Sunday, 8 March 2026

Blog

తిరుపతి

ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల కుటుంబం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: మండలంలోని తొండమాన్ పురం లో వెలసిన తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. తొండ మాంపురంలో జరిగే బ్రహ్మోత్సవాల గురించి ఆలయ అధికారులతో స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలను పూర్తిచేయాలని అధికారం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, పూజారులు, స్థానికులు కందాటి శేఖర్ రెడ్డి, టిడిపి నాయకులు కామేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

మహాదేవునికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి ఆనం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. బ్రహ్మోత్సవాల ఐదో రోజున జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి సంప్రదాయబద్ధంగా మంగళవాయిద్యాల నడుమ పట్టువస్త్రాలను తలపై మోస్తూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకుని, గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆశీర్వచన మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో శ్రీకాళహస్తికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. “మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు, అన్నదానం, ఉచిత ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే పరకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ కుమార్, బోర్డు సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

బ్రహ్మోత్సవ కానుక శివం టు శివం రోడ్డు మార్గం- దేవాదాయ శాఖ మంత్రి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘శివం టు శివం’ లింక్ రోడ్డును రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి శనివారం ఘనంగా ప్రారంభించారు. సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు మార్గం, క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిని అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ‘విజన్-2029’ (Vision-2029) ప్రణాళికలో భాగంగా నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ రోడ్డు మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారని రోడ్డు ద్వారా భక్తులు పట్టణంలోకి రాకుండానే నేరుగా బైపాస్ రోడ్డుకు చేరుకోవచ్చన్నారు. శ్రీకాళహస్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటిస్తు గత ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణానికి 42.5కోట్లు ఎస్టిమేట్ వేయగా తమ కూటమి ప్రభుత్వంలో ఈ రోడ్డు నిర్మాణం 20 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేస్తున్నామని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఇదేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు.. 40.5 కోట్ల రూపాయలు వ్యయంతో అప్పటి వైకాప ప్రభుత్వం ఈ రహదారి ఏర్పాటు చేయదలిస్తే, తమ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం చూస్తే గత ప్రభుత్వం ఏవిధంగా ప్రజల సొమ్మును స్వాహా చేశారో అర్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పి సుబ్బారాయుడు, ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి,ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ కుమార్, టిడిపి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు,తొట్టంబేలు టిడిపి అధ్యక్షులు రావిళ్ళ మునిరాజ నాయుడు, ట్రస్టు బోర్డు సభ్యులు, దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి టి.బాపిరెడ్డి, ఆలయ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

గుడిమల్లం పరశురామేశ్వరునికి ప్రభుత్వ పట్టువస్త్రాల సమర్పణ

ఏర్పేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా శనివారంనాడు ఏర్పేడు మండలం గుడిమల్లంలోని చారిత్రాత్మక శ్రీ పరశురామేశ్వర స్వామి వారి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ పవిత్ర ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి, ఎమ్మెల్యేకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోనే అత్యంత పురాతనమైన శివలింగంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్ర విశిష్టతను ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. దర్శనానంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా మౌలిక వసతులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, తాగునీరు, వసతి సౌకర్యాల మెరుగుదలగు వాటిపై నిధుల కేటాయింపులపై ఆలయ జీర్ణోద్ధరణకు, ఇతర నిర్మాణ పనులకు అవసరమైన నిధుల మంజూరుపై పర్యాటక ప్రాముఖ్యత: చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దేవాలయాల పరిరక్షణకు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్లు, జిల్లా యస్. పి., పలుప్రభుత్వ శాఖ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

అసెంబ్లీ గ్యాలరీలో ద స్కూల్ విద్యార్థుల సందడి ప్రత్యక్షంగా బడ్జెట్ వీక్షణ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14:శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ విద్యార్థులు పుస్తకాల్లో చదువుకున్న చట్టసభల పనితీరును శనివారం నాడు ప్రత్యక్షంగా వీక్షించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా, అసెంబ్లీ గ్యాలరీ నుండి ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసే అరుదైన అవకాశాన్ని పాఠశాల విద్యార్థులు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ జనార్దన్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, సమాజంపై అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ పర్యటన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్ని, సభా మర్యాదలను విద్యార్థులు నేరుగా చూసి ఎంతో నేర్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇలాంటి ప్రత్యక్ష వీక్షణ అవకాశాలు కల్పించడం శుభపరిణామమని కొనియాడారు. అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుని బడ్జెట్ సమావేశాలను చూడటం ఒక గొప్ప మరపురాని అనుభూతిని ఇచ్చిందని టీవీల్లో చూసే దానికంటే నేరుగా చూడటం వల్ల చట్టసభల ప్రాముఖ్యత మాకు అర్థమైందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు ఈ అద్భుతమైన అవకాశం కల్పించిన పాఠశాల యాజమాన్యానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ ఆద్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిభిరం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక BP అగ్రహారంలో శ్రీ సీతారామ మందిరం వద్ద త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ వారు శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిభిరం 122 మంది నేత్ర సమస్యలు ఉన్నవారు పాల్గొని పరీక్షలు చేసుకున్నారు. వీరిలో 36మంది కంటి శుక్లాలు ఉన్నాయని వైధ్యులు గుర్తించడం జరిగినది వీరందరికీ శ్రీ భక్తకన్నప్ప కంటి ఆసుపత్రిలో ఉచితముగా కంటి ఆపరేషన్లు చేయబడునని త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ నిరావహుకులు తెలిపారు. నేత్ర వైద్య శిభిరానికి వచ్చిన వారందరికీ వైధ్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి సిబ్బంది జయచంద్రప్ప,N దామోదర్, M ప్రియా,N స్వాతి,Y.యామిని, M.రవి, స్థానిక ప్రముఖులు రత్నం రెడ్డి, స్వామి రెడ్డి భరత్ కుమార్ రెడ్డి, కుమార్, రవికుమార్, శ్రీరామ ఆలయ కమిటీ సభ్యులు ముందుండి ఉచిత నేత్ర వైద్య శిభిరాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

