Sunday, 8 March 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తి స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గమును దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి తో కలిసి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్*

పున్నమి ప్రతినిధి , శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ ను ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాo : గౌ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి* సుమారుగా 22 కిలోమీటర్లు కలిగిన ఈ గిరిప్రదక్షిణ మార్గం రోడ్డు పనులను పూర్తి చేసి భక్తులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్* ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ మార్గమును ప్రజలకు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తెచ్చాం : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి* గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని పూర్తి చేయడం సంతోషం : చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్* శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 13 : దేవాలయాలే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, గిరి ప్రదక్షణ చేసిన ప్రతి భక్తునికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలని గౌ.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం శ్రీకాళహస్తి స్వామి దేవస్థానంలో ఆలయ ఆవరణoలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్లాల్, శ్రీకాళహస్తి, తిరుపతి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరని శ్రీనివాసులు, గిరి ప్రదక్షణ మార్గం శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం వర్చువల్ గా ప్రారంభించగా.. తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తి ఆలయం ప్రాంగణం నుంచి ఆలయం ఈ వో బాపిరెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, హ్యాండ్ క్రాఫ్ట్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ నాయకులు కోలా ఆనంద్, జిల్లా అటవీ శాఖ అధికారి సాయి ప్రసాద్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం, అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ చెంచు నాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యుల తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అని తెలిపారు. 42 ఆలయాలను గుర్తించి మహా శివరాత్రి పర్వదినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాం అని తెలిపారు. మహా శివరాత్రి హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకు అనుగుణంగా జరుపుకుంటున్నాం అని ఈ సందర్భంగా శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభించడం ఆనందం కలిగించిందన్నారు. హిందూ ధార్మిక సంస్థలు, సనాతన ధర్మ పరిరక్షణలో అందరికంటే ఒక అడుగు ముందుండే వ్యక్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభసూచకమని తెలిపారు. కైలాసగిరి ప్రదక్షణ చేసే భక్తుల కోసం మార్గాన్ని ఏర్పాటు చేసి రెండు విభాగాలుగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కూటమి ప్రభుత్వంలో దూప దీప నైవేధ్యం స్కీం కింద 5,821 ఆలయాలకు నెలకి రూ. 10 వేల చొప్పున పంపుతున్నామనాన్మని 2027 పుష్కరాల సందర్భంగా పురాతన ఆలయాల పరిరక్షణకు చర్యలు 495 ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమానికి రూ. 608 కోట్లు వెచ్చించి పనులు చేపట్టామని ఏజెన్సీ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవాణి ఆలయాల పేరిట టీటీడీ ఆర్ధిక సహకారంతో 5 వేల ఆలయాలకి రూ. 750 కోట్లు కేటాయించి చిన్న చిన్న ఆలయాలు నిర్మిస్తున్నాం అని తెలిపారు. ఇప్పటికి 697 ఆలయాలకు, 113.25 కోట్ల నిధులు మంజూరు చేస్తూ అనుమతులు ఇచ్చాం అని 1516 ఆలయాలకు పాలకవర్గాలు నియమించాల్సి ఉంటే 1,002 నియమించామని, మిగిలినవి కూడా నియామకాలు త్వరలో చేపడతామాని గోదావరి పుష్కరాల పేరిట 31 ప్రధాన ఆలయాలను రూ. 37 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ను ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధి, గిరి ప్రదక్షణ మార్గం నిర్మాణం మరియు ఆలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గిరి ప్రదక్షణ మార్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షణ మార్గ అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు అన్నారు. గిరి మార్గం రెండు వైపులా స్వచ్ఛత, హరితీకరణ కార్యక్రమాలు చేపట్టి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించనున్నట్లు తెలిపారు. గిరి ప్రదక్షణ చేసిన ప్రతి భక్తుడికి కైలాసగిరి పుణ్యఫలం దక్కాలని ఆకాంక్షించారు. దేవాలయాలే మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొంటూ, గతంలో జరిగిన నిర్లక్ష్యాలను పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాలక మండలి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆలయ ఆస్తులు, నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆలయంలో ధర్మ పరిరక్షణకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అని తెలిపారు. దేవదాయశాఖ మంత్రి అనంత రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయ్యప్ప దేవాలయం, లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణం (రూ.3.70 కోట్లు), కోటకుండ–కొత్తపాలెం రోడ్డు (రూ.4 కోట్లు), వాడపల్లి, ఏడు వాగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి గోదావరి కరకట్ట రోడ్డు (రూ.4 కోట్లు) వంటి పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ నిధులతో సుమారు 22 ప్రధాన దేవాలయాలకు రోడ్లు, వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చిన్న ఆలయాలకు కూడా రవాణా సౌకర్యాల అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ట్రస్ట్ బోర్డు సభ్యులైన 17 మందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఆలయ అభివృద్ధి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సుమారుగా 22 కిలోమీటర్లు కలిగిన ఈ గిరిప్రదక్షిణ మార్గం భక్తులందరికీ ఎంతో అనుకూలంగా రోడ్డు పనులను పూర్తి చేసి భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. స్వామి అమ్మవార్లు ప్రతి కనుమ పండుగ, శివరాత్రి నాడు గిరిప్రదక్షిణ మార్గాన తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా ప్రతి నెల పౌర్ణమి రోజు భక్తుల ఎక్కువ మంది ఈ రోడ్డు మార్గాన్ని ఉపయోగించుంటారు అని అన్నారు. గత శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆ ఒక్క రోజునే సుమారు 35 వేల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేశారన్నారు. అదే విధంగా 22 కిలోమీటర్ల మొత్తానికి భక్తుల సౌకర్యార్థం రాత్రి సమయంలో ఇబ్బందులు కలగకుండా బోర్డు ద్వారా రోడ్డు మార్గానికి స్ట్రీట్ లైట్స్ , మరుగు దొడ్లు, త్రాగు నీటి సదుపాయం, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2018 సంవత్సరంలో మా నాన్నగారు గిరి ప్రదక్షిణ మార్గమును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఈ పనులను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ మార్గమును ప్రజలకు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం సాకారం అయినందుకు డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రివర్యులు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ… గతంలో గిరిప్రదక్షిణ మార్గాన్ని తిరగాలంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడే వారిని, ఆ కొండ చుట్టు ఈ రోడ్డు మార్గాన్ని వేయడం వలన పెద్ద లక్షల మంది ప్రజలు మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారని ఈ మార్గాన్ని ఆ శివుని ఆశీస్సులతో మీ చేతుల మీద ప్రారంభించడం భక్తులు బోర్డు మెంబర్లు చాలా సంతోశిస్తున్నామన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గిరి ప్రదక్షిణ మార్గమును భక్తులు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళని అలాంటి పరిస్థితిలో గిరి ప్రదక్షణ రోడ్డు మార్గమును భక్తులకు సౌకర్యార్థం అన్ని సౌకర్యాలను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని చాలా సంతోషంగా ఉందని భక్తులు తమ మనోభావాలు తెలియజేశారు… ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. _________________________ జిల్లా సమాచార శాఖ తిరుపతి

