Sunday, 8 March 2026

Blog

తెలంగాణ

తెలంగాణ మున్సిపల్ ఫలితాలు: గడ్డపోతారం బీజేపీ ఖాతాలో

తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుండగా, బీజేపీ మరియు బీఆర్ఎస్ కూడా అనేక వార్డులు, డివిజన్లలో గట్టి పోటీ ఇస్తున్నాయి. గడ్డపోతారం మున్సిపాలిటీని బీజేపీ తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం 14 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా, 3 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయాన్ని నమోదు చేసుకున్నారు.

Featured

ధనుష్‌తో పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ ఠాకూర్

నటుడు ధనుష్‌తో ఫిబ్రవరి 14న వివాహం జరుగుతుందనే ప్రచారాన్ని నటి మృణాల్ ఠాకూర్ ఖండించారు. ఈ వార్తలపై స్పందించిన ఆమె, ప్రస్తుతం తాను పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14ను ఎవరో సరదాగా “స్పెషల్ ఫూల్స్ డే”గా మార్చారని చమత్కరించారు. ఆధారంలేని పుకార్లు అనవసర గందరగోళానికి దారితీస్తాయని పేర్కొంటూ, ఇలాంటి వార్తలను నమ్మవద్దని అభిమానులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్

రూ.20వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

కొద్ది రోజులుగా మార్పులేకుండా కొనసాగిన వెండి ధరలు ఇవాళ ఒక్కసారిగా క్షీణించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.20 వేల మేర పడిపోయింది. దీంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ.2,80,000 వద్ద ట్రేడ్ అవుతోంది. శుభకార్యాల సీజన్ ముందు బంగారం, వెండి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరటగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతానుసారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.

తూర్పు గోదావరి

మహా శివరాత్రి సందర్భంగా తాళ్లపూడిలో ఘన ఏర్పాట్లు భక్తుల భద్రతే ప్రాధాన్యం: అధికారులు

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి ఫిబ్రవరి 13 : ఈ నెల 15వ తేదీన జరగనున్న మహా శివరాత్రి సందర్భంగా గోదావరి స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని మండల తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు. యువ ప్రెస్ టీం సభ్యులతో మాట్లాడిన వారు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమ్మార్వో కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో వీరన్న, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు పాల్గొన్నారు. తాళ్లపూడి మండల పరిధిలోని ప్రతి రేవులో పోలీసు మరియు రెవెన్యూ శాఖ సిబ్బందికి షిఫ్ట్ డ్యూటీలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. Kovvur రూరల్ సీఐ విజయబాబు ఆధ్వర్యంలో ప్రతి స్నాన ఘాట్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం చోటుచేసుకున్న ప్రమాదం పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఎస్సై టి. రామకృష్ణ స్పష్టం చేశారు. వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణించవద్దని, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గట్టు ప్రాంతాల్లో, ఆలయాల సమీపంలో ప్రసాదాలు స్వీకరించే భక్తులు వాహనాలను రహదారి పక్కన అడ్డంగా పార్క్ చేయకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు కూడా భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తి, శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో భక్తులు ఆనందంగా జరుపుకోవాలని అధికారులు ఆకాంక్షించారు.

తిరుపతి

మూడో రోజు రాత్రి భూత, శుక వాహనా లను అధిరోహించిన గౌరీ శంకరులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 12: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా మూడవ రోజు వాహన సేవలో భాగంగా గురువారం నాడు ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వగా, రాత్రి వేళ విశేషమైన భూత వాహనంపై త్రినేత్రుడు.. చిలుక వాహనంపై జ్ఞానప్రసూనాంబ అమ్మవారు అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల హర హర మహాదేవ ఓం నమః శివాయ నామస్మరణతో శ్రీకాళహస్తి వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వాహన సేవలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పాలక మండలి సబ్యులు, ఆలయాధికారులు, స్థానిక నాయకులు, వేద పండితులు, భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుపతి

నేడు గిరిప్రదక్షిణ మార్గన్ని వర్చువల్ గా ప్రారంభించనున్న డెప్యూటీ సి. యం.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని రాష్ట్ర అభివృద్ధి, ధర్మ పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర అభివృద్ధిలో భాగంగా నిర్మించిన అనుబంధ గిరిప్రదక్షిణ మార్గమును నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని గిరి ప్రదక్షిణ రోడ్డును వర్చువల్ విధానం (Virtual Opening) ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు, తెలుగుదేశం, బిజెపి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూటమి నాయకులు పిలుపునిచ్చారు.

