Monday, 9 March 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తి తాసిల్దార్ కార్యాలయంలో నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు- ఇంచార్జ్ యం.ఆర్.ఓ

శ్రీకాళహస్తి: జిల్లాలో మండలం, డివిజన్, జిల్లాస్థాయిలో సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్‌ను రద్దు అయినట్లు శ్రీకాళహస్తి ఫుల్‌అడిషనల్‌ ఇన్‌ఛార్జి తాసిల్దార్ అనిల్‌కుమార్‌ ఆదివారం నాడు పత్రిక ప్రకటన ద్వారా సమాచారం తెలిపారు. ప్రకటనలో ఆయన వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం వర్చువల్‌విధానంలో రాష్ట్ర సచివాయలం నుంచి మంత్రులు, ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలతో కలిసి వర్చువల్‌గా జిల్లా, డివిజన్,మండల, గ్రామస్తాయి అ«ధికారులతో సమీక్షిస్తారని అందుకేపీజీఆర్‌ఎస్‌ను రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఎవరూ వ్యయప్రయాసలకు ఓర్చి పీజీఆర్‌ఎస్‌కు రావద్దని ఆయనకోరారు.

తిరుపతి

కల్తీ నెయ్యిలో అసలుసూత్రధారులు జగన్ సుబ్బారెడ్డేలే-ఉమేష్ రావు,కోట చంద్రశేఖర్

శ్రీ కాళహస్తి నియోజిక వర్గ దేలుగుదేశంపార్టీ నాయకులు టిడిపి బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్ లు తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యిలో విషయంపై పత్రిక ప్రకటన విడుదలా చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా అత్యంత పవిత్రంగా స్వీకరించే శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రసాయనాల మిశ్రమంతో తయారు చేసిన కల్తీ నెయ్యిని ఉపయోగించడం వెనుక అసలు సూత్రధారులు మాజీ సియం జగన్ రెడ్డి, అతని బాబాయ్ వైవి సుబ్బారెడ్డిలని ఆరోపించారు. తిరుమల లడ్డూని రసాయనాల లడ్డూగా మార్చింది నిజమే అని జగన్ బాబాయ్, నాటి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడని,ఆ లడ్డూలో ఏయే రసాయనాలు కలిసాయి అన్నది సీబీఐ, సిట్ ల దర్యాప్తు నివేదిక స్పష్టంగా చెప్పినప్పటికీ జగన్ & కో జనాన్ని మోసం చేయడానికి కథలు చెబుతూనే ఉన్నారని 2019-24 మధ్యకాలంలో ఐదేళ్లపాటు తిరుమల వెంకన్న ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని సుప్రీంకోర్టు వేసిన సిట్ నిర్ధారించడంతో దేశమంతా హిందువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, హిందూ మతంపై కక్షతో జగన్ రెడ్డి మరియు అతని బృందం శ్రీవారి సన్నిధిలో పాల్పడిన మహా పాపాలను జాతీయ మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రసారం చేస్తున్నా కూడా… కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసి బుకాయించడానికి సిగ్గు లేదని నిలదీశారు. 2022 వ సంవత్సరంలోనే లడ్డూ తయారీలో జరిగిన కల్తీ పై CFTRI రిపోర్ట్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వం ఆ రిపోర్ట్ పై చర్యలు తీసుకోకుండా,దాన్ని తొక్కి పెట్టి, లడ్డూ కల్తీని కొనసాగించి మహా అపచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కాని నెయ్యిలో జంతువుల కొవ్వు, పామాయిల్ ఉన్నట్లు NDDB నివేదిక ఇచ్చిందని… ఇవి ముఖ్యమంత్రి చేసినవి ఆరోపణలు కావని వారు గుర్తు చేశారు. శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి బదులు కెమికల్స్‌ ఉపయోగించి తయారు చేసిన నెయ్యిని కలిపిన మహా పాపం శ్రీశైలంలోనూ జగన్ రెడ్డి యొక్క వైసీపీ పాలనలోనే జరిగిందని, మూడు లక్షలకు పైగా కేజీల కెమికల్స్ నెయ్యి శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదమైన లడ్డూల్లో కలిపేసిన జగన్ గ్యాంగ్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని ఏ నివేదిక లోనూ క్లీన్‍చిట్ ఇవ్వలేదని, NDDB రిపోర్ట్ లో ఫిష్ ఆయిల్, పందికొవ్వు ఉందని రిపోర్ట్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ చేశారని సిట్ తేల్చింది.ఈ కల్తీ లడ్డూలే అయోధ్యకి కూడా పంపించి మహా పాపం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంటు బిసి విభాగం నాయకులు గంగనపల్లి రమేష్,కృష్ణమూర్తి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఏ.పి. సీఎంని కలిసిన బిసి సెల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హరిబాబు

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి నియోజిక వర్గ తెదేపా నాయకులు, తిరుపతి పార్లమెంట్ బిసి సెల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కన్నవరం హరిబాబు అమరావతి రాజధానిలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. మాజీ ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, గౌనివారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాండ్ల, తెలికుల బిసి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షితో కలసి ఎలక్షన్ ముందు గాండ్ల కులస్తులకు ఇచ్చిన బిసి డిక్లరేషన్ లో భాగంగా డిమాండ్ల వినతి పత్రాన్ని హరిబాబు సీఎంకి అందజేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని పత్రిక ప్రకటన ద్వారా కన్నవరం హరిబాబు తెలిపారు.