ఎమ్మెల్యే బొజ్జల సహకారంతో ఏర్పాటైన శ్రీ అగస్తేశ్వరాలయానికి నూతన ట్రస్ట్ బోర్డు

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ దుర్గాంబికా సమేత శ్రీ అగస్తేశ్వరాలయం నకు నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటును శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సహాయ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్గా కన్నాల రామచంద్రారెడ్డి సభ్యులుగా కందాటి సుబ్బరామిరెడ్డి ,తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి ,కోనా రాజారెడ్డి, గల్లా వెంకటసుబ్బయ్య, చెంచురత్నం, సి నాగమణి, కే సుబ్రహ్మణ్యం, ఇందుకూరు సూరిబాబు, కోకిల రాజ, గ్రామ పెద్దల సమక్షంలోఆలయమునందు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడపడమే కాకుండా ఈ ఆలయ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపం నిర్మించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు ప్రసాదు శర్మ, రామ్ మనోహర్ శర్మ గ్రామ పెద్దలు కన్నలి ప్రతాపరెడ్డి, సీతారామిరెడ్డి, దినేష్ రెడ్డి, వై వెంకటసుబ్బయ్య,రాజశేఖర్ రెడ్డి కే రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

తిరుపతి

శాస్త్రోక్తంగ శ్రీ అగస్తీశ్వరస్వామి వారి ధ్వజరోహణం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధ ఆలయమైన పెద్ద కన్నలిలొ గల శ్రీ అగస్తీశ్వరాలయం వారిఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఉత్సవాలు ధ్వజరోహణంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను, ప్రతి ఏడాది పరిసర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా పాల్గొని ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కన్నాలి రాజశేఖర్ రెడ్డి, సీతారామిరెడ్డి, గ్రామ పెద్దలతో పాటు విశేషంగా మహిళలు పాల్గొన్నారు.

తిరుపతి

బాల్య వివాహల నిర్ములన ర్యాలీని ప్రారంభించిన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: శ్రీకాళహస్తీశ్వరలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో బాల్య నిర్ములించాలంటూ శ్రీకాళహస్తిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ భారీ ర్యాలీని సుమారు 200 మంది స్కౌట్స్, గైడ్స్ రోవర్లు, రేంజర్లు ప్ల కార్డులు చేతపట్టుకుని పట్టణ వీధులలో వద్దు.. వద్దు.. బాల్య వివాహలు వద్దు… బాల్యం వయస్సులో పుస్తెల భారం వద్దంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీని రాజగోపురం వద్ద నుండి శ్రీకాళహస్తీశ్వరలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకునే వయస్సులో వివాహలను చేయడం చట్ట రీత్యా నేరమని, వీటికి ప్రోత్సాహంచిన వారిపై కూడా కేసులు నమోదు అవుతాయనన్నారు. స్కౌట్స్ వారు మహశివరాత్రి ఉత్సవాలలో కూడా భక్తులకు సేవలందించాలని అయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమీషనర్లు ఎం ఎం రెడ్డి, టి. రమేష్ బాబు, యూత్ చైర్మన్ అజారుద్దీన్, గైడ్ కెప్టెన్లు, పద్మావతి, నిర్మల, సరిత, స్కౌట్స్ మాస్టర్లు మురళి, సుబ్రహ్మణ్యం, మహేంద్ర, సుబ్రహ్మణ్యం, ధనుష్, మణికంఠ, రోవర్ లీడర్ ఆంజనేయులు, జ్యోతి, మణికంఠ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

నో బ్యాగ్ డే తో విద్యా ర్థులు రోజంతా ఉత్సాహం

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 14: తొట్టంబేడు మండలంలో శనివారం నాడు నో బ్యాగ్ డే సందర్భంగా దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యార్థులు ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారంతో చార్టులతో టోపీలు, కిరీటాలు, శివరాత్రి పురస్కరించుకుని మట్టితో శివలింగాన్ని తయారు చేసారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ…ప్రతి శనివారం నో బ్యాగ్ డే వలన విద్యార్థులలో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుందని, ప్రత్యక్షంగా బొమ్మలు తయారు చేయడం వలన వారిలో నైపుణ్యాలు మెరుగు పడతాయని అన్నారు. విద్యా ర్థులు రోజంతా ఆట, పాటలతో ఉత్సాహంగా గడిపారన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.