Saturday, 7 March 2026

Blog

ఖమ్మం

నో పాలిటిక్స్.. ఓన్లీ డెవలప్మెంట్: మీడియా సమావేశం లో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) మధిర పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “అభివృద్ధి – సంక్షేమం – నమ్మకం” ఈ మూడు అంశాల సమ్మేళనమే మధిర విజయానికి కారణమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు భారీ విజయం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన విజయం చారిత్రాత్మకమని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఇంత భారీ మెజార్టీ లభించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 90–95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని తెలిపారు. గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోనూ కాంగ్రెస్ బలంగా ఉందని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష విజయం అందించిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ నేతృత్వంలో అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వం మరింత బాధ్యతగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. 2047 లక్ష్యం – 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగాల కల్పనకు పారిశ్రామికరణ, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. మధిరను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతాం మధిరను మోడల్ పట్టణంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. “నో పాలిటిక్స్.. ఓన్లీ డెవలప్మెంట్” అనే నినాదంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసినందుకు తాము మరింత బాధ్యతగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఖమ్మం

తుమ్మల నాగేశ్వరరావు – నారా చంద్రబాబు నాయుడు భేటీ ఖమ్మం జిల్లా ప్రయోజనాలపై కీలక విజ్ఞప్తులు – రెండు రాష్ట్రాల సమన్వయానికి నూతన దిశ

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్‌లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఖమ్మం జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర పునర్విభజన తర్వాత ఉత్పన్నమైన పరిపాలనా సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు మరియు మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలు ప్రాధాన్యం పొందాయి. — అయిదు గ్రామపంచాయతీల విలీనం – పరిపాలనా సౌలభ్యం కోసం విజ్ఞప్తి రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న యేటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో కొనసాగుతున్నాయి. భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉన్న ఈ గ్రామాలు ఎంక్లేవ్‌లా మారి, ప్రజలు తీవ్ర పరిపాలనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి వివరించారు. జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం చేయాల్సి వస్తోందని, అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, పన్నులు, భద్రతా సమస్యలు గిరిజనుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పరిధిలోని కొంత భూభాగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో దేవస్థానం పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలంటే ఈ గ్రామాల విలీనం అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. — పెద్దవాగు ప్రాజెక్ట్ – 85:15 నిష్పత్తిలో నిధుల విడుదలకు విజ్ఞప్తి ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మత్తులు అత్యవసరమని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, అందులో 13,640 ఎకరాలు (85.25%) ఆంధ్రప్రదేశ్‌లో, 2,360 ఎకరాలు (14.75%) తెలంగాణలో ఉన్నాయి. మొత్తం రూ.92.20 కోట్ల వ్యయం అంచనా వేయబడిన నేపథ్యంలో, లబ్ధి నిష్పత్తి ప్రకారం 85:15 నిధుల భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ పునరుద్ధరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనాధారం ఈ ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉండటంతో తక్షణ ఆర్థిక సహకారం అందించాలని కోరారు. — భద్రాచలం వరద రక్షణ కరకట్ట – తక్షణ చర్యల అవసరం గోదావరి వరదల నుంచి రక్షణ కోసం నిర్మించిన కరకట్టలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతిన్న విషయం కూడా మంత్రి ప్రస్తావించారు. విభజన అనంతరం ఆ భాగం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లడంతో నిర్వహణలో ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారీ వరద ప్రమాదాన్ని నివారించాలంటే తక్షణ సాంకేతిక పరిశీలన చేసి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. — తిరుమల – ఖమ్మం దేవస్థానాల అభివృద్ధి ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి అవసరమైన భూమి గుర్తింపు పూర్తయిందని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు. స్థానిక భక్తుల దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేర్చే దిశగా సహకారం అందించాలని అభ్యర్థించారు. అదే విధంగా, తిరుమల లో తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక యాత్రికుల భవనం నిర్మాణానికి సుమారు 5 ఎకరాల భూమి కేటాయించాలని ప్రతిపాదించారు. పండుగలు, ప్రత్యేక దర్శనాల సమయంలో వసతి సమస్యలు తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. — రైల్వే లైన్ల నిర్మాణానికి సహకారం సత్తుపల్లి–కొవ్వూరు మరియు పెనుబల్లి–అమరావతి రైల్వే లైన్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలని మంత్రి కోరారు. ఈ ప్రాజెక్టులు అమలైతే రెండు రాష్ట్రాల మధ్య రవాణా, వాణిజ్య మరియు ప్రజల ప్రయాణ సౌలభ్యం మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. — రెండు రాష్ట్రాల సమన్వయం – అభివృద్ధికి బాటలు ఈ భేటీ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం పెంపొందితే సాగునీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు మరియు మౌలిక వసతుల విస్తరణలో వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం రెండు రాష్ట్రాల మధ్య సహకారానికి నూతన దిశనిచ్చే కీలక అడుగుగా భావించవచ్చు.

