Thursday, 5 March 2026

Blog

అన్నమయ్య

పుట్టినరోజు వేళ.. మానవత్వం చాటుకున్న వైనం!

ఆర్భాటాలకు పోకుండా, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే అసలైన వేడుక అని అత్తిగారిపల్లికి చెందిన అనిమెల సుబ్బరాయుడు, కృష్ణవేణి దంపతులు నిరూపించారు. తమ కుమారుడు అనిమెల హన్సిత్ నాలుగో పుట్టినరోజును పురస్కరించుకుని, మానవత చిట్వేలు శాఖ** సహకారంతో మంగళవారం శ్రీ శ్రీ శ్రీ నారాయణ తపోవన ఆశ్రమంలో నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ.. పుట్టినరోజు వంటి శుభకార్యాలను ఆశ్రమంలోని వృద్ధులు, అనాథల మధ్య జరుపుకోవడం ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆశ్రమ అభివృద్ధికి, అక్కడ ఉన్న పెద్దల పోషణకు ఎంతో తోడ్పడతాయని తెలిపారు. సామాజిక స్పృహతో వ్యవహరించిన బాలుడి తల్లిదండ్రులను ఆమె నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారు.చిట్వేలి మానవత సంస్థ చేస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలను నాగేశ్వరమ్మ ప్రత్యేకంగా అభినందించారు. ఆశ్రమంలోని వృద్ధులకు, అవసరార్థులకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్న సంస్థ సభ్యుల కృషిని ఆమె కొనియాడారు. హన్సిత్ పుట్టినరోజున ఇలాంటి మంచి కార్యక్రమానికి నాంది పలకడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యకర్త చంద్ర, ఆశ్రమ పెద్దలు చిట్వేలి వెంకటరమణ, హన్సిత్ కుటుంబ సభ్యులు మరియు ఆశ్రమవాసులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎండలపై అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ మొహసీన్ సుల్తానా

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చ్ పున్నమి ప్రతినిధి వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎండలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనుబోలు ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారిని డాక్టర్ మొహసీన్ సుల్తానా సూచించారు. అవసరం లేకుండా ఎండల్లో తిరగకూడదని, అత్యవసరమైతే క్యాప్ ధరించాలని చెప్పారు. వడదెబ్బ తగిలితే చల్లటి ప్రదేశానికి తరలించి తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలని, తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువగా నీరు తాగి చదువుపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గేయ పూజిత, సీహెచ్ఓ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్‌లో ఉచిత వైద్య శిబిరం:

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన నిరాశ్రయ కుటుంబాలు మరియు వారి చిన్నారుల కోసం ఉచిత వైద్య శిబిరం, ఆరోగ్య అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. డా. గొంగూర వెంకటేశ్వర్లు (జి.వి.) ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 200 మందికి పైగా ప్రజలకు వైద్యులు వైద్య పరీక్ష లు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు, ప్రాథమిక రక్తపరీక్షలు మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు .ముఖ్యంగా పిల్లల ఆరోగ్య పరిస్థితులు, మహిళల ఆరోగ్య సమస్యలు, వృద్ధుల దీర్ఘకాలిక వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా డా. గోంగూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ఆరోగ్య సేవలు అందించడం మన సామాజిక బాధ్యత. నివాసం కోల్పోయిన కుటుంబాలకు వైద్య సహాయం మాత్రమే కాకుండా, ఆరోగ్య అవగాహన కూడా అత్యంత అవసరం. ఇలాంటి శిబిరాలను నిరంతరం నిర్వహిస్తాము” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. షేక్ యేడుకొండలు, డా. కృప, డా. హనుమంత్ రావు, నరేష్, కిరణ్, అరుణ్, శ్రీకాంత్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొని సేవలందించారు. శిబిరంలో పాల్గొన్న ప్రజలు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసి, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

