగా ఉంటూ వారు ఎదుగుదలకి చాలా మంచిగా దోహదపడతారని జాబ్ మేళాకు హాజరైన యువతీ యువకులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ జాబ్ మేళాకి 12 బహుళ జాతీయ కంపెనీలు మెగా జాబ్ మేళాకు హాజరు అవ్వగా 374 మంది హాజరవుగా, 168 మంది వివిధ కంపెనీలకు ఉద్యోగ అర్హత పొందడం జరిగినది అలాగే 21 మంది ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అవడం జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఏపీ ఎస్ ఎస్ డి సి సిబ్బంది, విక్రమ్ డిగ్రీ కళాశాల సిబ్బంది పాల్గొనడం జరిగినది.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించింన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి, పిబ్రవరి 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ దేవి శివరాత్రి ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న సందర్బంగా బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని ఆహ్వానించింన శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈవో బాపి రెడ్డి, బోర్డు సభ్యులు కొప్పెర్ల నాగరాజు, గోపి నాద్, రాఘవయ్య, మురళి, డిప్యూటీఈవో కృష్ణారెడ్డి, కృష్ణా రెడ్డి, రాజా, దేవస్థానం అర్చకులు వేద పండితులు రాఖీ స్వామి, శివకుమార్ స్వామి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ముక్కంటి నిత్యాన్నదాన పథకానికి రూ.. లక్ష విరాళం

శ్రీకాళహస్తి టెంపుల్ న్యూస్, పిబ్రవరి 04, పున్నమి న్యూస్: శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ వాస్తవ్యులు జ్యోతిర్మయి, మనోజ్ బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప సమక్షంలోఆలయ ఈవో బాపిరెడ్డికి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ పిఆర్ఓ రవి శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించి వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. అనంతరం వీరు ఆలయ అన్నప్రసాద వితరణకు లక్ష రూపాయలు విరాళం డొనేషన్ కౌంటర్లో అందజేసి, ఆలయ ఈవో బాపిరెడ్డి చేతులు మీదుగా లక్ష రూపాయల రసీదును వీరికి అందించారు. ఈ కార్యక్రమంలో చంద్రప్ప కుమారుడు తరుణ్, ఆలయ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

జనసేనానికి శ్రీకాళహస్తీశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

శ్రీకాళహస్తి, పిబ్రవరి 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ఆహ్వానించారు. బుధవారం నాడు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కి ఆహ్వాన పత్రికతో పాటు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కి వేదాశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళీ, ఆలయ అధికారులు పాల్గోన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గ్రామీణ ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నామని మనుబోలు ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ మోహసిన్ సుల్తానా తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు. 18 ఏళ్ల పైబడినవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పొగాకు, గుట్కా వాడకం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని, క్యాన్సర్‌కు చికిత్స ఉందని, ముందస్తు పరీక్షలతో నివారించవచ్చని వివరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైయస్ షర్మిల అక్కంపేట పర్యటనను విజయవంతం చేయాలి

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి ఈనెల 12న మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి వైయస్ షర్మిల రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సర్వేపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బల్ల హరి పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో షర్మిల కూలీలతో మాట్లాడతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

E-పేపర్

నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? – రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్.

*నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? – రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్.* *గెలిచే దమ్ములేక మా అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు* *వడ్డీతో సహా చెల్లిస్తాం గుర్తుపెట్టుకోండి.* జనం న్యూస్ 2026 ఫిబ్రవరి 5 మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్ తెలంగాణ కోసం పదవులులేదని కాదు..ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి గెలిచే దమ్ములేక, ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభపెట్టి పార్టీలు మారుస్తున్నారని మాజీ మంత్రి, హరీష్ రావు మండిపడ్డారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషపై, పాలనపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అని అడుగుతున్నా. అవ్వతాతలు రూ. 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్ అని అడిగితే లాగుల తొండలు వదులుతా అంటావా.బాండ్ పేపర్లు రాసిచ్చి, అమ్మతోడు అని చెప్పి మోసం చేశావు కదా.. ఆడబిడ్డలు మహాలక్ష్మి రూ. 2500 అడిగితే ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అంటావా? ఇదేనా నీ సంస్కారం? నీ రౌడీయిజం సాగదు ఖబర్దార్.తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన మహనీయుడు కేసీఆర్. అని అన్నారు. కె సిఆర్ చెబితే మేము కూడా పదవులకు రాజీనామా చేసి ఆంధ్రా పాలకుల ముఖం మీద కొట్టినం. మరి నువ్వు? రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్ పంపిన దొంగవు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన ద్రోహివని అన్నారు. కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చారు కాబట్టే నువ్వు ఈరోజు సీఎం కుర్చీలో ఉన్నావు. లేకపోతే ఆంధ్రాలో మోచేతి నీళ్లు తాగుతూ, బ్యాగులు మోసుకుంటూ బతికేవాడివి. కాంగ్రెస్ పార్టీకి గెలిచే సత్తా ఉంటే మా అభ్యర్థులను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? జనం మీకు ఓటు వేయరని అర్థమై.. పోలీసులతో బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కండువాలు కప్పుతున్నారు. ఎవరెవరు అమ్ముడుపోతున్నారో, ఎవరు ఎందుకు ఎత్తుకుపోతున్నారో అందరినీ గుర్తుపెట్టుకుంటాం. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం. ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11వ తేదీలోగా రైతు బంధు పడకపోతే.. రైతులు నీ చెడ్డీల తొండలు తొడిగి ఏడిపిస్తారు. నిన్ను చీరిచింతకు చెండాడుతారని,రుణమాఫీ పేరుతో దేవుళ్లనే మోసం చేసిన ఘనుడివి నువ్వు. నీ అబద్ధాలను రైతులు నమ్మే స్థితిలో లేరని మెదక్ జిల్లా కల నెరవేర్చింది కేసీఆర్. ఇక్కడికి కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, రైలు, నాలుగు లైన్ల రోడ్డు తెచ్చింది కేసీఆర్ అని ఘనపూర్ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది మేము. సిద్దిపేటతో సమానంగా మెదక్‌ను అభివృద్ధి చేశామని కాంగ్రెస్ వచ్చాక ఇక్కడ ఒక్క రూపాయి పని జరగలేదన్నారు. మెదక్‌లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు మీ హరీష్ అన్న ఉన్నాడు.. నేను చూసుకుంటా. కాంగ్రెస్ గుండా రాజకీయాన్ని, మోసాలను ఎండగట్టండని తెలిపారు. బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్‌లో గుండు సున్నా ఇచ్చారు. కాబట్టి కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. మెదక్ అభివృద్ధిని కొనసాగిద్దాం. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి, మాజీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.