పల్నాడు

తిరునాళ్ళ లోమధ్యం అమ్మిన ఒక హోమ్ గార్డ్.*

*పల్నాడు జిల్లా* *కోటప్పకొండ తిరునాళ్ళ లో మద్యం అమ్మకాల పై నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగా మధ్యం అమ్మిన ఒక హోమ్ గార్డ్.* *తిరునాళ్ళ విధులు గాలికి వదిలేసి మధ్యం వ్యాపారం లో తలమునకలైన హోం గార్డ్.* *మూడురోజుల పాటు కోటప్పకొండ పరిసర ప్రాంతాలలో మధ్యం అమ్మకాల పై నిషేధం విధించిన కలెక్టర్.* Uploaded Video:

పల్నాడు

100 ఇయర్స్ గోల్డ్ ప్రైస్ హిస్టరీ ఇన్ ఇండియా:* *భారతీయులకు భద్రమైన పెట్టుబడి బంగారం* *ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం భారత్*

*రూ.18 నుండి లక్షా 57 వేలు రూపాయల వరకు.. 100 ఏళ్ల బంగారం చరిత్ర ఇదే* ‘బంగారం’.. భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, భద్రమైన పెట్టుబడి కూడా. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని ఇష్టపడే దేశం భారత్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు వందల్లో ఉన్న పసిడి ధర.. ఇప్పుడు లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో గత 100 సంవత్సరాల బంగారం ధరల చరిత్రను పరిశీలిస్తే.. కాలానుగుణంగా దాని విలువ ఎంతగా పెరిగిందో స్పష్టంగా తెలుస్తుంది. పసిడి ధర రూ.18 నుంచి లక్ష 57 వేలకే చేరింది. బంగారం ధర 100 ఏళ్లలో ఎలా మారిందో ఓసారి చూద్దాం. 1925 ప్రాంతంలో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.18–20 మధ్యలో ఉండేది. ఆ కాలంలో బంగారం విలువ తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డిమాండ్ తక్కువగా ఉండటం, మార్కెట్ పరిమితులు 1940-1960 మధ్య కాలంలో బంగారం ధరలు కొద్దిగా పెరిగినా పెద్ద మార్పు మాత్రం కనిపించలేదు.1950దశకంలో ధర రూ. 90-100 పరిధిలో ఉండేది. అయితే 1970ల తర్వాత ప్రపంచ ఆర్థిక మార్పులు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా పసిడి ధరలు భారీగా పెరగడం ప్రారంభమైంది. 1980లో బంగారం ధర సుమారు రూ.1,300 దాటడం పెద్ద మైలురాయిగా నిలిచింది.1990ల నుంచి 2000ల వరకు బంగారం పెట్టుబడిదారులకు ఆకర్షణీయ ఆస్తిగా మారింది. 1995 ప్రాంతంలో ధర దాదాపుగా రూ.4,500 ఉండగా 2000 నాటికి రూ.4,400–4,700 మధ్యలో ఉంది. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, డాలర్ మార్పిడి విలువలు, పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వల్ల పసిడి ధరలు వేగంగా పెరిగాయి. 2010 వరకు రూ.18, 500గా ఉంది. 2010 తర్వాత బంగారం ధరల పెరుగుదల మరింత స్పష్టంగా కనిపించింది. 2010లో రూ.18,500 ఉన్న ధర 2020 నాటికి రూ.48,000 దాటింది. ఇటీవల సంవత్సరాల్లో ఊహించని రీతిలో పెరిగింది. 2024 వరకు రూ.78,000 వరకు చేరడం గమనార్హం. అంటే ఒక శతాబ్దంలో బంగారం విలువ వందల రెట్లు పెరిగింది. ఇక 2025, 2026లో ఊహించని రీతిలో పెరుగుతూ పసిడి ధరలు ఆకాశానికి తాకాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్ష 57 వేలుగా ఉంది.