తిరుపతి

జిల్లాలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ పై మార్చి 3 వ తేదీ నుండి మూడు రోజులు శిక్షణా తరగతుల నిర్వహణ*

జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్* పున్నమి ప్రతినిధి, తిరుపతి సెన్సెస్-2027 లో భాగంగా మొదటి విడతలో హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపట్టడం జరుగుతుందని, పూర్తి డిజిటల్ విధానం లో నిర్వహించే ప్రక్రియ పై మార్చి 03 నుండి 05 వ తేదీ వరకు మూడు రోజులు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.మంగళవారం తిరుపతి ఎస్ వి యూనివర్సిటీ ప్రకాశం భవన్ లో జిల్లాలో నిర్వహించనున్న సెన్సెస్ -2027 లో భాగంగా మొదటి విడతలో నిర్వహించే హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ పై జిల్లా స్థాయి మరియు సంబంధిత అధికారులకు నిర్వహించనున్న మూడు రోజుల శిక్షణా తరగతులను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ క్రమంలో జే సి ఆర్. గోవిందరావు, ట్రైనీ కలెక్టర్ రఘు వాన్సీ, డి ఆర్ ఓ, రాష్ట్ర స్థాయి సెన్సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ కే.సుప్రీజ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న సెన్సెస్-2027 కార్యక్రమం దాదాపు 15 సం.ల అనంతరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ గతం కంటే భిన్నంగా పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు గానూ సెన్సెస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CMMS) ను రూపొందించిందన్నారు. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహించవలసి ఉంటుందని. అధికారులు తమ విధిని నిబద్ధత తో నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ప్రధాన సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారని, జాయింట్ కలెక్టర్ అదనపు సెన్సెస్ అధికారిగా, డి ఆర్ ఓ జిల్లా సెన్సెస్ అధికారిగా ఉంటారన్నారు. కార్పొరేషన్ స్థాయిలో కమిషనర్ ప్రధాన సెన్సెస్ అధికారిగా వ్యహరిస్తారన్నారు. మండల స్థాయిలో సూపర్వైజర్ లు, ఎన్యూమరేటర్లు ఉంటారన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బంది ఎప్పటికప్పుడు తమ పై అధికారుల సూచనలను పాటించవలసి ఉంటుందన్నారు. శిక్షణా తరగతులలో భాగంగా మెటీరియల్ ను అందించడం జరుగుతుందన్నారు. మెటీరియల్ చదివి పూర్తి అవగాహనతో ఎన్యూమరేటర్లకు వివరించాలన్నారు. జిల్లాలో సెన్సెస్ కార్యక్రమం ను రాష్ట్ర స్థాయి నుండి ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షించడం జరిగిందన్నారు. మాస్టర్ ట్రైనర్ లను త్వరలో ఎంపిక చేసి ఫీల్డ్ ట్రైనర్ లకు శిక్షణ ఇస్తారని, ఫీల్డ్ ట్రైనర్ లు మండల, మున్సిపల్ పరిధిలో ఛార్జ్ ఆఫీసర్ లకు, సూపర్వైజర్ లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. డిజిటల్ విధానంలో నిర్వహించే ప్రక్రియను నిర్దేశించిన విధానంలో తప్పులు లేకుండా నిర్వహించాలన్నారు.

ఖమ్మం

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి :బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు

