Wednesday, 15 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం ఈవో బాపిరెడ్డి ఆలయ చైర్మన్ కొట్టేసాయి మరియు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ నూతన ధర్మకర్తల మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్

ఘనంగా పూలమాలలు..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 226వ వారం

పున్నమి అక్టోబర్ 26 హైదరాబాద్: తార్నాక చింతల్ బస్తీలో గల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఆదివారం రోజున పూలమాల వేస్తూ నివాళులర్పించడం జరిగింది ఇది 226వారం బస్తి పెద్దలు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కోసం ప్రచారం చేస్తాము ఆయన కన్న కలలు నిజం చేస్తాము బహుజనులను ఏకం చేసి బహుజన రాజ్యానికి బాటలు వేసే ప్రయత్నం చేస్తామని మనసు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది ప్రతి గ్రామం మండలం జిల్లాస్థాయిలో ఎక్కడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో ప్రాంతాలలో ఉన్నటువంటి బహుజనులు తప్పకుండా విగ్రహాలని నీటిగా కడిగి ప్రతి ఆదివారం మాల వేస్తారని వెయ్యాలని తెలియజేస్తున్నాను యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న బస్సు పెద్దలు ఎం రాజయ్య, టి లక్ష్మణ్, వి మల్లేష్, నరసింహారావు, ఎండి అప్సర్ బై, T నర్సింగ్ రావు, బషీర్, బహుజన ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారామపురంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ

సీతారామపురం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ప్రభుత్వ వైద్య విద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పేదలకు దూరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం సీతారామపురం లో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రెటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల ప్రకారం సీతారామపురం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి సూచనల మేరకు సీతారామపురం పంచాయతీ పరిధిలోని రాజు గారి వీధి, బీసీ కాలనీ, నారాయణమ్మ పేట ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను పిపిపి విధానం లోకి రావడం వలన పేద మధ్య తరగతి కుటుంబాలకు కలిగే నష్టాలను వివరిస్తూ కూటమి పాలన పేద ప్రజలను చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తూ సంతకాల సేకరణను పాలగిరి ముద్దుకృష్ణమరాజు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు వైద్య విద్యను దూరం చేసి తమ జేబులు నింపుకోవాలనే కుట్ర కోణంతో కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని ప్రవేశపెట్టిందని దీనిని రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎన్నికల సమయాలలో ప్రైవేటీకరణను వ్యతిరేకిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పుతూ ప్రైవేటు యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉండే ఆసుపత్రులలో ఉచిత వైద్యాన్ని సైతం పేద ప్రజలకు దూరం చేసి పేద ప్రజల ఉసురు పోసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిపిపి విధానాన్ని కూటమి సానుభూతిపరులే వ్యతిరేకిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలుపుతున్నారన్నారు. పార్టీలకతీతంగా పిపిపి విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములవాలని ఆయన కోరారు. కూటమి పాలన ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కటారి శ్రీనివాసులు, ఏనుగుల రూపేష్, గుండుపల్లి శ్రీను, తిరుపతయ్య, పవన్ కుమార్, నారాయణరాజు, నవీన్, షబ్బీర్, జమీర్ సునీల్, సురేష్, అలీ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు

ఉపాధిహామీ పథకంలో తప్పనిసరిగా e-Kyc

గ్రామీణులు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పించే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. ఎంతో సదుద్దేశంతో దీనిని అందుబా టులోకి తీసుకురాగా కొందరు పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పనులకు రాకున్నా మస్టర్లలో హాజరు వేసుకుని నిధులు పక్కదారి పట్టిస్తున్నారు.ఈ నేపథ్యంలో వీటన్నింటికీ అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ చేపట్టింది. ప్రతి ఉపాధి కూలీ ముఖ చిత్రం ఆధారంగా ఈ కేవైసీకి చర్యలు తీసుకుంటోంది.దీనిద్వారా ఉపాధి కూలీలకు పనులు చూపేలా కృషి చేస్తోంది.e-Kyc ప్రక్రియ చేస్తున్న గోనెగండ్ల మండల ఉపాధి హామీ సిబ్బంది..

అల్లూరి సీతారామరాజు

మొంథా తుఫాను ప్రభావంతో మూతపడిన జలపాతాలు

అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:26 ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన వచ్చే మొంథా తుఫాను తో రాబోయే మూడు రోజులల్లో అల్లూరి జిల్లలో భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలు మేరకు అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల పరిదిలోని జలపాతాలను ఆదివారం నుండి ఈ నెల 28 వరకు మూసివేయడం జరుగుతుందని అరకు సర్కిల్ ఇనస్పెక్టర్ ఎల్ హిమగిరి పేర్కొన్నారు. కావున అరకు వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి వారి అరకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సీఐ సూచించారు. స్థానిక గిరిజనులు భారీ వర్షాలు పడే సమయంలో వాగులు, గెడ్డలు దాటవద్దని హెచ్చరించారు. అత్యవసర సమయాలల్లో పోలీసులకు తెలపాలని అరకులోయ ఎస్ఐ జీ గోపాలరావు సూచించారు.