ఆంధ్రప్రదేశ్

నెల్లూరు రూరల్ నియోజకవర్గo సౌత్ మోపూరు గ్రామం లో,,, చలో మంగళగిరి,, చేనేత గర్జన విస్తృత ప్రచారం

జై చేనేత,,,,,,,,,,,,,, జై జై చేనేత “చలో మంగళగిరి”,,, “చేనేత గర్జన” విజయవంతం చేయుట కొరకు నెల్లూరు జిల్లా సీనియర్ కమ్యూనిస్టు నాయకులు శ్రీ పముజుల దశరథ రామయ్య గారి ఆధ్వర్యంలో,,, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల కార్యాచరణ కమిటీ సభ్యులు శ్రీ కటికాల వెంకటేశ్వర్లు, పముజుల హరి గార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూర్ గ్రామం మరియు, బీసీ కాలనీలలో,, విస్తృతంగా ప్రచారం చేశారు పార్టీలకతీతంగా చేయబోయే “చేనేత గర్జన” కార్యక్రమం కొరకు,,, మన చేనేత కుటుంబాలకు కాసింత మేలు చేయాలనే,ఆలోచనతో,అభిమానం తో ప్రతి ఒక్కరు ఎవరికివారుగా ఫిబ్రవరి 22 వ తేదీ మంగళగిరి కి రావలసిందిగా కోరారు