తిరుపతి

ఏపీ శాప్ చైర్మన్ ని కలిసిన ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నేతలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి బాలాజీ, చిత్తూరు జిల్లా బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, క్రాంతి కుమార్, ఏపీ షాప్ చైర్మన్ రవి నాయుడుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది బాల్ బాడ్మింటన్ క్రీడ అభివృద్ధి కొరకు శాప్ చైర్మన్ రవి నాయుడుని సహకరించవలసిందిగా కోరడం జరిగింది. శాప్ చైర్మన్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని బాల్ బాడ్మింటన్ క్రీడకు తగిన విధంగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని పరిశీలించి కల్పిస్తామని తెలియచేసారు. అందుకు ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరపున శాప్ చైర్మన్ రావినాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

తిరుపతి

సూపర్ స్నేహితుల మిత్రబృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి పట్టణంలో 13 రోజులు పాటు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రథోత్సవం రోజున సోమవారం నాడు సూపర్ స్నేహితుల మిత్రబృందం ఆధ్వర్యంలో భక్తులకు భారీ సంఖ్యలో అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్బగా ఛైర్మెన్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి మాట్లాడుతూ… స్థానిక పానగల్ లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1982-83 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులందరు కలసి సూపర్ స్నేహితుల మిత్రబృందం అనే పేరిట ఒక గ్రూపుగా ఏర్పడి గత 16 ఏళ్ల నుంచి శ్రీకాళహస్తీశ్వరా స్వామీ-అమ్మవార్ల రథోత్సవం రోజున భక్తిశ్రద్ధలతో భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని నేడు సుమారుగా 2000 మందికి పైబడే రకరాల అన్న ప్రసాదాలు వితరణ చేశామన్నారు. తమ మిత్రబృందంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు, శుభకార్యక్రమాలు జరిగిన కలిసికట్టుగా ఉంటూ వారికి మేమున్నాం అంటూ భరోసాగా నిలబడుతున్నామని ప్రజలకు సేవ, సాయం చేయాలనే ఉద్దేశంతో తామంతా ఒక కమిటీగా ఏర్పడ్డామని అయన తెలిపారు. అన్నదాన సేవ అనంతరం అందరూ కలసి శ్రీ స్వామీ, అమ్మవార్ల దర్శనం చేసుకుని వేదపండితుల ఆశీర్వాదం పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్నేహితుల మిత్రబృందం ప్రెసిడెంట్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శి పొట్లులూరు రవిచంద్ర, మమత, వైస్ ప్రెసిడెంట్లు ఎన్ ఎస్ రాఘవన్, అరుణ, ఎస్ మణి, పముజుల అమృతమ్మ, కార్యదర్శులు డీ అరవిందమ్మ, షేక్ అబ్దుల్ జబ్బర్, షేక్ జిలానీ, రెడ్డిపల్లి ప్రసాద్, చిర్రి గోపాల్, ట్రెజరర్ పట్టెం సురేష్, ఉచ్చురు హిందూ, సభ్యులు దామలచెరువు గిరిజేశ్వరి, షేక్ అక్బర్ భాషా, ఎస్ రమణ, దాసు గారి పార్వతీ, ఎన్ వెంకటేశన్, అత్తిరాల భాస్కర్, ఈశ్వరమ్మ, మోటుపాళ్యం శేఖర్, రాజేంద్ర, ఎ రవి, నీలవర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