తిరుపతి

బాల్య వివాహాలు అమూల్యమైన బాల్యాన్ని బలిగొంటాయి-ప్రగతి సంస్థ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తి పట్టణంలో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రగతి సంస్థ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ….మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో దేవుడి పెళ్లి రోజున ప్రతి యేటా సామూహిక వివాహాలు నిర్వహించడం ఆనవాయితీ. ఆది దంపతులకు పెళ్లి జరిపే రోజు వివాహాలు జరిగితే ఆ జంటలు కలకాలం ఆనందంగా, అన్యోన్యంగా ఉంటాయని ప్రజల విశ్వాసం. కానీ ఈ పర్వదినాన బాల్య వివాహాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. మన నమ్మకాలకు, విశ్వాసాలకు అమూల్యమైన బాల్యాన్ని బలి ఇవ్వడం (బాల్య వివాహాలు చేయడం) చట్ట రీత్యా నేరం. బాల్య వివాహలకు పాల్పడితే కుటుంబ సభ్యులు, బంధువులు, పూజారి మొదలు క్యాటరింగ్ చేసిన వారి వరకు ప్రతి ఒక్కరూ శిక్షార్హులే. 2009 నుంచి మాస్ మ్యారేజెస్ సందర్భంగా బాల్య వివాహల నిర్మూలన కొరకు ప్రగతి సంస్థ చేస్తున్న కృషి గురించి ఈ సందర్బంగా ఆయన వివరించారు. శివరాత్రి దేవుడి పెళ్లి, సామూహిక వివాహాల సమయంలో పట్టణం నలుమూలలా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి గవర్నమెంట్ డిపార్టుమెంటులతో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం సిడిపివో శాంతి దుర్గ మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేసుకుంటే కలిగే అనర్ధాల గురించి, అంగన్వాడి సేవలు గురించి వివరించారు. మెడికల్ ఆఫీసర్ శివకుమార్ మాట్లాడుతూ బాల్య వివాహల వల్ల కలిగే ఆరోగ్య పరమైన, మానసిక సమస్యల గురించి, టీనేజి ప్రెగ్నెన్సీ గురించి, మాతా శిశు మరణాలు గురించి వివరించారు. ప్రిన్సిపాల్ మాధవి లత మాట్లాడుతూ చిన్న వయసులో ఆకర్షణలకు లోనై బాల్య వివాహాల బారిన పడకుండా పిల్లందరూ చక్కగా చదువుకుని పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. సీఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ..బాల్య వివాహాలపై వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, బాల్య వివాహాలపై ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ప్రగతి సంస్థ సిబ్బంది లక్ష్మి నారాయణ, చంద్ర శేఖర్, జయలక్ష్మి, బోస్, ప్రభాకర్ రాజేశ్వరమ్మ, సుమలత, కోటయ్య, లత, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శివరాత్రి బ్రహ్మోత్సావాలకు పటిష్టమైన బందోబస్తు….. డివైయస్పి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా శ్రీ కాళహస్తి డివైయస్పి అధ్వర్యంలో పోలిసు శాఖ వారు ఆలయంలోని బ్రహ్మగుడి ఆవరణలో పాత్రికేయుల సమావేశాన్ని నిరావహించారు. ఈ సమావేశంలో డివైయస్పి నరసింహ మూర్తి మాట్లాడుతూ.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేడుకలను శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా నిర్వహణ కార్యక్రమాలను ప్రతియేట శ్రీకాళహస్తీశ్వరాస్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తారన్నారు. ఈ బ్రహ్మోత్సవాల వేడుకలను వీక్షిచేందుకు వివిధ ప్రదేశాలనుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేందు ఎంతో ఆశగా వస్తుంటారని ఉత్సావాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి అభద్రత కలగకుండా కార్యమాలను నిర్వహించాలని శ్రీకాళహస్తిపట్టణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు పటిష్టమైన భద్రత కల్పించి వారు ఎటువంటి అసహన వానికి గురికాకుడదని, శివరాత్రికి భక్తులు నిర్భయంగా శ్రీస్వామి, అమ్మవార్లలను కనులార దర్శించుకోవాలని అందుకు సంబందిచిన చర్యలు ఎలా చేపట్టాలన్నా పలువిషయాలపై ఆయన సిబ్బందికి సూనలిస్తూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సబందిచిన అన్ని శాఖల అ ధికారులు, సిబ్బంది శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేవిధంగా కృషిచేసి తమకు సహకరించాలని తెలిపారు. భక్తుల భద్రతకోసం తమ విజన్ నుండే కాకుండా బయటనుండి డి.ఎస్పీలు, సి.ఐ.లు, ఎస్సైలు, పి.సీ.లు, మహిళ పోలీసులు, హెూంగార్డులతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయంలోపల బయట పటిష్టమైన బం దోబస్తు నిర్వహిస్తామని ఎవ్వరైన భక్తులను ఇబ్బంది పెడితే ఎంతటివారినైన ఉపేక్షింబోమని కఠిన చర్యలు తీసుకుంటామని ఇటివలే లాడ్జి, హెూటల్ యాజమాన్యులను పిలిపించి మాట్లాడామని వారుకూడా భక్తుల నుండి అధిక రుసుములు వసువులు చేయకూడదని అలా చేసిన వారిపైతగిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించామన్నారు. తిరుపతి నుండి వచ్చే వాహనాలకు మార్కెట్ కమిటి సముదాయంలో వాహనాలను నిలుపుకునే సిధంగా ఏర్పాట్లు చేశామని, నెల్లూరు నాయుడు పేట నుండి వచ్చే భక్తులకు నంది సర్కిల్ వద్ద రావాన సదుపాయాలు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులలో దర్శనార్థం విచ్చేసే భక్తులు సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన స్లాట్ల ప్రకారం దర్సనం చేసుకోవాలన్నారు. గిరిప్రదక్షణం రోజున భక్తులు కాలి నడక ద్వారానే కార్యక్రమంలో పాల్గొనేల తప్ప భారి, ద్విచక్ర వాహనాలు, స్కూటర్, ఆటోలకు, ట్రాక్టర్ వంటి వాహనాలకు అనుమతి ఉండదని ఎవరైనా నియలను ఉల్లంగిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డివైయస్పి పేర్కొన్నారు. ఈ కర్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజిక వర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ ముఖ్య అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో సూర్యప్రభ, చంద్రప్రభ వాహనలపై విహరించిన శివ పార్వతులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన గురువారం నాడు శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబిక అమ్మవార్లు అత్యంత వైభవంగా భక్తులకు దర్శనమిచ్చారు. కన్నులపండువగావాహనసేవలు: బ్రహ్మోత్సవాల మూడవ రోజు ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై, అమ్మవారు చప్పరంపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగారు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే సూర్య భగవానుడి వాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, కోలాటాలు, కళాకారుల విన్యాసాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులకోలాహలం: ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఆలయ అధికారులు, పాలక మండల సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలు ఓం నమః శివాయ అనే శివనామ స్మరణతో మారుమోగిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సమాచారం విస్తరిస్తూ మంచి హెడ్డింగ్ తో వార్తను రూపొందించి ఇవ్వండి జెమిని ai గారు శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం నాడు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారు మూడవ రోజు శ్రీ స్వామి అమ్మవార్ల సూర్య ప్రభ, చంద్ర ప్రబ వాహన సేవలు మేళతాళాలు కోలాటాలు కళాకారుల విన్యాసాల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాలక మండల సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