తిరుపతి

నడవలూరు పాఠశాలలో “బాల్య వివాహ ముక్త భారత్” కార్యక్రమం

పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం రామచంద్రాపురం మండలం నడవలూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, ఆర్సిపురం సెక్టార్, చంద్రగిరి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీమతి కే. మనీల అధ్యక్షతన “బాల్య వివాహ్ ముక్త భారత్” కార్యక్రమంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె పలు అంశాలపై మాట్లాడుతూ ముఖ్యంగాబాల్య వివాహాలు నివారించడం,పిల్లల అక్రమ రవాణా నిరోధం,పిల్లలపై లైంగిక వేధింపుల నివారణ మరియువ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి క్షుణ్ణంగా తెలియపరిచారు.అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో- బేటీ పడావో” పథకం వివరాలు వివరించారు. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు పోక్సో చట్టం గురించి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సామాజిక బాధ్యతలపై ప్రతి ఒక్కరు అపరముత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే .దుర్వాసులు , ఉపాధ్యాయులు, జగన్నాథం వాసుదేవ రెడ్డి, విశాలాక్షి , కవిత ,మిడ్ డే మీల్ హెల్పర్ వరలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు బి .అనూష కే హారిక ,పాఠశాల బాలబాలికలు పాల్గొన్నారు.

సాహితీ

*శ్రోత హృదయ రాణి – ఆకాశవాణి* – డాక్టర్ బద్రి పీర్ కుమార్

1946 ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో స్థాపించబదిండి. సమాచార వ్యాప్తిలో రేడియో ప్రాముఖ్యతను గుర్తించడానికి మరియు ప్రసారకర్తల మధ్య అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి యునెస్కో (UNESCO) ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011లో ప్రకటించగా, 2012లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అప్పటినుండి మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటున్నాము. విపత్తుల సమయంలో అత్యవసర సమాచారాన్ని అందించడంలోనూ, మారుమూల ప్రాంతాలకు వార్తలను చేరవేయడంలోనూ రేడియో కీలక పాత్ర వహిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ఖర్చుతో కూడిందే కాకుండా అత్యధిక మందిని చేరుకోగల మాధ్యమంగ చెప్పవచ్చు. భారత్‌లో ఆకాశవాణి 98 శాతం జనాభాకు చేరువలో ఉండి, సమాచార విప్లవంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి మోదీ నిర్వహించే “మన్‌ కీ బాత్‌” కార్యక్రమం ద్వారా రేడియో మాధ్యమానికి కొత్త జవజీవాలు అందుతున్నాయని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ‘శ్రోత హృదయ రాణి ఆకాశవాణి’ కవిత పాఠకుల కోసం బాలమిత్ర కథల నుండి ప్రపంచ చరిత్ర దాక గ్రామీణం నుండి పట్టణం దాక వ్యవసాయం నుండి అంతర్జాతీయం దాక సాంప్రదాయం నుండి ఆధునికీయం దాక వార్తా విశేషాలను అందించే సామాజిక వారధి మానసోల్లాస ప్రజాజీవన శ్రవణసన్నిధి సమాజాన్ని చైతన్య పరచే ఆకాశనిధి పాటైనా కథైనా వార్తయినా జనరంజక పెన్నిధి. మన ఇంటి మీడియాగ యోగ్యమైన రేడియోగ రైతు రాగాల రసమయిగ శ్రోత హృదయ రాణిగ కాలక్షేప కళారూపిణిగ ప్రతి ఇంటికి చేరే మధురిమల వాణిగ ప్రకటనల సారధిగ గుర్తింపు వాహినిగ వాతావరణ సూచనల సాంకేతిక నేస్తంగ వాక్చాతుర్య కళాకారుల కమనీయ ఆశ్రయం శ్రోత హృదయ సామ్రాజ్య చైతన్య నిలయం. బహు భాషల వర్షించు వినోదజలం వెదజల్లు హరివిల్లుల ఆనందగళం విజ్ఞానమందించు సుగుణాల ఫలం ఆ ఫలసారంలో ఆంద్రీయం భారతీయం ప్రపంచీయం అన్నింటిలో ప్రధాన ఆశయం జాతీయం భూగోళ గమన వేగం మానవాళి వికాసరాగం భావజాల సంయోగం తో భిన్నత్వంలో ఏకత్వ పరిమళ పరికరమే రేడియో.. ప్రపంచ సమాచార స్రవంతిలో ఆకాశవాణి శ్రోత హృదయ రాణి