భక్తులకు మజ్జిగ పంపిణీచేసిన భారతీయ జీవన పరివర్తన చారిటబుల్ ట్రస్ట్

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి పట్టణంలో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఘనంగా నిర్వహించిన రథోత్సవంలో భాగంగా, భారతీయ జీవన పరివర్తనం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చంద్రప్ప భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ…సమాజ సేవే లక్ష్యంగా “భారతీయ జీవన పరివర్తనం చారిటబుల్ ట్రస్ట్” ను స్థాపించామని వేల సంవత్సరాలుగా భారతదేశం సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ, ప్రపంచానికి మార్గదర్శకంగా గురు స్థానంలో నిలిచిందని విదేశీ పరిపాలన కాలంలో మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు కొంత మేరకు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇతర సంస్కృతుల ప్రభావంలోకి వెళ్లారని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ భారతీయ సంప్రదాయాలు, ధర్మం, సంస్కృతి పునరుజ్జీవనం పొందుతున్నాయని విద్య, వైద్యం, విజ్ఞానం, సంస్కృతి, సాహసం, ఆధ్యాత్మికత వంటి అన్ని రంగాల్లో భారతదేశం మళ్లీ ప్రపంచానికి గురువుగా ఎదగాల్సిన అవసరం ఉందని సనాతన ధర్మ విలువలను కాపాడుకుంటూ, యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందించడమే తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తూ, భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కండ్రిగ ఉమా , ప్రమీలమ్మ , పిల్లారీ బత్తినయ్య, మ్యాగీ క్లారా, తరుణ్, జస్వంత్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ నర్మదేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

తొట్టంబేడు, పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: తొట్టంబేడు మండలంలోని పెద్ద కన్నలి పంచాయితీ కొత్త కన్నలి గ్రామంలో శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి మందిర నిర్మాణ స్థలంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ నర్మదేశ్వర మహాదేవుని సాన్నిద్యంలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం నాడు ఘనగా నిర్వహించారు. శ్రీ సద్గురు దత్తానంద్ మహారాజ్ ఆధ్వర్యంలో ఆదివారం నుండి సోమవారం బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటలకు శ్రీ నర్మదేశ్వర మహాదేవునికి అభిషేకాలు, హోమాలు, నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ స్వామి భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ పరుశురామేశ్వరుని దర్శించుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సోమవారం నాడు భారతదేశంలో మొట్టమొదటి శివాలయం అయిన ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో వెలసి వున్న శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరుశురామేశ్వర స్వామి వారిని దర్శించుకున్నరు. వీరికి గుడిమల్లం దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేసి శ్రీ స్వామివారి తీర్థ, ప్రసాదలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తలిమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఏర్పేడు మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్, గున్నేరు కిషోర్ రెడ్డి, చంద్ర, రాజశేఖర్,శ్రీవారి సురేష్,ఉత్తరాది శరవన్ కుమార్,సాధన మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యం, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో సేవా ప్రవాహం-రథోత్సవంలో మజ్జిగ పంపిణీ

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం నాడు నిర్వహించిన శ్రీకాళహస్తీశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనానికి ఎండ వేడి నుండి ఉపశమనం కలిగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు భారీ స్థాయిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా బీసీ సెల్ కార్యదర్శి, బి.ఎమ్.ఆర్ సైనికుడు జి. విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రథోత్సవ మార్గంలో భక్తులకు చల్లని మజ్జిగను పంపిణీ నిర్వహించి భక్తుల దాహార్తిని తీర్చరు. స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఈ సేవ ఎంతగానో ఉపయోగపడింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎప్పుడూ ప్రజల సేవలో ఉండాలని మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారని మహాశివరాత్రి పుణ్యదినాన స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సేవ చేయడం తమా అదృష్టంగా భావిస్తున్నామనీ పేర్కొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్రమపద్ధతిలో మజ్జిగ పంపిణీ సాగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బి.ఎమ్.ఆర్ సేవా దళం సభ్యులు పాల్గొని భక్తులకు సేవలందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.