జనగాం

కార్మికుల సంక్షేమం హక్కుల కోసం నిరంతరం పోరాడే సంఘం సిఐటియు మాత్రమే

*కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి* . *పెట్టుబడిదారుల కోసం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి* స్టేషన్ ఘనాపూర్:-ఈరోజు సిఐటియు మండల కార్యాలయంలో సిఐటియు 9వ మహాసభకు అధ్యక్షులుగా రావుల జగన్నాథం, అమరాజు బాబు వ్యవహరించగ ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ రాపర్తి రాజు గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ కేంద్ర బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం వలన కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం వలన కార్మికులు స్వాతంత్రం పూర్వం నుండి అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి ట్రేడ్ యూనియన్ చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఉద్యోగుల రాజ్య భీమ చట్టం (ఈఎస్ఐ ), ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ (పిఎఫ్ ), గ్రాండ్ డ్యూటీ చెల్లింపుల చట్టం, బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ సెస్ చట్టం, వర్కింగ్ జర్నలిస్ట్ వేతన రేట్ల నిర్ధారణ చట్టం, మోటర్ ట్రాన్స్ పోర్ట్ కార్మికుల చట్టం లతోపాటు 29 రకాల కార్మికుల హక్కుల రక్షణ కోసం చేసినటువంటి చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమని. పని గంటలను 8గంటల నుండి 12 గంటలకు పెంచడం కార్మికుల శ్రమ దోపిడీ చేయడమే దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ధ్వంసం చేస్తూ ప్రజల, కార్మికుల, రైతుల, సబండ వర్గాల హక్కులను స్వాతంత్రాన్ని హరించి వేస్తుందని. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ప్రైవేట్ పరం చేస్తూ పెట్టుబడుదారుల కొమ్ము కాస్తుంది. పెట్టుబడుదారుల మెప్పు కోసమే బిజెపి మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తయారు చేసిందని అన్నారు. 2016 నుండి అమల్లోకి వచ్చిన 7వ పే కమిషన్ పే స్కేలు ప్రకారం కార్మికులకు 26 వేల జీతం ఇవ్వాలి. కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పిస్తూ అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ నెలకు 9000 ఇవ్వాలని కార్మికుల న్యాయపరమైనటువంటి డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి అడుగులకు మడుగులొత్తే విధంగా వ్యవహరిస్తూ పని గంటలను 8 గంటల నుండి 10 గంటలకు పెంచుతూ చేసినటువంటి జీవో నెంబర్ 282ను వెంటనే రద్దు చేయాలని. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి కొడపాక యాకయ్య వివిధ రంగాల కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు లింగనబోయిన శ్రీకాంత్, వెలిశాల రాజు, బొంకూరు రామచంద్ర, జి రామచంద్రం, దైద అనిల్, కొలిపాక వెంకన్న, గుమ్మల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు

కాకినాడ

పెద్దాపురం శ్రీ మరిడమ్మ వారి దేవాలయం లో అన్నదాన కార్యక్రమం

పెద్దాపురం శ్రీ మరిడమ్మవారి దేవస్థానం నందు ప్రతీ ఆదివారం రోజున జరుగు అన్నదానం నకు దూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు ఆకలితో హోటళ్లను ఆశ్రయించకూడదనే ఉద్దేశ్యం తో ప్రతీ ఆదివారం శ్రీ మరిడమ్మ వారి దేవస్థానం నందు అన్నదానం నిర్వహించడం జరుగుతున్నదని ఈవో విజయలక్ష్మి తెలిపారు. ప్రతీ ఆదివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. పలువురు భక్తులు ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా తమ ఆకలి తీరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమం ఇలాగనే కొనసాగాలని భక్తులు పలువురు అభిప్రాయపడ్డారు.

