Sunday, 8 March 2026

Blog

తిరుపతి

ముక్కంటి ఆలయానికి గాజుల వితరణ

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర ఉత్సవాల సందర్భంగా ముక్కంటి ఆలయానికి ఏర్పేడు మండల మాజీ అధ్యక్షుడు నైనారు పొన్నారావు సౌజన్యంతో భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయానికి వచ్చే మహిళా భక్తులకు అమ్మవారి ప్రసాదంతో పాటు గాజులు, పసుపు, కుంకుమలను పంపిణీ చేసే సంప్రదాయంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషీతా రెడ్డి చేతులమీదుగా ఆలయ కార్యనిర్వహణాధికారి టి. బాపిరెడ్డికి ఈ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషీతా రెడ్డి మాట్లాడుతూ…లోకకల్యాణం కోసం జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగస్వాములు కావడం చాల సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో రిషీతా రెడ్డితో పాటు నైనారు పొన్నారావు, ఆలయ అధికారులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

తిరుపతి

భగవద్గీతను అర్ధాలతో అద్భుతంగా వివరించిన చిన్నారి ప్రవాసిని

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీ కాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా, ధూర్జటి కళా ప్రాంగనంలో ప్రత్యేక భగవద్గీత, శివ రుద్ర పారాయణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో, శ్రీకాళహస్తి కీ చెందిన చిన్నారి ఏం. ప్రవాసిని భగవద్గీతలోని శ్లోకాలను పఠించి, వాటి అర్థాలను ఆంగ్లంలో చక్కగా వివరించి ప్రేక్షకులను ప్రసన్నముగా, భక్తితో ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం ఆలయ అధికారుల తరపున శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు సభ్యుడు దండు రాఘవయ్య చిన్నారికి బహుమతి, జ్ఞాపిక, సర్టిఫికెట్, శ్రీ స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తూర్పు గోదావరి

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎస్సై రామకృష్ణ హెచ్చరిక

తాళ్లపూడి,పున్నమి ప్రతినిధి ఫిబ్రవరి 12: తాళ్లపూడి మండల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం (త్రిబుల్ రైడ్), అలాగే మైనర్లు వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై టి. రామకృష్ణ యువ ప్రెస్ టీం సభ్యులకు తెలిపారు. ఈ సందర్భంగా తాళ్లపూడి మార్కెట్ ప్రాంతంలో దుకాణాల ఎదుట అడ్డగోలు పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కాకుండా భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడిపితే అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 30 రోజుల వరకు జైలు శిక్ష పడవచ్చని తెలిపారు. ఇటీవల తాళ్లపూడి బస్టాండ్ సమీపంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ మైనర్ యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. అదనంగా, అధిక లోడుతో వాహనాలు నడిపితే రూ.20,000 వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ లేకపోవడం, త్రిబుల్ రైడ్, మద్యం సేవించడం వంటి కేసుల్లో రూ.1,000 నుండి రూ.10,000 వరకు జరిమానాలు విధించబడతాయని ఎస్సై రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శేరిగూడలో దొంగ ఓట్ల కలకలం…

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శేరిగూడలో దొంగ ఓట్ల కలకలం… పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ శేరిగూడలో దొంగ ఓట్ల కలకలం! నా ఓటు చోడికి గురైంది మహిళా ఓటర్ నా ఓటు నాకు కావాలంటూ మహిళ ఆందోళన జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం : ఓటరు పారిజాత తన ఓటు చోరీకి గురైందని ఆందోళనకు దిగిన శేరిగూడ గ్రామానికి చెందిన మహిళ ఓటరు పారిజాత. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలోని 15వ వార్డులో క్యామ పారిజాత అనే మహిళ ఓటును వేరేవాళ్ళు వేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.. తన ఓటు ఎవ్వరు వేసారంటూ ఏజెంట్లను నిలదీయగా, అప్పటికే నీయొక్క ఓటు వేసారని చెప్పడంతో ఫోటోలు పారిజాత కంగు తినడం జరిగింది. దీంతో మహిళ అక్కడ ఉన్న అధికారులను నిలదీయడం జరిగింది. మా గ్రామస్తులే ఏజెంట్లుగా ఉంటే, వేరే వ్యక్తులు ఎలా ఓటు వేస్తారని మీడియాతో పారిజాత తెలిపారు. అక్రమంగా తన ఓటు వేరే వాళ్ళు వేయడం తగదని నా ఓటు నాకు కల్పించాలని, అక్రమానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు. జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు…. జిల్లా ఎన్నికల అధికారిని కలిసి దొంగ ఓట్లకు సహకరించిన, పాల్పడిన వారిపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని సదర్ మహిళా తెలపడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.

