Saturday, 7 March 2026

Blog

తిరుపతి

నందిపై శివుని దివ్యతేజం: కైలాసనాథుని వాహన సేవతో పులకించిన పురవీధులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. పరమశివుని దర్శనార్థం తరలివచ్చిన భక్తకోటితో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఆదివారం నాడు రాత్రి మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అత్యంత ప్రధానమైన నంది వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. నందీశ్వరునిపైగంగాధరుడు..సింహవాహనంపైజ్ఞానాంబ జాగారం చేసే భక్తులను అనుగ్రహించేందుకు, భక్తవత్సలుడైన సోమస్కందమూర్తి గంగాదేవి సమేతుడై అధికార నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు గంభీరమైన సింహవాహనంపై ఆసీనులై స్వామివారితో కలిసి పురవీధుల్లో విహరించారు. విద్యుత్ దీపకాంతులు, మంగళ వాయిద్యాలు, భక్తుల ‘నమశ్శివాయ’ స్మరణల మధ్య వాహన సేవ అట్టహాసంగా సాగింది. భక్తిసాగరమైనపురవీధులు మహాశివరాత్రి నాటి ప్రత్యేక జాగరణలో ఉన్న వేలాది మంది భక్తులు స్వామివారి దివ్యతేజాన్ని దర్శించుకుని తరించారు. నందీశ్వరునిపై కొలువుదీరిన శివుని రూపం భక్తులకు కనువిందు చేసింది. కైలాసమే భూమికి దిగివచ్చిందా అన్నట్లుగా సాగిన ఈ ఊరేగింపులో కోలాటాలు, భజన బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు పురవీధుల్లో భక్తులు బారులు తీరారు. అధికారుల పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు.

తిరుపతి

నేడే శివ పార్వతుల కళ్యాణ వైభోగం

శ్రీకాళహస్తికి పెళ్లికళ… పెద్ద సంఖ్యలో రానున్న భక్తులు శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ బహుళ అమావాస్య సంద ర్భంగా శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రంలో మంగళవారం తెల్లవారుజామున జరగనున్న శివ పార్వతుల కళ్యాణానికి ముక్కోటి దేవతలు దిగివ స్తారు. స్వర్ణముఖి నదీ తీరంలో ఆకాశం పందిరిగా, భూమి పీటగా జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అధికారులు, సర్వం సిద్ధం చేశారు. సాధారణంగా దేవతామూర్తుల కళ్యాణోత్సవం వారివారి ఆలయాల్లో నిర్వహిస్తారు. ఇక్కడ స్కోమస్కందుడు ప ట్టణం నడిబొడ్డున ప్రజల సమక్షంలో వివాహం చేసుకోవడం ఆనవాయితీ. గజవాహనంపై పరమేశ్వరుడు సింహవాహనంపై శ్రీజ్ఞా నప్రసూనాంబాదేవి మంగళవారం రాత్రి పయనమవుతారు. అర్ధరాత్రి తరువాత శాస్త్రోక్తంగా పూజారులు వివాహ మహోత్సవాన్ని నిర్వ హిస్తారు. నూతన వరుడుగా శివయ్య : కళ్యాణం సందర్భంగా వాయులింగేశ్వరుడు స్వర్ణాభరణాలు ధరింస్తాడు. ముందుగా చండికేశ్వరుడు, భృంగిరిటుడు, నికుంభనరుడు, భద్రకాలుడు తదితర ముక్కోటి దేవతలు సర్వేశ్వరుని వెంట నిలుస్తారు.