సాహితీ

భారత చైతన్య రాగాల కోకిల* – డాక్టర్ బద్రి పీర్ కుమార్

నిశితమైన దేశభక్తి, అద్భుతమైన కవిత్వం కారణంగా భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన, ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి మరియు రాజకీయ నాయకురాలు, మహిళా సాధికారత, విద్య కోసం కృషి చేసిన స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్‌గా చరిత్ర సృష్టించిన భారత కోకిల స్వర్గీయ శ్రీమతి సరోజినీ నాయుడు జన్మదినాన్ని (13 ఫిబ్రవరి 1879) “జాతీయ మహిళా దినోత్సవం” గా జరుపుకుంటాము. ఈ సందర్భంగా పాఠకుల కోసం ఈ కవిత *శ్రీ* శ్రీమంతులైన గుణసంపన్నుల పుత్రికగ *మ* మనసు నిండా దేశభక్తి నింపుకుని *తి* తిలకం దిద్దబడి ఎదిగిన చైతన్యమాధురి *స* సంస్కృతి సంస్కార నీలాంబరి *రో* రోజు మారితే గీత మారదని *జి* జిజ్ఞాసతో సాహిత్యమే శ్వాసగా *నీ* నీతి న్యాయం భరతావని ఆశయం అని *నా* నా కన్నా దేశ సంక్షేమమే ముఖ్యమని *యు* యుక్తులన్నీ స్వదేశ పాలనకే అని *డు* ఆర్ డై అనే గాంధేయ మార్గ సన్నిహితురాలై *భా* భారతావని ముద్దుబిడ్డగ *ర* రసాత్మక కవిత్వ శౌర్యశిఖామణిగ *త* తగిన సామాజిక చైతన్య జ్యోతిగ *కో* కోరుకున్న సమ సమాజ నిర్మాణం కోసం *కి* కిలకిలరావాల జాతీయ భావాల భాష్యమై *ల* లయమై మహాత్మునికి ప్రియమై పిలువబడ్డ భారత కోకిల స్వర్గీయ శ్రీమతి సరోజినీ నాయుడు.

E-పేపర్

మా రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు తగిలి రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు తగిన మూల్యం చెల్లిస్తారు

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ : మా రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు తగిలి రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు తగిన మూల్యం చెల్లిస్తారు మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని 14వ వార్డు బ్యాలెట్ బాక్సులో, తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డికి లేఖ రాసిన రిటైర్డ్ ఉద్యోగి కేటీఆర్‌ను సీఎం కుర్చీ నీ అయ్య జాగీరా అంటున్నావు, మరి సీఎం కుర్చీ నీ జాగీరా, నీ మామ జాగీరా అని మేము అడుగుతున్నామంటూ లేఖ