జనగాం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులనే గెలిపించండి:తీన్మార్ మల్లన్న

టీఆర్పి అభ్యర్థులను గెలిపించండి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ————————————— జనగామ, ఫిబ్రవరి 08,పున్నమి న్యూస్: ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నాయకులను,అభివృద్ధికి పాటు పడే విద్యావంతులను ఎన్నుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న తెలిపారు. జనగామ పట్టణం మున్సిపాలిటీ 5,10,13,23 వార్డులలో విస్తృతంగా ప్రచారం చేశారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి 5వ వార్డు లో పో పోటిచేస్తున్న రేణుకుంట్ల మురళి బైండ్ల కు మద్దతుగా ప్రజల వద్దకు వెళ్ళి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఇప్పటివరకు కాంగ్రెస్, బిఆర్ఎస్,బిజెపి పార్టీ లకు అనేక సార్లు అవకాశం ఇచ్చారని అయినప్పటికీ మున్సిపాలిటీ లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే మిగిలి పోయాయని అన్నారు. ఈ ఒక్కసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చినట్లయితే రాజకీయాలు మారడంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని స్పష్టం చేశారు.ఎప్పుడూ ప్రజల ‌మధ్య ఉండి,వారి అభివృద్ధి కై నిరంతరం పనిచేసే నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులని మల్లన్న తెలిపారు.మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిలదేనని అందుకు ప్రజలు తమ ఓటు కత్తెర గుర్తు పై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.జనగామ మున్సిపల్ కౌన్సిల్ లో డ్రెయినేజీ,రోడ్లు,వీధి దీపాలు,తాగునీరు ఏర్పాటు కు గట్టి పోరాటం చేస్తామని అన్నారు.ప్రచారంలో మల్లన్న తో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా ,మండల,పట్టణ నాయకులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజుకు ఘన జన్మదిన సన్మానం

ముస్తాబాద్ / పున్నమి ప్రతినిధి/ ఫిబ్రవరి స్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు గారి జన్మదినం సందర్భంగా ఘనంగా శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కే.కే. మహేందర్ రెడ్డి గారు పాల్గొని గజ్జెల రాజు గారిని శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం రాజు గారు చేస్తున్న సేవలను మహేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు. ముస్తాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజు గారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.

E-పేపర్

హోటల్ తనిఖీ యజమానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తనిఖీ సమయంలో మహిళా అధికారిని బెదిరించిన సహస్ అర్బన్ డయల్ ఇన్ యాజమాన్యం

హోటల్ తనిఖీ యజమానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తనిఖీ సమయంలో మహిళా అధికారిని బెదిరించిన సహస్ అర్బన్ డయల్ ఇన్ యాజమాన్యం రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల సర్కిల్ జిహెచ్ఎంసి ఫిబ్రవరి 8: ఆదిభట్ల సర్కిల్ కార్యాలయ పరిధి మంగళపల్లి ప్రధాన రోడ్ లో గల సాహస అర్బన్ డైన్ ఇన్ హోటలను శనివారం గ్రేటర్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఇతనికీలో తేల్చారు. నిషేధిత పదార్థాలతో తయారుచేసిన ఆహారాన్ని పడేశారు వినియోగదారులకు రుచికరంగా ఉండేందుకు నిషేధిత టెస్టింగ్ ఉప్పు ని వాడినట్లు గుర్తించారు. హోటల్లో శుభ్రత పాటించట్లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో మహిళ అధికారి ఎన్ వనిత అక్కడి పరిస్థితిని తన చరవానీ లో రికార్డు చేస్తుండగా హోటల్ సిబ్బంది తనను బెదిరించారని చరవాణిని లాక్కున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కామారెడ్డి

దండకారణ్య రక్తపు చీరలో ముగిసిన తెలంగాణ వీరుడు..