తిరుపతి

అభరాన్ని అంటిన రథోత్సవం…. ఆది దంపతులను దర్శించుకున్నా భక్త సంద్రం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వారు నిర్వహించిన దథోత్సవం అభరాన్ని అంటింది ఆది దంపతులను దర్శించుకున్నా భక్త సంద్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన సోమవారం నాడు రథోత్సవం అంగరంగ వైభోగంగా జరిగింది. స్వామి, అమ్మవార్లు వేర్వేరు రథాలపై పురవీధులోల విహరిచారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో భక్తులతో కలసి పాల్గొని ఓం నమఃశి వాయ, శంభో …శివ … శంభో హరహర మహదేవ, శంభోశంకర అంటూ స్వామి రథాన్ని, జైజైకాళి అంటూ అమ్మవారి రథాన్ని లాగుతూ తన్మయత్వం చెందారు. రథాలపై ఉప్పు, మిరియాలు చల్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం 10.00 గంటలకు రథోత్సవం ప్రాభంమైంది. మధ్యాహ్నం 2.00 గంటలకు రథాలు ఆలయం వద్దకు తిరి గి చేరుకున్నాయి. హలాహలం మింగిన పరమశివుడుతిరిగి మేల్కొన్న తర్వాత బ్రహ్మ చేసిన ఉత్సవమే రథోత్సవం. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమూ రథోత్సవం నేత్రపర్వర్వంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అభిషేక పూజలు జరిగాయి. తర్వాత అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో విశే ష పూజలు జరిగాయి. ఉత్సవమూర్తులను వివిధ స్వర్ణాభణాలు, సుగంధభరిత పుష్పాలతో సుందరంగా అలంకరిచారు. అనంతరం ఉరేగింపుగా అలయం వెలుపల ఉన్న నెప్పల మండపానికి వేంచేపు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ థాలపై ఆశీనులయ్యారు. గంగాదేవి సమేతంగా సోమస్కంధమూర్తి ఒక రథంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మరో ర థంపై కొలువుదీరారు. ముందుగా స్వామి వారి రథం…. తొలుత స్వామివారి రథం బయలుదేరింది. కళాబృందాల ప్రదర్శనలు ముందు సాగుతుండగా అధికారులు, అనధికారులు భక్తుల శివనామస్మరణల నడుమ ఆలయం వద్దనుంచి తేరువీధి, నెహ్రూవీధి మీరుగా పెళ్లిమండపం వద్దకు రథం చేరుకుంది. ఆ తర్వాత అమ్మవారి రథం బలుదేరింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న భక్తులు ఏ మాత్రం లెక్క చేయలేదు. ఉప్పు, మీరియాలు రథాలపై చల్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. నాలుగు వీధులు భక్తులతో క్కిక్కిరిసిపోయాయి. సూమారు లక్ష మంది ఈ రథోత్సవంలో పాల్గొన్నారని ఆలయాధికారుల అంచన. ఈ కార్యక్రమంలో ఆలయ పరిపాలనాధికారి బాపి రెడ్డి, పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పలక మండలి సబ్యులు, కూటమి నాయకులు పలువురు పాల్గోన్నారు. ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా డిఎస్పి నరసింహమూర్తి పటిష్టమైన భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారు. పోలీసులతో పాటు ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, హెూంగార్డులు బందోబస్తు నిర్వహించారు. స్కౌట్లు, గైడ్లు స్కిట్ కళాశాల విర్యార్ధులు సేవలందిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, భాజపా నాయకులు కోలా ఆనంద్ పాలక మం డలి సభ్యులు, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం సిబ్బంది, పోలీసు శాఖ, విద్యుత్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

తాళ్లపూడి మండలంలో బస్సు షెల్టర్ల దుర్వినియోగం

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం పరిధిలోని వేగేశ్వరపురం మరియు తాళ్లపూడి,ప్రక్కిలంక గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్సు షెల్టర్లు ప్రస్తుతం వారి ఉపయోగానికి కాకుండా ఇతరుల స్వార్థ ప్రయోజనాలకు వేదికలుగా మారినట్టు స్థానికులు వాపోతున్నారు. వేగేశ్వరపురం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన కైకాల సూర్యచంద్ర జూనియర్ కాలేజీ సమీపంలోని బస్సు షెల్టర్ ప్రయాణికులు కూర్చునే పరిస్థితిలో లేకుండా మారింది. చుట్టుపక్కల వ్యాపారులు తమ టూ వీలర్ వాహనాలను నిలిపివేసే స్థలంగా దానిని వినియోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే గ్రామంలో కొప్పుల గంగాధర్ సామిల్ వద్ద ఏర్పాటు చేసిన మరో బస్సు షెల్టర్‌లో కూడా కొంతమంది వ్యక్తులు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. తాళ్లపూడి గ్రామపంచాయతీ సమీపంలోని బస్సు షెల్టర్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ ప్రయాణికులు నిలబడేందుకు కూడా వీలు లేకుండా కాగితాలు, గ్లాసులు, ప్లాస్టిక్ బాటిళ్లు తదితర వ్యర్థ పదార్థాలతో నిండిపోయినట్లు కనిపిస్తోంది. అలాగే ప్రక్కిలంక గ్రామంలో అమరావతి లాడ్జ్ ఎదురుగా, మాజీ ఎంపీటీసీ సొలస నాగ సీతారామ కస్తూరి జ్ఞాపకార్థం వ్యయప్రయాసలతో నిర్మించిన బస్సు షెల్టర్ కూడా ప్రయాణికులకు ఉపయోగపడే స్థితిలో లేదు. పక్కనే ఉన్న టీ, టిఫిన్ హోటల్ యజమానులు వాడిన నీటిని షెల్టర్‌లోకి వదులుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల అక్కడ దుర్వాసన వ్యాపించి, దోమల పెంపక కేంద్రంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లేదా దాతలు ప్రయాణికులు ఎండ, వానల నుండి రక్షణ పొందేందుకు నిర్మించిన ఈ బస్సు షెల్టర్లు ప్రైవేట్ వ్యక్తుల అవసరాలకు వాడబడుతుండగా, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బస్సు షెల్టర్లను శుభ్రపరచి, అక్రమ వినియోగాన్ని అరికట్టి, ప్రయాణికుల కోసం వీటిని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