E-పేపర్

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న బిఆర్ఎస్ పార్టీ

పున్నమి న్యూస్ ప్రతినిధి 13 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఇంచార్జ్ : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న బిఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు,విజేత పేర్లు కాంగ్రెస్ పార్టీ : 08 బిఆర్ఎస్ పార్టీ : 13 బీజేపీ పార్టీ : 02 స్వతంత్ర : 01 WARD NO: 1 విజేత ముత్యాల శ్యామల బీజేపీ 1. చింతం రాధమ్మ 285 ఓట్లు (కాంగ్రెస్) 2. తాళ్ళ చంద్రకళ 133 ఓట్లు (బిఆర్ఎస్) 3. ముత్యాల శ్యామల 302 ఓట్లు (బీజేపీ) 4. జమాల్పూర్ స్వాతి 17 ఓట్లు (స్వతంత్ర) 5. దేవరశెట్టి అండాలు 03 ఓట్లు (స్వతంత్ర) WARD NO: 2 విజేత భాను బాబు నీళ్ల కాంగ్రెస్ 1. యస్ డి ఇదాయత్ ఆలీ 373 ఓట్లు (బిఆర్ఎస్) 2. పుట్ట జగదీష్ 17 ఓట్లు (బీజేపీ) 3. భాను బాబు నీళ్ల 456 ఓట్లు (కాంగ్రెస్) 4. మహమ్మద్ ఆదమ్ అలి 0 ఓట్లు (స్వతంత్ర) WARD NO: 3 విజేత దాసరి మురళి కృష్ణ స్వతంత్ర 1. కందుల విజయ్ కుమార్ 09 ఓట్లు (బీజేపీ) 2. తాళ్ల వెంకటేష్ 134 ఓట్లు (బిఆర్ఎస్) 3. బర్తాకి జగన్నాదం 336 ఓట్లు (కాంగ్రెస్) 4. దాసరి మురళి కృష్ణ 422 ఓట్లు (స్వతంత్ర) WARD NO: 4 విజేత కొండ్రు ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ 1. కొండ్రు ప్రవీణ్ కుమార్ 392 ఓట్లు (బిఆర్ఎస్) 2. చెరుకూరి కరుణాకర్ 13 ఓట్లు (బీఎస్పీ) 3. నౌసు దాసు 24 ఓట్లు (బీజేపీ) 4. యాచారం శ్రీకాంత్ 379 ఓట్లు (కాంగ్రెస్) WARD NO: 5 విజేత జెర్కోని మమత రాజు బిఆర్ఎస్ 1. చెరుకూరి మనీష 19 ఓట్లు (బీజేపీ) 2. జెర్కోని మమత రాజు 406 ఓట్లు (బిఆర్ఎస్) 3. పెద్దగారి మణి కీర్తి 350 ఓట్లు (కాంగ్రెస్) WARD NO: 6 విజేత మెహమ్మద్ అమీనా భేగం కాంగ్రెస్ 1. మెహమ్మద్ అమీనా భేగం 564 ఓట్లు (కాంగ్రెస్) 2.. మైలారం జయమ్మ 14 ఓట్లు (బీజేపీ) 3. శెట్టి సుభాషిణి 299 ఓట్లు (బిఆర్ఎస్) 4. అఫ్రీన్ సుల్తానా 299 ఓట్లు (స్వతంత్ర ) 5. జలమోని మాధవి 90 ఓట్లు (స్వతంత్ర) WARD NO: 7 విజేత టేకుల సుదర్శన్ రెడ్డి బిఆర్ఎస్ 1. ఆకుల సంతోష్ కుమార్ 06 ఓట్లు ( బీజేపీ) 2. టేకుల కమలాకర్ రెడ్డి 492 ఓట్లు (కాంగ్రెస్) 3. టేకుల సుదర్శన్ రెడ్డి 494 ఓట్లు (బిఆర్ఎస్) WARD NO: 8 విజేత వర్త్య రాందాస్ కాంగ్రెస్ 1. రమావత్ నర్సింహ్మా 283 ఓట్లు (బిఆర్ఎస్) 2. రమావత్ బాలకృష్ణ 39 ఓట్లు (బీజేపీ) 3. వర్త్య రాందాస్ 500 ఓట్లు (కాంగ్రెస్) WARD NO: 9 విజేత దారు రాఘవేందర్ రావు కాంగ్రెస్ 1. అరవింద్ కర్నె 12 ఓట్లు ( బిఆర్ఎస్) 2. జక్క రవీందర్ రెడ్డి 478 ఓట్లు (బీజేపీ) 3. దారు రాఘవేందర్ రావు 489 ఓట్లు (కాంగ్రెస్) WARD NO: 10 విజేత దొంతరమోని భార్గవి కాంగ్రెస్ 1. దొంతరమోని భార్గవి 722 ఓట్లు (కాంగ్రెస్) 2. భాగ్యలక్ష్మి కాకి 393 ఓట్లు (బీజేపీ) WARD NO: 11 విజేత కోండ్రు శ్రీలత బిఆర్ఎస్ 1. ఆముదాల కళావతి 201 ఓట్లు (కాంగ్రెస్) 2. కొండ్రు మనీల 30 ఓట్లు (బీజేపీ) 3. కోండ్రు శ్రీలత 484 ఓట్లు (బిఆర్ఎస్) WARD NO: 12 విజేత కొండిగారి త్రిలోక్ కుమార్ బిఆర్ఎస్ 1. అర్పుల చంద్రయ్య 216 ఓట్లు (కాంగ్రెస్) 2. కొండిగారి త్రిలోక్ కుమార్ 316 ఓట్లు (బిఆర్ఎస్) 3. బోడ సమేల్ 99 ఓట్లు CPM 4. మాచర్ల అమరేందర్ 14 (స్వతంత్ర) WARD NO: 13 విజేత ఇందూరి శ్రీనివాస్ కాంగ్రెస్ 1. ఆకుల సురేష్ 239ఓట్లు (బిఆర్ఎస్) 2.