నిర్మల్

గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా జాతీయ సేవా పథకము స్పెషల్ క్యాంప్ లో భాగంగా వాటోలి గ్రామంలో ఈరోజు N SS వాలంటీర్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించా రూ

గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా జాతీయ సేవా పథకము స్పెషల్ క్యాంప్ లో భాగంగా వాటోలి గ్రామంలో ఈరోజు N SS వాలంటీర్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించా రూ ఈ సందర్భంగా గ్రామంలో నీ రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ఏరివేస్తూ రోడ్లను శుభ్ర పరుస్తూ ,గ్రామంలోని క్రీడా ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ఏరివేస్తూ గ్రామంలోని ప్రజలను చైతన్య పరిచారు.అలాగే ఈ క్యాంపు లో మధ్యాహ్న భోజన విరామ అనంతరం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా మోటివేషనల్ స్పీకర్ లక్ష్మణ్ వాడేకర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు నేటి జీవన విధానం లో అనేక ఒత్తిడికి లోనై తమ జీవితంలో అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని పేర్కొంటూ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి కాకుండా క్రమశిక్షణ అలాగే నడవడిక అలాగే ఏకాగ్రతతో కూడి ఉంటే దేనినైనా సాధించవచ్చుని వారు పేర్కొంటూ మనదేశంలో అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించినటువంటి మహానుభావులందరం పేదరికంలోనే పుట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తమ దృఢచిత్రంతో ఒక లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారని అటువంటి వారి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు వెళ్లాలని వారి పేర్కొన్నారు అలాగే ఈ క్యాంపు లో మల్లికార్జున్ టీచర్ మాట్లాడుతూ నేడు విద్యార్థులు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని అటువంటి ఉత్తమ క్రమశిక్షణ నేర్పేటువంటిది సేవా దృక్పథం కలిగినటువంటిది జాతీయ సేవా పథకం అని అందులో భాగంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని క్రమశిక్షణ నిలబడి కనుక్కోడిగి ఉంటే ఎన్నో గొప్ప గొప్ప పదవులను అలంకరించవచ్చని కావున విద్యార్థులు ముఖ్యంగా ప్రతి విషయాన్ని తమ తల్లిదండ్రులతో పంచుకుంటూ అనవసరమైనటువంటి ఆకర్షణలకు లోను కాకుండా దృఢమైన ఆలోచనలతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని వారన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మరియు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త లు ఆరె రాజు డా.ఓం ప్రకాష్ అధ్యాపకులు డా కల్పన రామ్మోహన్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య అధ్యాపకులు విద్యార్థులు సన్మానించారు.

విశాఖపట్నం

తుఫాను దృష్ట్యా సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమం రద్దు

తుఫాను దృష్ట్యా సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కార్యక్రమం రద్దు . విశాఖపట్నం -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి : తుఫాను దృష్ట్యా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో, అన్ని జోనల్ కార్యాలయాల్లో అక్టోబర్ 27వ తేదీన అనగా సోమవారం నిర్వహించవలసిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS ) కార్యక్రమమును రద్దు చేయడమైనదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. కావున విశాఖ నగర ప్రజలు పి జి ఆర్ ఎస్ కార్యక్రమం రద్దు చేసిన విషయాన్ని గమనించవలసిందిగా పత్రికా ప్రకటన ద్వారా కమిషనర్ ప్రజలకు తెలిపారు.

ఖమ్మం

పట్టణం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి కామెంట్స్….

ఖమ్మం….. పట్టణం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అధికార పార్టీ వాళ్లే గొడవలు చేస్తారు మళ్ళీ తిరిగి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కి తూట్లు పొడుస్తున్నారు రాజకీయ దురుద్దేశం తో టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు ప్రజా సమస్యలకోసం సేవే లక్ష్యం గా పని చేసే పార్టీ బీజేపీ పార్టీ అంబేద్కర్ రాజ్యాంగం కి విలువ ఇవ్వండి రంగుల రాట్నం సినిమా చూపిస్తూ ప్రజల చెవిలో పూలు పేడుతున్నారు ఇచ్చిన హామీలు అమలు అయ్యే పరిస్థితి లేదు వీళ్ళ పాలనలో 10 నెలల క్రితం చేసిన పనుల బిల్లులు రావు 10 రోజుల క్రితం చేసిన పనుల బిల్లులు వస్తాయి అప్పుల పాలు అయినం అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వం ది బీజేపీ ప్రభుత్వం వైపు చూసే ప్రజలకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక స్కీమ్ లు ఇస్తున్నాం ఖమ్మం జిల్లాలో రోడ్ల పరిస్థితి ఆధ్వన్నాం,పశువుల అక్రమ రవాణా, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇసుక తోలుకోవడం ఎవరు మంత్రి నో ఎవరు కాంట్రాకర్ నో అర్ధం కానీ పరిస్థితి ఉందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక పోతే అభివృద్ధి చేసే దిక్కు లేదు ఈ ప్రభుత్వం కి ఈ ప్రభుత్వం స్వేత పత్రం ప్రకటించాలి ఇచ్చిన హామీలు ఎటు పోయాయో ఎవడికి ఓటు చోరీ ఎక్కడ ఓటు చోరు అనాడు మీరు ఓటు చోరీ చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ వాళ్ళకి కర్రు కాల్చి ఒత పెట్టేలాగా మీరు బీజేపీ ప్రభుత్వం నీ గెలిపించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.