అమరావతి గడ్డపై అపర కుబేరుడు: ఇది కేవలం పర్యటన కాదు.. ఒక ఆశల వారధి!

నేటి సమాజంలో సాయం చేసే చేతిని కూడా అనుమానించే పరిస్థితి. కానీ, తాను సంపాదించిన సంపదలో సింహభాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులకు ‘దాతృత్వం’ అంటే ఏమిటో నేర్పిన మహోన్నత వ్యక్తి బిల్ గేట్స్. ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకడం వెనుక ఒక స్పష్టమైన సంకేతం ఉంది. అది—సాంకేతికతతో సామాన్యుడి జీవితాన్ని మార్చాలనే తపన. సంపద పంపిణీ కాదు.. సమస్యల పరిష్కారం బిల్ గేట్స్ పర్యటనను కేవలం ఒక పారిశ్రామికవేత్త పర్యటనగా చూడలేం. ఒక మనిషి తన మేధస్సుతో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి, మళ్ళీ అదే మేధస్సును పేదరికం, రోగాలు, వ్యవసాయ సంక్షోభాల పరిష్కారానికి ఎలా వాడుతున్నారనేది ఇక్కడ ముఖ్యం. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో సాగుతున్న ‘సంజీవని’ వంటి ప్రాజెక్టులు వేలమంది ప్రాణాలను, జీవనోపాధిని కాపాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనుండటం విశేషం. డేటా ఆధారిత పాలనలో ఏపీ దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్ధిదారుడికి అందుతున్నాయా? సాంకేతికత ద్వారా అవినీతిని ఎలా అరికట్టవచ్చు? విపత్తుల సమయంలో సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు? ఈ అంశాలపై గేట్స్ వంటి విజనరీకి చంద్రబాబు నాయుడు ప్రజంటేషన్ ఇవ్వడం రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుంది. బిల్ గేట్స్ వంటి దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్ వైపు చూడలా చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి సామాన్యమైనది కాదు. గత మూడు దశాబ్దాలుగా ఆయనకు గేట్స్ తో ఉన్న సాన్నిహిత్యం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, అది రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్మించుకున్న ఒక బలమైన బంధం. ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులకు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మాణ సమయం నుండి నేటి అమరావతి వరకు, టెక్నాలజీని సామాన్యుడి ముంగిటకు తేవాలనే ఆయన ప్రయత్నమే గేట్స్ ఫౌండేషన్ ను ఇక్కడికి రప్పించింది. లోకేశ్ తో కూడిన మంత్రుల బృందం గేట్స్ కు స్వాగతం పలకడం ద్వారా ప్రభుత్వం అంతా ఒకే లక్ష్యం—’అభివృద్ధి’—కోసం పనిచేస్తోందని నిరూపించారు. ఈ పర్యటన ద్వారా రాబోయే మార్పులు అపారం: ఉండవల్లిలో డ్రోన్లు, AI (కృత్రిమ మేధ) సాయంతో చేసే వ్యవసాయాన్ని గేట్స్ పరిశీలించడం ద్వారా, భవిష్యత్తులో మన రైతులు ప్రపంచ స్థాయి సాగు పద్ధతులను అందుకోనున్నారు. వైద్యం & విద్య: గేట్స్ ఫౌండేషన్ సహకారంతో స్కూళ్లలో డిజిటల్ విద్య, ఆసుపత్రుల్లో అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. గేట్స్ రాకతో ఇతర అంతర్జాతీయ సంస్థల దృష్టి కూడా అమరావతిపై పడుతుంది. ఇది ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ దిశగా పడే బలమైన అడుగు. బిల్ గేట్స్ పర్యటన ఒక గంటలో.. రోజులో ముగిసే కార్యక్రమం కాదు, అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దొరికిన ఒక గొప్ప భరోసా. సంపద ఉన్న ప్రతివాడూ సాయం చేయడు, సాయం చేసే మనసున్న ప్రతివాడి దగ్గరా సంపద ఉండ దు. ఈ రెండూ పుష్కలంగా ఉన్న గేట్స్, మార్పును ఆకాంక్షించే చంద్రబాబు కలిస్తే—అది సామాన్యుడి పాలిట వరం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్న డ్రోన్ నిఘా-జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు

జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి సూచనల మేరకు, సంబంధిత DSP గార్ల ఆధ్వర్యంలో ఆయా CI/SI ల సమక్షంలో డ్రోన్ తో, నెల్లూరు పట్టణ, శివారు, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో క్షుణ్ణంగా పరిశీలించి, పట్టణ సమీప ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డు కట్టు వేస్తున్న నెల్లూరు పోలీసులు.  జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మరియు ప్రత్యేకంగా టౌన్ పరిసర ప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు విస్తృతంగా డ్రోన్ నిఘా ఏర్పాటు చేసిన నెల్లూరు పోలీసులు  నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాలలో నేరాలకు చెక్ పెడుతూ, జల్లెడ పడుతున్న నెల్లూరు పోలీసులు.  అందులో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది.  గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా… బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..  ఓవర్‌ స్పీడ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లను గుర్తిస్తాం..  నేర నియంత్రణే లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా..  క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్న నెల్లూరు పోలీసులు.  బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది.  నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశితమైన ప్రదేశాలను ముందుగా గుర్తించి, పాడుపడిపోయిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, నదీ తీరాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి, నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.  కావున ఎవరైన చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు.  గంజాయి సేవించడం, అమ్మడం, రవాణా చేసే వారు పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.  జిల్లాలో ఇకపై సాంకేతికతతో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రించుటకు వినూత్న చర్యలు తీసుకుంటున్న నెల్లూరు పోలీసులు. ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కి తెలపగలరు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం.. నెల్లూరు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్., గారు.

ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమంలో 132 ఫిర్యాదులు స్వీకరణ. • ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదు.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటీషన్లను పరిష్కరించాలని ఆదేశాలు. • ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, చట్టపరిధిలో పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా యస్.పి. గారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 132 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. 1. ఇందుకూరుపేట పరిధికి చెందినటువంటి వ్యక్తిని మరియు అతని స్నేహితుడిని, అనంతపురంకు చెందిన రాజు అనే వ్యక్తి, వాట్సప్ ద్వారా పరిచయమై సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించి, ఒక్కొక్కరు వద్ద లక్ష యాభై వేల రూపాయలు తీసుకొని, జాబు ఇప్పించకుండా నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, విచారించి న్యాయం చేయాలని కోరారు. 2. నెల్లూరు రూరల్ పరిధికి చెందిన వ్యక్తిని, సంతపేటకి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి చీటీలు వేయించుకొని, నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, మోసపోయామని, విచారించి న్యాయం చేయాలని కోరారు. 3. బిట్రగుంట పరిధికి చెందినటువంటి మహిళను, తన భర్త అత్తమామలు వేధిస్తున్నారని, భర్త చెడు వ్యసనాలకు బానిసై మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు. 4. కోట పరిధికి చెందిన వృద్ధురాలిని, తన పెద్ద కుమారుడు భార్య, మనవడు బెదిరిస్తూ, తన అనుమతి లేకుండా తనకు జీవనాధారం కోసం ఉంచుకున్నటువంటి పొలంలో నారు వేశారని, అడిగితే దాడి చేశారని, విచారించి న్యాయం చేయాలని కోరారు. 5. కలిగిరికి చెందినటువంటి మహిళ యొక్క కుమార్తె, 03.02.26 నుండి కనిపించడం లేదని, ఆచూకీ కనుగొని అప్పగించాలని కోరారు. 6. చిన్న బజారుకు పరిధికి చెందిన వ్యక్తిని, తన స్నేహితుడు ముజ్మల్ తనని కొట్టి గాయపరిచినట్లు, చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు, ప్రస్తుతం కోర్టులో కేసు విచారణలో ఉన్నదని, ముజ్మల్ తన మనుషులతో బెదిరిస్తున్నాడని, విచారించి న్యాయం చేయాలని కోరారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్ గారు హామీ ఇచ్చారు.  ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారు, లీగల్ అడ్వైజర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు, DCRB CI శ్రీ రామారావు, మహిళా స్టేషన్ CI శ్రీ సుబ్బారావు, SB-1 CI శ్రీ వెంకటేశ్వర రావు, SB-2 CI శ్రీనివాస రెడ్డి గార్లు మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మహా శివరాత్రి శోభతో తాళ్లపూడిలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం ఘన వైభవం

