Tuesday, 10 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“సీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయం – కాకాణి”

పున్నమి ప్రతినిధి, SPSR నెల్లూరు | ఫిబ్రవరి 4, 2026: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండల కేంద్రం, భోగసముద్రంలో మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు యూరియా సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు. కూటమి పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడాన్ని నిరసిస్తూ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పథకం తిరిగి ప్రారంభించే వరకు పోరాటం కొనసాగుతుందని కాకాణి స్పష్టం చేశారు. ప్రజలు, రైతుల పక్షాన నిరంతరం నిలబడతామని తెలిపారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాయలసీమ లిఫ్ట్ కోసం పోరాటం ప్రారంభం : కాకాణి

పున్నమి ప్రతినిధి, నంద్యాల | ఫిబ్రవరి 5, 2026: రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. పనులు పూర్తి చేసే వరకు రాజీ లేని పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

తిరుపతి

యస్సీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం

తొట్టంబేడు పిబ్రవరి 05, పున్నమి న్యూస్: మండలంలోని బసవయ్యపాలెం యానాది కాలనీలో డాక్టర్ ప్రమీలమ్మ ఆద్వర్యంలో అపోలో గ్రూప్స్ హాస్పిటల్స్ అధినేత పద్మ విభూషణ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 93వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ యస్సీ కాలనీ వాసులకు వైద్య పరిక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు న్యూట్రిషన్ పౌడర్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె సుధాకర్ రెడ్డి, ఏఎన్ఎం మౌనిక, హరీష్, కళావతి, సునీత, సురేష్, నంద గోపాల్ పాల్గొనడం జరిగింది.

తిరుపతి

జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి పిబ్రవరి 05, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తిలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 76 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని నిరావహించారు. జన సైనికులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన పార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మనీ,ముని చంద్ర, చందు,రాజా, సాయి, పసల ఎలిసా, తేజ వీర మహిళలు, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత , పేట బత్తెమ్మ,తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వాయులింగేస్వరుని సేవలో మహా న్యూస్ చైర్మన్

శ్రీకాళహస్తి పిబ్రవరి 05, పున్నమి టెంపుల్ న్యూస్: శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం గురువారం నాడు మహా న్యూస్ చైర్మన్ వంశీకృష్ణ ఆలయానికి విచ్చేశారు. శ్రీకాళహస్తి క్షేత్రానికి విచ్చేసిన వంశీకృష్ణకి శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సాదర స్వాగతం పలికి, శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించి ఆలయ వేద పండితులచే ఆశీర్వదించి వాయులింగేశ్వరుని తీర్థప్రసాదాలు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. అనంతరం వారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు విచ్చేయవలసిందిగా కోరిన ఎమ్మెల్యే.

తిరుపతి

కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఆధునిక లాకర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పిబ్రవరి 05, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో టౌన్ బ్యాంక్ చైర్మన్ ఎస్. ఖాదర్ బాష ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచనలతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బ్యాంక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “7 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ తో పాటు బ్యాంకులో ఆధునిక సదుపాయాలతో కూడిన లాకర్లను ఏర్పాటు చేసి వీటిని ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభించాలని ఎమ్మెల్యేని కోరడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ ఎస్.ఖాదర్ భాష మాట్లాడుతూ,శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నాయకత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విధంగా కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌ను కూడా అదే అభివృద్ధి బాటలో నడిపిస్తానని బ్యాంక్‌కు త్వరలోనే ఏటీఎం. (ATM)ప్రారంభోత్సవం నిర్వహిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంక్ ఆధునీకరణ చర్యలు పట్టణ ప్రజలకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంలో కీలకంగా నిలవనున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోలా ఆనంద్, బ్యాంకు సీఈవో ధనంజనేయులు,మరియు కూటమి నాయకులు , బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

స్కౌట్ మాస్టర్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన డిఎస్పీ నరసింహముర్తి

శ్రీకాళహస్తి పిబ్రవరి 05, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబిఎస్ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజులుగా అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి గురువారం నాడు విచ్చేసి శిక్షణ శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సమాజ సేవలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని నవ సమాజ నిర్మాణం కోసం స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కృషి చేయాలని, శిక్షణ పొందిన స్కౌట్స్ మాస్టర్లు పాఠశాల స్థాయి నుండే క్రమశిక్షణ, సేవభావం వంటి ఉన్నత విలువలు పెంపోందించేలా కృషి చేయాలన్నారు. శివరాత్రి ఉత్సవాలకు కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు తమ సేవలందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కమీషనర్ టి. రమేష్ బాబు, లీడర్ అఫ్ ద కోర్స్ జి. వెంకటేశ్వర్లు పాఠశాల హెచ్ ఎం వెంకటయ్య జిల్లా ఇంచార్జి కార్యదర్శి జి. విజయకుమార్, యూత్ చైర్మన్ ఎస్ కె అజారుద్దీన్, రాష్ట్ర పరిశీలకులు డి.ఎల్ నారాయణ, స్కౌట్స్ మాస్టర్లు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైకాపా నుండి తెదేపాలోకి వలసల వెల్లువ

ఏర్పేడు, పిబ్రవరి 05, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని ఎంపేడు గ్రామములో వైసీపీ నుంచి టిడిపిలోకి వలసల వెల్లువ ఏర్పేడు మండలం ఎంపేడు గ్రామం వద్ద వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సమక్షంలో సుమారు 150 మంది వైసీపీ నుండి టిడిపిలోకి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగినది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడతూతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ భారీ చేరికలే నిదర్శనమన్నారు. అభివృద్ధి పథ్యంలో అందరూ భాగస్వాములు కావాలని వస్తున్న ప్రతి ఒక్కరికీ తన పూర్తి మద్దతు ఉంటుందని అందరం కలిసికట్టుగా పనిచేసి శ్రీకాళహస్తిని ప్రగతి పథంలో నడిపిద్దాం మనీ సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్య నాయకులు ఈశ్వర రెడ్డి, రవీంద్ర రెడ్డి, వారి అనుచరులకు ఎమ్మెల్యే పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తెదేపాలో చేరిన వారు మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుధీరన్న చేస్తున్న అభివృద్ధి ప్రస్థానాన్ని చూసి ఆకర్షితులైన ఎం.పేడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలైన తాము సుమారు 150 మందికి పైగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

తిరుపతి

రక్షిత మంచినీరు ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

ఏర్పేడు, పిబ్రవరి 05, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి మండలంలోని ఎంపేడు గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో CSR ఫండ్ కింద ఇండోస్ కాఫీ వర్క్స్ కంపిని బహుకరించిన రక్షిత మంచినీటి ప్లాంట్ ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పి హచ్ సి హాస్పిటల్ ను మరింత అభివృద్ధి చేస్తామని, హాస్పటల్ కు కావలసిన పరికరాలు అందించడం జరుగుతుందని శ్రీ కాళహస్తి జడ్పిటిసి వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రికి రెండు లక్షల విలువ చేసే పరికరాలు అందించడానికి ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి జడ్పిటిసి వెంకట సుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు అక్షింతల కృష్ణయాదవ్,తాటిపర్తి ఈశ్వర్ రెడ్డి, తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి,యునిట్ ఇంచార్జ రమేష్ నాయుడు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఇండోస్ కాఫీ వర్క్స్ ప్రతినిధులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జగన్ అరాచక రాజకీయాలు సాగవు – బొబ్బేపల్లి సురేష్ నాయుడు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం గోవిందరాజుపురం గ్రామంలో జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలనే జగన్ రెడ్డి ప్రయత్నాలు సాగవని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక తప్పుడు రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయం నిజమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్, నాయకులు పోట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.