ఆడెపు రాఘవేంద్ర స్వామి 71ఓట్లు (బీజేపీ) 3.ఇందూరి శ్రీనివాస్ 510ఓట్లు (కాంగ్రెస్) WARD NO: 14 విజేత ఎదుల్ల విజయలక్ష్మీ కాంగ్రెస్ 1. ఎదుల్ల విజయలక్ష్మీ 394 ఓట్లు (కాంగ్రెస్) 2. ప్యాపలి ప్రశాంతి 58 ఓట్లు (బీజేపీ) 3. మొద్దు శ్రావని 282 ఓట్లు (బిఆర్ఎస్) 4. మొద్దు సుష్మ రెడ్డి 369 ఓట్లు (స్వతంత్ర) WARD NO: 15 విజేత క్యామ శంకర్ బిఆర్ఎస్ 1. క్యామ శంకర్ 557 ఓట్లు (బిఆర్ఎస్) 2. గొట్టం శ్రీశైలం17 ఓట్లు (బీజేపీ) 3. తాళ్ళ శ్రీశైలం గౌడ్ 455 ఓట్లు (కాంగ్రెస్) WARD NO: 16 విజేత అలువాల జ్యోతి బిఆర్ఎస్ 1.అలువాల జ్యోతి 694 ఓట్లు (బిఆర్ఎస్) 2. ఈర్లపల్లి సునిత 346 ఓట్లు (కాంగ్రెస్) WARD NO: 17 విజేత మడుపు లక్ష్మమ్మ బిఆర్ఎస్ 1. బస్వాపురం సుమలత 05 ఓట్లు (స్వతంత్ర) 2. మడుపు లక్ష్మమ్మ 275 ఓట్లు (బిఆర్ఎస్) 3. ముత్యాల జ్యోతి 200 ఓట్లు (కాంగ్రెస్) 4. ముత్యాల శ్రీలత 203 ఓట్లు (బీజేపీ) 5. జక్క ప్రమీల 96 ఓట్లు (స్వతంత్ర) WARD NO: 18 విజేత సిద్దం భాను ప్రియ బీజేపీ 1. పండుగ సులోచన 126 ఓట్లు (బిఆర్ఎస్) 2. బర్ల మంగ 122 ఓట్లు (కాంగ్రెస్) 3. మడుపు శ్రీదేవి 11 ఓట్లు (స్వతంత్ర) 4. సిద్దం భాను ప్రియ 308ఓట్లు (బీజేపీ) WARD NO: 19 విజేత ఆకుల యాదగిరి బిఆర్ఎస్ 1. ఆకుల యాదగిరి 430 ఓట్లు (బిఆర్ఎస్) 2. ఆకుల సాయి రాం 65 ఓట్లు (బీజేపీ) 3. కొండ్రు రఘుపతి 01 ఓట్లు (బీఎస్పీ) 4. మొమ్మద్ పెరోజ్ 424ఓట్లు (కాంగ్రెస్) WARD NO: 20 విజేత జయ మంద బిఆర్ఎస్ 1. జయ మంద 504 ఓట్లు (బిఆర్ఎస్) 2. పంది భాను ప్రియ 409ఓట్లు (కాంగ్రెస్) 3. మాచర్ల ఇంద్రజ 04 ఓట్లు (స్వతంత్ర) WARD NO: 21 విజేత చిలుకల బుగ్గరాములు బిఆర్ఎస్ 1. ఈగల రాములు 187 ఓట్లు (కాంగ్రెస్) 2. కప్పాటి సంతోష్ కుమార్ 140 ఓట్లు (స్వతంత్ర) 3. కొప్పు సతీష్ 21 ఓట్లు (బీజేపీ) 4. చిలుకల బుగ్గరాములు 311 ఓట్లు (బిఆర్ఎస్) WARD NO: 22 విజేత కప్పరి స్రవంతి కాంగ్రెస్ 1. కప్పరి స్రవంతి 337 ఓట్లు (కాంగ్రెస్) 2. నౌసు భాగ్యలక్ష్మి 10 ఓట్లు (బీజేపీ) 3. వింజమూరి శిరీష 291 ఓట్లు (బిఆర్ఎస్) WARD NO: 23 విజేత నీలం స్వేత బిఆర్ఎస్ 1. గన్నోజు అంబికా 13 ఓట్లు (బీజేపీ) 2. చేనమోని చంద్రకళ 358 ఓట్లు (కాంగ్రెస్) 3. నీలం స్వేత 370 ఓట్లు (బిఆర్ఎస్) WARD NO: 24 విజేత గూడూరు గిరీష్ బిఆర్ఎస్ 1.గూడూరు గిరీష్ 379 ఓట్లు (బిఆర్ఎస్) 2.పబ్బె శ్రీనివాస్ 303 ఓట్లు (కాంగ్రెస్) కాంగ్రెస్ పార్టీ : 08 బిఆర్ఎస్ పార్టీ : 13 బీజేపీ పార్టీ : 02 స్వతంత్ర : 01