ఖమ్మం మార్చి ( పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల కూల్చివేత ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మం నగరం కి చెందిన అయన హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్లలో 62 ఎకరాలు 7 గుంటల భూదాన్ భూమిని 2014లో సుమారు 800 పేద కుటుంబాలకు కేటాయించారని, అప్పటి నుంచి వారు అక్కడే నివసిస్తున్నారని తెలిపారు. కనీస వసతులు కల్పించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా స్పందన రాలేదన్నారు. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ ఇళ్ల కూల్చివేత జరగడం చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 4 వేల పోలీసులతో, 200 బుల్డోజర్లతో తెల్లవారుజామున ఇళ్లను కూల్చివేయడం మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. భూదాన్ బోర్డు ఇచ్చిన అలాట్‌మెంట్ లెటర్లు నకిలీ అని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని, హైకోర్టు ఆరు సార్లు బాధితులకు అనుకూల ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. భూదాన్ ఉద్యమం వినోబా భవే పిలుపుతో ప్రారంభమైందని, 1954లో కల్వల రాజారావు దానం చేసిన భూమి ఇది తప్ప ప్రభుత్వ భూమి కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో సుమారు 1.80 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలోనే 28 వేల ఎకరాల భూదాన్ భూములపై పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెలుగుమట్ల సర్వే నంబర్లు 147, 148, 149లకు సంబంధించిన పూర్తి రికార్డులను బహిర్గతం చేయాలని, కూల్చివేసిన ఇళ్లను తిరిగి నిర్మించి పేదలకు గౌరవప్రద హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఖమ్మం

వెలుగుమట్ల భూదాన్ బాధితులకు అండగా పువ్వాడ ఫౌండేషన్ – భోజన వసతి ఏర్పాటు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం: వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసం కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావ్ మాట ప్రకారం, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో పువ్వాడ ఫౌండేషన్ మరియు భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బాధితులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. మంగళవారం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ బాధితులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్లను కూల్చివేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా రోడ్డున పడేసిందని విమర్శించారు. అనంతరం మంత్రులు బాధితులను అపహాస్యం చేయడం మరింత బాధాకరమని అన్నారు. బాధితులకు గూడు దొరికే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యక్తిగత సహాయకులు రవికిరణ్, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మహిళా నాయకురాలు కొల్లు పద్మ, ప్రచార కార్యదర్శి షకీనా, మాధవి నాయకులు బోజెండ్ల రామ్మోహన్, ఆరెంపుల వీరభద్రం, ఎర్రా అప్పారావు, వీరేందర్ గౌడ్, వెంకట్, ఉస్మాన్, నారుమల్ల వెంకన్న, తిరుమల్, సతీష్, ప్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ…. 03 మార్చ్ 2026 ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు మూడు వారాల్లోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు కౌన్సిలర్లు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా తమ మద్దతు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు

ఖమ్మం

అల్లుడు కి అనారోగ్య సమస్య తొ.. దుబాయ్‌లో నే మంత్రి తుమ్మల..

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అల్లుడికి బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చినట్లు సమాచారం. కుటుంబ సభ్యుడి అత్యవసర ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆయన గత నెల 23వ తేదీ నుంచి దుబాయ్లోనే కొనసాగుతున్నారు. అల్లుడి చికిత్సపై వైద్యులతో సమీక్షిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి అక్కడే ఉన్నారు. ఇదిలా ఉండగా, ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా విమానాల రాకపోకలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఆయన తిరుగు ప్రయాణంపై స్పష్టత రాలేదు.

E-పేపర్

నిరుపేదలకు కుటుంబ అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎరుకలి నర్సింహ కి మంజూరు..

నిరుపేదలకు కుటుంబ అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎరుకలి నర్సింహ కి మంజూరు.. యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన ఎరుకలి నర్సింహ వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ పాండ్ కింద *రూ.48వేల చెక్* ని సర్పంచ్ *ముచ్చర్ల సుగుణ సంపత్ మాజీ సర్పంచ్ ఎర్కలి బాల్ రాజ్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మోటే శ్రీశైలం ఉప సర్పంచ్ దేంది మధుకర్ రెడ్డి వార్డ్ సభ్యులు లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన స్మార్ట్ కిడ్స్ పాఠశాల యాజమాన్యం

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జీ ) హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని స్మార్ట్ కిడ్స్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, హోలీ పండుగ స్నేహభావం, ఐక్యత, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా, సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు విద్యలోనే కాకుండా సాంస్కృతిక విలువలను కూడా అలవర్చుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.