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాళ్లపూడి మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ మదన గోపాలస్వామి ఆలయం లో శ్రీ మాత గోవింద మాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం అర్చకులు ఖందగిరి గౌతమ్ శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణ కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షులు గానుగల వరహాలు దంపతులు, కోశాధికారి ముత్తోజు మురళి దంపతులు పీటలపై కూర్చొని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు పట్నాల సతీష్, కార్యదర్శి కడలి కిరణ్ మాట్లాడుతూ తాళ్లపూడి మండలంలో బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు. మండలంలోని ప్రముఖులు, సంఘ సభ్యులు సతీసమేతంగా హాజరుకావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం మహా శివరాత్రి రోజున ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమ ఏర్పాట్లను ఉపాధ్యక్షులు పట్నాల సూరిబాబు, దొంతోజు మూర్తి, ధర్నాలకోట ప్రసాద్, నాగమల్లి మహేష్, కాశీ ప్రసాద్, నాగులకొండ భద్రం సమర్థవంతంగా పర్యవేక్షించారు. మండల విశ్వబ్రాహ్మణ సంఘ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకకు ఘనత చేకూర్చారు.

E-పేపర్

రేపటికి ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ *రేపటికి ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక* …. రేపు కూడా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేనా….? కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కౌన్సిలర్ ఆకుల యాదగిరి వచ్చాకనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని పోడియం వద్దకు పలుమార్లు వచ్చి వాగ్వాదానికి దిగారని వాగ్వాదానికి దిగారని,గగ్గోలు పెట్టారని ఆర్డిఓ అనంతరెడ్డి అన్నారు. కౌన్సిలర్లు సృష్టించిన గందరగోళం వాళ్ళనే రెండుసార్లు వాయిదా వేసిన ఫలితం లేకపోయిందని అందుకే *రేపటికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి ఆర్డిఓ అనంతరెడ్డి తెలిపారు* . నేను కేవలం ఎక్స్ ఆఫీసీయోమెంబెర్ గా నా ఓటు వినియోగించుకోవడానికి మాత్రమే మున్సిపల్ కు రావడం జరిగిందని, ఎన్నికల అధికారులు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటానని *స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి* అన్నారు. నూటికి నూరు శాతం బిఆర్ఎస్ పార్టీ పూర్తి ఆదిక్యంతో ఉండి, చైర్మన్ బై చైర్మన్ దక్కించుకుంటుందని జీర్ణించుకోలేక అక్కస్సుతోనే, ముమ్మాటికి అధికార పార్టీ చేస్తున్న తతంగం ఇది అని, దీనికి పోలీసులు,అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన…. *మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి* ఈ మొత్తం ఘటనపై పై అధికారులకు,ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామంటున్న బిఆర్ఎస్ పార్టీ నేతలు భారీ ఉత్కంఠ నడుమ మున్సిపల్ కార్యాలయం నుండి వెళ్లిన బిఆర్ఎస్ కౌన్సిలర్స్

విశాఖపట్నం

గాజువాకలో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు

విశాఖ గాజువాక ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి): విజయనగర సామ్రాజ్య మహామహుడు శ్రీకృష్ణదేవరాయలు జయంతిని గాజువాక రాయల్ కూడలిలో ఘనంగా నిర్వహించారు.కాపు సంఘ నేతలు దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నేతలు కరణంరెడ్డి నరసింగరావు,కాతా బాలకృష్ణ,గంధం వెంకటరావు మాట్లాడుతూ దేవరాయల పరిపాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కర్ణాటక,ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన దూరదృష్టి గల పాలకుడు ఆయనని పేర్కొన్నారు.యుద్ధవిద్యలలోనే కాక సాహిత్యరంగంలోనూ అపార ప్రతిభ కనబరిచిన రాయలు తెలుగులో ‘ఆముక్తమాల్యద’ మహాకావ్యాన్ని రచించి సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని గుర్తుచేశారు.ఆయన పాలన విధానాలు శతాబ్దాలు గడిచినా ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.దేవరాయల జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో గుడివాడ అప్పలరామ్మూర్తి,అమ్మన్న,విందుల వెంకటరమణ,ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఒకప్పుడు జగ్గు జంక్షన్‌గా ఉన్న ఈ ప్రాంతం దేవరాయల విగ్రహం ఏర్పాటు అనంతరం రాయల్ కూడలిగా మారి గుర్తింపు పొందిందని నేతలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.