కామారెడ్డి, 07ఫిబ్రవరి, ( పున్నమి ప్రతినిధి ) : – లోకేటి చందర్ జీవిత గాథ! కామారెడ్డి, 8 ఫిబ్రవరి, ( ఫున్నమి ప్రతినిధి ) : మహారాష్ట్ర గడ్చిరోలి అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్‌లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, పశ్చిమ సబ్‌జోనల్ బ్యూరో ఇంచార్జ్ ప్రభాకర్ అలియాస్ స్వామి, అలియాస్ లోకేటి చందర్ (61) సహా ఏడుగురు మావోయిస్టులు అమరుల య్యారు. ఆదివారం ఆయన మృతదేహం స్వగ్రా మం ఇస్రోజివాడి చేరుకుని కుటుంబం, గ్రామస్థుల ను విషాదానికి లోను చేసింది. పూర్తి కుటుంబాన్ని అడవుల్లోకి ఆకర్షించి ముగింపు ఆయన జీవితం.. పేదల పోరాటం నుంచి దశాబ్దాల గెరిల్లా యుద్ధం వరకు తనే రాసుకున్న ఆత్మకథలోనే ఆయన గాథ మెరుస్తోంది!పేదల కుమారుడు నుంచి విప్లవ యోధుడుఇస్రోజివాడి గ్రామంలో 1969లో ఆరే కుల పేద కుటుంబంలో లోకేటి వీరన్న, కిష్టాబాయి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించాడు చందర్. వ్యవసాయ కార్మికులైన తల్లిదండ్రులకు అక్క గంగాబాయి, అన్నలు రాజేశ్వర్ రావు, మానిక్ రావు. ఆరేళ్ల చదువు మాత్రమే.. కానీ భూస్వాముల అణచివేతలకు వ్యతిరేకంగా 1986లో RYLలో చేరి గ్రామ అధ్యక్షుడయ్యాడు. భూపంపిణీ, కూలీల జీతాలు, విద్యుత్ పోరాటాలు చేపట్టి ప్రజల్లో మార్కు చేసుకున్నాడు. 1989లో భూస్వాములు (రాజేశ్వర్ రావు మాలీ పటేల్, చిన్న రాజిరెడ్డి, నారాయణ్ రావు పోలీస్ పటేల్) పోలీసులతో కలిసి గ్రామాన్ని చుట్టి 100 మంది అరెస్టు చేశారు. ప్రజల ఒత్తిడికి మీటింగ్‌లో భూ స్వాముల మెడలు వంచి అరెస్టులు రద్దు చేయిం చాడు!కుటుంబ బంధాలు కోల్పోయి అడవుల్లో కి1984లో సంగోజివాడి సులోచనతో పెళ్లి. ఇద్దరు కూతుళ్లు రజిత (1987, వికల, 1999 మరణం), లావన్య (1989); కుమారుడు రమేష్ (1991). తండ్రి 1996, తల్లి 2022 చనిపోయినా 1995లో చివరిసారి కలిశాడు. భార్య సులోచన 8 ఏళ్ల క్రితం దండకారణ్యంలో అనారోగ్యంతో మరణించింది. కూతురు లావణ్య (అలియాస్ శాంతి) ఛత్తీస్గఢ్ జైలులో, కుమారుడు రమేష్ ఇటీవల సరెండర్. మొత్తం కుటుంబం విప్లవ బాటలోనే!33 ఏళ్ల గెరిల్లా ప్రయాణం1991 ఏప్రిల్ పూర్తి సమయ విప్లవకారుడిగా చేరాడు. కామారెడ్డి, సిర్నాపల్లి, సిరిసిల్లా, నిజామాబాద్‌లో Dvcmగా పని. 2003లో డీకేలోకి.. దక్షిణ్ సబ్‌జోన్, 2011 నుంచి పశ్చిమ సబ్‌జోన్ ప్రభారి. కంపెనీ-2,10,4 సచివ్‌గా ఆయుధ పోరాటాలు చేపట్టాడు.25-30 ఎన్కౌంట ర్లు ఎదుర్కొన్నాడు. 1993 పడ్కల్ సెల్టర్‌లో 26 గంటల చుట్టుముట్టాన్ని తప్పించుకున్నాడు. 2021 మర్సుల్, 2024 కాకూర్ పెద్ద దాడుల్లో బయటపడ్డాడు.పార్టీ సమావేశాలు & త్యాగాలు2 రాష్ట్ర మహాసభలు, 5 ప్లీనాలు, డివిజన్ క్లాసుల్లో పాల్గొన్నాడు. ఎకనామిక్స్, ఫిలాసఫీ, MLM శిక్షణ పొందాడు. ఆపరేషన్ కగార్‌లో రూ.4-8 లక్షల రివార్డ్‌తో అత్యంత కాంటెస్ నేతగా మారాడు .స్వగ్రామంలో విషాద యాత్రఆదివారం మృతదే హం చేరుకుని గ్రామం కన్నీరు మునిగింది. పౌరహ క్కు నేతలు “బూటక ఎన్కౌంటర్.. ఆపరేషన్ కగార్ ఆపాలని నినదించారు. పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. చందర్ ఆత్మకథలోని ప్రతి పేజీ పేదల ఆకాంక్షలు, రక్తపు త్యాగాలు చెప్పుతోంది. దండకారణ్య గుహల్లో ముగిసిన ఈ తెలంగాణ వీరుడి గాథ గ్రామపంచాల్లో మునిగిపోతోంది!

ఖమ్మం

ప్రచారానికి కౌంట్‌డౌన్… ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒంటరి పోరుకు అనుకూల వాతావరణం?

ఖమ్మం (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్‌డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లాలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. నిన్న సత్తుపల్లిలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ర్యాలీలో వైసీపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ జెండాలు ఒకేచోట కనిపించడంపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అవకాశవాద రాజకీయాలు ఈ స్థాయికి దిగజారడం సిగ్గుమాలిన చర్యగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చే అవకాశముందని, ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీకి పట్టం కట్టాలన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, 13వ తేదీన అభ్యర్థుల విజయం–పరాజయాలను ప్రజలే తేల్చనున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.