Sunday, 8 March 2026

Blog

తిరుపతి

అఖండకు శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల ఆహ్వానం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాజకీయ, సినీ ప్రముఖుల సందడి నెలకొననుంది. ఇందులో భాగంగా గురువారం నాడు అమరావతిలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, హిందూపురం శాసనసభ్యులు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలుసుకుని బాలకృష్ణకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, స్వామివారి వేడుకలకు విచ్చేయాలని సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రాశస్త్యాన్ని, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సుధీర్ రెడ్డి బాలయ్యకు వివరించారు. తన అభిమాన నాయకుడిని కలవడం సంతోషంగా ఉందని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం భక్తులకు మరింత ఉత్సాహాన్నిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తిరుపతి

ఉప ముఖ్యమంత్రిని బ్రహ్మోత్సవాల ఆహ్వానించిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 12: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ అమరావతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నియోజకవర్గ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా ఎమ్మెల్యే వారితో చర్చించడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలం బైరవరం గ్రామo లో బ్యార్ని లో చెలరేగిన మంటలు

దుత్తలూరు మండలం బైరవరం గ్రామo లో బ్యార్ని లో చెలరేగిన మంటలు వివరాలు మేరకు లెక్కల రాంమోహన్ రెడ్డి గురువారం సాయంత్రం 8:30 సమయంలో బైరవరం గ్రామo బ్యార్ని లో ఆకూ రాలి పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయ్ బ్యార్ని లో ఉన్న ఆకూ మొత్తం కాలి బూడిదయంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం తెలియజేయాగ, వారు మంటలు అదుపు చేశారు సుమారు ఆస్తి నష్టం 2.లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో ఉపాధి హామీ యాత్రకు షర్మిల ఊపిరి – హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి ( పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నిర్వహించిన ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రలో ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చి పేదవాడికి పని గ్యారంటీ కల్పించిందని ఆమె గుర్తు చేశారు. రాజన్న పాలనలో పనివద్ద టెంట్లు, మంచినీళ్లు, మజ్జిగ వంటి సౌకర్యాలు ఉండేవని, మహిళలకు పురుషులతో సమాన వేతనం అందించి ఆదుకున్నారని కొనియాడారు. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని, పేరు మార్చి కొత్త చట్టం తెచ్చి కూలీలను కాంట్రాక్టర్ల ఆధీనంలోకి నెట్టాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు. పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని షర్మిల స్పష్టం చేశారు. ఈ సభను ఉద్దేశించి డిసిసి అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

E-పేపర్

కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి . *పోరాడి సాధించుకున్న* *కార్మిక చట్టాలను* *కాపాడుకుందాం* పున్నమి న్యూస్ ప్రతినిధి 12 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ డివిజన్ ఈరోజు సాగర్ రింగ్ రోడ్ చౌరస్తాలో కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చంద్రమోహన్ హాజరై మాట్లాడుతూ ఈరోజు కార్మికులందరూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా కార్మికులందరూ పెద్ద సంఖ్యలో కదలడం చాలా సంతోషంగా ఉందని ఉన్నారు, కేంద్ర బిజెపి ప్రభుత్వం, విద్యుత్ సవరణ చట్టం 2025.విబి జీ – రామ్ చట్టం, విత్తన సవరణ బిల్లు. ఎల్ఐసి లో 100% విదేశీ పెట్టుబడుదారులను అనుమతించడం. ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలను ఉపసమరించుకోవాలని, కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు అన్ని కార్మిక సంఘాలు, సమ్మెలో ఉన్నారు, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం. కార్మికుల శ్రమను దోచుకోవడం కోసం, కేంద్ర బిజెపి ప్రభుత్వం దుర్మార్గమైన చట్టాలను తీసుకొస్తుందని, ఆవేదన వ్యక్తం చేశారు, భవన నిర్మాణ కార్మికులకు, రావలసిన ఇన్సూరెన్స్, అన్ని కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు, అప్పజెప్పడం, కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని అన్నారు, జిహెచ్ఎంసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన దుర్మార్గమైన చట్టాలను అమలు చేయమని, నిర్మాణం చేసి ప్రభుత్వానికి పంపాలని, అన్నారు, కార్మికులందరూ సాగర్ రింగ్ రోడ్ హస్తినాపురం చౌరస్తా వరకు ర్యాలీ, నిర్వహించారు, ఈ కార్యక్రమంలో *సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ ** *ఆలేటి ఎల్లయ్య హాజరై** *మాట్లాడుతూ* కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రద్దు చేయాలని. ఎనిమిది గంటల పని అమలు చేయాలని. 12 గంటల విధానాన్ని రద్దు చేయాలని. కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఆటో కార్మికులు జిహెచ్ఎంసి కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు, హమాలి కార్మికులు. చిల్లర వ్యాపారస్తులు, హెచ్ఎండిఏ పార్కు సిఐటియు ప్రజా సంఘాల నాయకులు. పి రామస్వామి. కమర్, ఎం యాదయ్య.పురుషోత్తం చారి, ఎన్ లక్ష్మణ్. రాధమ్మ. కాశయ్య గంగమ్మ. కే రాములు. ఎల్లమ్మ. లక్ష్మణ్ నాయక్. అంజి నాయక్. యాదమ్మ. అలివేలు. జంగయ్య. గోపి. కృష్ణమూర్తి.లలిత పద్మ. జిహెచ్ఎంసి రంగారెడ్డి జిల్లా యూనియన్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పత్రిక మిత్రులకు అన్నలకు అందరికీ పేరుపేరునా నమస్కారం మీ సీఐటీయూ ఆలేటి ఎల్లయ్య రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి

పల్నాడు

భర్త అత్త కోడలు పై ఒత్తిడి

*అందంగా ఉన్నావ్,వ్యభిచారం చేయాలని కట్టుకున్న భర్త అత్త కోడలు పై ఒత్తిడి,డబ్బులు బాగా వస్తాయి అని వేధింపులు* టార్చర్ ,భరించలేక వివాహిత అంజనా భాయ్ ఆత్మహత్య.కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ పట్టణంలో ఘటన చోటుచేసుకుంది… Bangalore Karnataka: అత్తగారింట్లో నరకం అనుభవించలేక ఈ విషయాలను బయట ఎవరికీ చెప్పుకోలేక, అత్తగారింట్లో నరకం అనుభవించలేక అంజనాబాయి ఫిబ్రవరి 6 వ తేదీన తన భర్త ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు వదిలింది. తన కూతురిని ఈ ముగ్గురే వేధించి చంపేశారని తండ్రి విజయ్ కుమార్ బసవకల్యాణ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యతగా చూసుకోవాల్సిన భర్తే కాల యముడుగా మారి, అన్నీ అవ్వాల్సిన అత్తమామలే వ్యభి చార కూపంలోకి నెట్టితే ఆ ఇల్లాలు తన గొడును ఎవరితో చెప్పుకుంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే కర్ణాటకలోని బీదర్ జిల్లాలో బసవకళ్యాణ్ పట్టంలో చోటుచేసుకుంది. అంజనాబాయ్ అనే మహిళకు ఇదే నగరానికి చెందిన శేఖర్ పాటిల్ అనే వ్యక్తితో ఏడాది క్రితం వివాహం జరిగింది. ఈ జంటకు 11 నెలల పాపజన్మించింది. కొన్నిరోజుల అనంతరం ఆమెను భర్త, అత్తమామలు వ్యభిచారం చేయాలని మానసికంగా భాధపెట్టారు. వాళ్లు చెప్పినట్లు నడుచుకోకుంటే పలు విధాలుగా వేధించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బా ధితురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బీదర్ జిల్లాలోని బసవకల్యాణ్ శేఖర్ పాటిల్ను అంజనా బాయి 2022లో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లు అంతా సవ్యంగానే ఉంది. శేఖర్ పానీ పూరీ వ్యాపారం చేస్తుండేవాడు. రోజూ ఇంటికొచ్చేసరికి రాత్రి 11 నుంచి 12 దాటేది. ఈ విషయంలో భార్యాభర్త మధ్య గొడవలు జరిగాయి.సాయంత్రం త్వరగా వెళ్లేసి రాత్రి 10 గంటల లోపు ఇంటికి రావాలని భర్తను అంజనా బాయి అడిగింది. అందుకు కుదరదని భర్త తెగేసి చెప్పాడు. శేఖర్ అత్త కూడా కోడలిపై ఇదే విషయంలో కస్సుబుస్సులాడింది. భర్త, అత్త కలిసి అప్పటి నుంచి అంజనాను వేధించడం మొదలుపెట్టారు.వ్యభిచారం చేయాలని భర్త, అత్త ఆమెపై తీవ్ర ఒత్తిడి చేశారు. అందంగా ఉన్నావని.. వ్యభిచారం చేసి బాగా సంపాదించొచ్చని అంజనాను భర్త, అత్త కలిసి వేధించారు. 11 నెలల పాప ఉన్న తల్లిని ఇలా సూటిపోటి మాటలతో వేధించి వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం చేయడంతో అంజనా బాయి మానసిక వేదనను తట్టుకోలేక పోయింది.క్షణికావేశంలో చావే శరణ్యమని భావించి ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకుంది.