అసెంబ్లీలో శ్రీకాళహస్తి సమస్యలపై గళంవిప్పిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించిన కీలక సమస్యలపై బలంగా గళం విప్పారు. ముఖ్యంగా మూడు అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. మొదటది శ్రీకాళహస్తిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతిరోజూ తిరుమలకి విచ్చేసే భక్తుల్లో సగం మంది శ్రీకాళహస్తి దర్శనార్థం వస్తున్నారని పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, దీనికి శాశ్వత పరిష్కారంగా ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు. రెండవ అంశం శ్రీకాళహస్తి ఆలయంలో సుమారు 1100 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని వారికి ఉద్యోగ భద్రత కల్పించి, న్యాయం చేయాలని కోరారు. తిరుమల, శ్రీశైలం వంటి దేవాలయాలు ఆసుపత్రులను నిర్వహిస్తున్న విధానాన్ని ఉదాహరణగా చూపుతూ, శ్రీకాళహస్తిలో ఉన్న ఏడు ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆలయంతో అనుసంధానం చేసి అభివృద్ధి చేయాలని ఆలయ ఆదాయంతో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అభిప్రాయపడ్డారు. మూడవ అంశంగా, 22A చట్టం కారణంగా పేదలు, రైతులు, పట్టాదారులు తమ సొంత భూములపై హక్కులు వినియోగించుకోలేకపోతున్నారని గత పాలనలో తీసుకున్న నిర్ణయాల వల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందని 22A చట్టాన్ని సవరించి, అర్హులైన వారికి ఇంటి స్థలాలు, పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రిని కోరారు. శ్రీకాళహస్తి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న దృఢ సంకల్పంతో అసెంబ్లీలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గట్టిగా గళం విప్పడం గమనార్హం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.