విశాఖపట్నం

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఉక్కు నూతన డైరెక్టర్ పర్సనల్ కి ఐఎన్టియుసి వినతి స్టీల్ ప్లాంట్, పున్నమి ప్రతినిధి, ఫిబ్రవరి 11. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో డైరెక్టర్ పర్సనల్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాకేష్ నందన్ సహాయ్ ని బుధవారం సాయంత్రం డైరెక్టర్ పర్సనల్ కార్యాలయంలో స్టీల్ ఐఎన్టియుసి అధ్యక్షులు పి.వి. రమణమూర్తి ఆధ్వర్యంలో కలిసి స్టీల్ ఐఎన్టియుసి తరుపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ ఐ ఎన్ టి యు సి కార్యదర్శి మంత్రి రాజశేఖర్ డైరెక్టర్ పర్సనల్ తో మాట్లాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికుల ఎదుర్కొంటున్న అనేక సమస్యల పైన డైరెక్టర్ పర్సనల్ కి విన్నవించడం జరిగినది. ముఖ్యంగా వేజ్ రివిజన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరగలేదునీ, కార్మికులకు గత సంవత్సరం నుండి పర్సంటేజ్ లెక్కన జీతాలు చెల్లించడం వలన పూర్తి జీతాలు పొందలేక పోయారునీ, గత సంవత్సరం నవంబర్ 15వ తారీఖున ఉద్యోగులకు కర్మాగారంలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తాం అనే సర్క్లర్ విడుదల చేసి ఆనాటి నుండి ఉద్యోగులకు ఉత్పత్తి ఆధార జీతాలు చెల్లించడం జరుగుతున్నదినీ పర్సనల్ డైరెక్టర్ కి తెలియజేయడం జరిగినది. అలాగే HRA కూడా కార్మికులకు ఇవ్వకుండా నిలుపుదల చేశారనీ, ఉక్కనగరంలో నివాసముంటున్న ఉద్యోగులకు కరెంట్ బిల్లు పెంచేశారనీ, ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి , ఆధార్ కార్డుని బ్లాక్ చేయడం జరిగినదినీ, ఉద్యోగులకి ఇప్పటివరకు రావలసిన పెండింగ్ జీతాలు ముఖ్యంగా చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ఐఎన్టియుసి సీనియర్ నాయకులు మద్ది అప్పలరాజు, జి.మధు, చట్టి సింహాచలం, కోరాడ వెంకటరావు, వంగలపూడి ఈశ్వరరావు నేలతాటి రాజు, తలారి శివ మొదలగు నాయకులు పాల్గొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

E-పేపర్

కళ్లెం నవజీవన్ రెడ్డి ని పద్మావతి కాలనీవాసులు ఘనంగా సన్మానం

కళ్లెం నవజీవన్ రెడ్డి ని పద్మావతి కాలనీవాసులు ఘనంగా సన్మానం కార్పొరేటర్‌గా 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని పద్మావతి కాలనీవాసులు ఘనంగా సన్మానించారు పున్నమి న్యూస్ ప్రతినిధి 10 ఫిబ్రవరి 2026 హయత్‌నగర్ డివిజన్ హయత్‌నగర్ డివిజన్ అభివృద్ధి కోసం గత ఐదు సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తూ, కాలనీలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజ్, మౌలిక వసతులు మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు కృతజ్ఞతగా కాలనీ ప్రజలు ఈ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, పద్మావతి కాలనీ ప్రజల ప్రేమాభిమానాలు తనకు మరింత సేవ చేయాలనే ప్రేరణనిస్తాయని, భవిష్యత్తులో కూడా కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, కాలనీ అధ్యక్షులు అమర్నాథ్ గౌడ్ , కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మధు భూపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి , కృపాకర్ రావు, భాస్కర్, సురేష్ రావు, సురేష్ రెడ్డి, రఘుపతిరావు,చంద్ర శేఖర్, యాదిరెడ్డి, నర్సిరెడ్డి, జయచందర్ వెంకటేశ్వర్లు,వెంకటేశ్వర్ రెడ్డి, బాలాజీ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు…

రాజన్న సిరిసిల్ల

కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకుల ఘాటు నిరసన

ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి రోజు ముస్తాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో పట్టణ మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోమ్మేట రాజు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి సంయుక్తంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కేటీఆర్ గారిపై చేసిన అహంకారపూరితమైన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వెంటనే కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక వహించిన గొప్ప నాయకుడని, ఐటీ మంత్రిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తిపై అసభ్యంగా మాట్లాడటం తగదని అన్నారు. దయాకర్ దళిత సమాజం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కసారి కూడా స్పందించలేదని విమర్శించారు. అలాగే దళితులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిధులు కోరే విషయంలో ఆయన ఎలాంటి చొరవ చూపలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముక్క మల్లయ్య, యండి. జహంగీర్, సుంచు కృష్ణ, శీలం వెంకటేష్, తలారి గొండయ్య, నర్సయ్య, శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో అగ్నిప్రమాదం.. మూడు లక్షల నష్టం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కోదండరాంపురంలో సురేష్‌కు చెందిన ఫ్యాన్సీ దుకాణం మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. దుకాణం మూసి ఇంటికి వెళ్లిన అనంతరం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో యజమాని అక్కడికి చేరుకుని వారి సహాయంతో మంటలను అదుపు చేశారు. గూడూరు ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పింది. సుమారు మూడు లక్షల నష్టం జరిగినట్లు తెలిపారు.

ఖమ్మం

మధిర లో ఓటు హక్కు వినియోగించు కున్న భట్టి

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ సందర్భంగా ఆయన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

విశాఖపట్నం

రంజాన్

*🌙రంజాన్ నెల సందర్భంగా ఈనెల 18వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఉపవాసాల సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు (ఉపాధ్యాయులతో సహా) తమ డ్యూటీ నుంచి ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.