ఖమ్మం

మధిర. మున్సిపాలిటీ హస్త గతం..

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా పరిధిలో ని మధిర మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర అధికార పార్టీ అయినా కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాలల్లో విజయం సాధించారు. తెలంగాణ ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం పరిధిలో ని మధిర మున్సిపాలిటీలో లో కాంగ్రెస్ విజయం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షము వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 22 వార్డులు ఉన్న మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ 18 బి ఆర్ ఎస్ 1 ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు.

తిరుపతి

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు.

చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే దంపతులను వేదపండితులు ఆశీర్వదించి… తీర్థప్రసాదాలు అందజేసిన టిటిడి అధికారులు. చంద్రగిరి, పున్నమి ప్రతినిధి చంద్రగిరి మండలం పరిధిలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభ‌వంగా జరుగుతున్నాయి. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులకు ఘనస్వాగతం పలికిన అర్చకులు ,టీటీడీ అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి పసుపు, కుంకుమ, పండ్లు,పుష్పాలతో కూడిన పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించి …. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.ఆలయంలోని మండపంలో ఎమ్మెల్యే దంపతులను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేసిన టిటిడి అధికారులు.అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రెండవసారి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు కాసులహారం శోభాయాత్రలో పాల్గొనడం మాకు మహదానందంగా ఉంది . అనంతరం గరుడ వాహన సేవలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. వాహన సేవలో భక్తులను ,స్థానికులను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే దంపతులు. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని స్వామివారిని వేడుకునట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి , టీటీడీ బోర్డు సభ్యులు జి. భానుప్రకాష్‌రెడ్డి , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు , అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు,భక్తులు పాల్గొన్నారు.

హెల్త్ టిప్స్

మెరిసే ఇంపోర్టెడ్ ఆపిల్స్ కంటే దేశీ పండ్లే మేలని నిపుణుల సూచన

విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఆపిల్స్ కంటే దేశీయంగా లభించే కశ్మీర్, హిమాచల్ ఆపిల్స్ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. దిగుమతి పండ్లు నెలల తరబడి నిల్వ ఉంచడం వల్ల వాటిలోని విటమిన్-సీ శాతం గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొన్నారు. దేశీ ఆపిల్స్‌లో గుండెకు ఉపయోగకరమైన యాంటీఆక్సిడెంట్లు, సహజ పోషకాలు సమృద్ధిగా ఉంటాయని వివరించారు. మెరిసే వ్యాక్స్ పూత ఉన్న విదేశీ పండ్ల కంటే తాజాగా లభించే స్వదేశీ ఆపిల్స్ వినియోగించుకోవాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.