అనకాపల్లి

ఏటికొప్పాకలో సేవా దీప్తి – ఉచిత కళ్లద్దాలతో ప్రజలకు ఆనందం..!

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 12, పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్: ఏటికొప్పాక గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన దాదాపు 70 మంది లబ్ధిదారులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. సర్పంచ్ భజంత్రీల లక్ష్మీ గారి చేతుల మీదుగా కళ్లద్దాలు అందజేయడం విశేషంగా నిలిచింది. గ్రామ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్రి సింహాచలం, వార్డ్ మెంబర్స్ నాయుడు మాస్టర్, ఇసరపు శ్రీను, ఎర్రంచెట్టి శ్రీను, సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను, గ్రామ పెద్దలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన దృష్టి, ఆరోగ్య అవగాహన కలిగించడమే లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఖమ్మం

ఉచిత కంటి వైధ్య శిబిరం ని జయ ప్రదం చేయండి:

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని వి.యం. బంజర్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ రాజా సాయి మందిరం మరియు ఖమ్మం మమత జనరల్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో, శ్రీమతి జెన్నారెడ్డి విజయ రెడ్డి జ్ఞాపకార్థం ఈ శిబిరాన్ని ఈ నెల 14వ తేదీ (శనివారం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త, విశ్రాంత సర్కిల్ ఇన్స్పెక్టర్ జెన్నారెడ్డి నర్సింహా రెడ్డి మరియు శ్రీ రాజా సాయి మందిరం చైర్మన్ శ్రీమతి నీలపు ఉమా సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ శిబిరాన్ని వినియోగించుకుని ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

భక్తి

ధన శివలింగాన్ని తయారుచేసిన భక్తుడు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలొ చిలక సాయి తేజ అనె భక్తునికి కలలో వచ్చిన సంగీతాలు ఆధారంగా ఒక రూపాయి రెండు రూపాయలు బిళ్ళలతో లక్షా పొతిక వేలు రూపాయలతొ శివలింగాన్ని బంధువులు మిత్రులు గ్రామ ప్రజల సహకారంతో నేను లింగొన్ని తయారుచేశాడు. శబరిమలై దాన్ని పట్టిసీమలో 14వ తారీకు బహుకరించడం మరియు రోజు అభిషేకాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఇంకా పదివేల రూపాయలు పని జరుగుతోందని పరమశివ భక్తుడు చిలక సాయి తేజ తెలియ పరిచారు. END

ఖమ్మం

ప్రభుత్వ ఉద్యోగుల రాజకీయ పాత్రపై జిల్లా కలెక్టర్ కి బీజేపీ నేతలు పిర్యాదు:

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులకు కార్యకర్తలుగా మారి ఎన్నికల్లో పనిచేస్తామని హామీలు ఇవ్వడం తీవ్ర ఆందోళనకరమని ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ అంశంపై సంబంధిత అధికారులపై వెంటనే సస్పెన్షన్‌తో సహా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి పి. శ్రీజను కలిసి బీజేపీ బృందం వినతి పత్రం అందజేసింది. జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, శ్రీమతి దొడ్డ అరుణ, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, పాలేరు శాసన సభ బీజేపీ అభ్యర్థి నున్న రవికుమార్, బీజేపీ ఏద్యుకేషన్ సెల్ జిల్లా కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు, వి. రామకృష్ణ, పి. జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.