Saturday, 7 March 2026

Blog

రాజన్న సిరిసిల్ల

గూడూరులో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

గూడూరులో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ముస్తాబాద్ / ఫిబ్రవరి /పున్నమి ప్రతినిధి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయినా కె చంద్రశేఖర రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తాటాకర్ల ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్, వార్డు సభ్యుడు పుల్లూరి సంతోష్, కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్, కేటీఆర్ సేన గూడూరు గ్రామ అధ్యక్షులు చెక్కపెల్లి వెంకటేష్, యువ ఉపాధ్యక్షులు పొందుర్తి పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్ యువ ప్రధాన కార్యదర్శి కోడూరి మనీష్, నాయకులు మాధవరం శిరీష్, మెరుగు వెంకటేష్, ఎదునూరి అజయ్, వంగూరి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ గారి దూరదృష్టి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశకమైందని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్లలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్లలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఫిబ్రవరి/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో కె చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలను భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు.కేక్ కట్ చేస్తూ “కేసీఆర్ మా శ్వాస… తెలంగాణ మా గర్వం” అనే నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగింది.ఈ సందర్భంగా మొక్కలు నాటి పచ్చ తెలంగాణ సాధనకు సంకల్పం వ్యక్తం చేశారు. తోట ఆగయ్య మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం త్యాగం చేసిన మహానేతకు ఇదే మా గౌరవ వందనం అని పేర్కొన్నారు. ఆయన చూపిన దారిలోనే ముందుకు సాగుతూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో గులాబీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాఫ్కప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సీనియర్ నాయకులు కుంబాల మల్లారెడ్డి, మ్యాన రవి, బొల్లి రామ్మోహన్, సత్తర్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు భారీగా హాజరై కే సి ఆర్ జన్మదిన వేడుకను విజయవంతం చేశారు.

విశాఖపట్నం

గాజువాకలో పద్మశాలీ కల్యాణ వేదికకు వినతి

గాజువాక ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గ పరిధిలో పద్మశాలీ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కల్యాణ వేదిక నిర్మాణం చేపట్టాలని, ఇందుకు తగిన స్థలాన్ని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సంఘం రాష్ట్ర కన్వీనర్ పప్పు రాజారావు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కోరారు.ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.ఆర్థికంగా వెనుకబడి ఉన్న పద్మశాలీ కుటుంబాలు శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రైవేట్ కళ్యాణ వేదికలను ఆశ్రయించాల్సి వస్తోందని,దీంతో వారికి తీవ్ర ఆర్థిక భారం పడుతోందని వివరించారు.నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తమ సామాజిక వర్గ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్యాణ వేదిక నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పప్పు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సమ్మెకు షాక్ ట్రీట్‌మెంట్… 146 మంది ఉద్యోగులపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉక్కుపాదం!

విశాఖ గాజువాక ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ప్లాంట్ యాజమాన్యం తాజాగా 146 మంది ఉద్యోగులకు హెచ్చరిక నోటీసులు జారీ చేసింది.ఈ నెల 12న నిర్వహించిన సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించి వారికి నోటీసులు పంపినట్లు సమాచారం.ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ఆర్థిక స్థితి,ఉత్పత్తి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు,కార్మికులు సంస్థ అభివృద్ధికి సహకరించాలని,సమ్మెలు మరియు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎండీ ఆదేశాలను నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది.విధి నిర్వహణలో అంతరాయం కలిగించే చర్యలు పునరావృతమైతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.ఈ నోటీసులు సాధారణ షోకాజ్ కంటే కఠినంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.సమ్మె హక్కు కార్మికుల ప్రాథమిక హక్కు అని,హెచ్చరికలతో ఒత్తిడి తేవడం సరైంది కాదని కార్మిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.యాజమాన్యం-ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు జరిగే అవకాశముందని తెలిసింది.

ఖమ్మం

సత్తుపల్లి మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) సత్తుపల్లి మున్సిపాలిటీలో నూతన చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యుల సమక్షంలో ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. చైర్‌పర్సన్‌గా 22వ వార్డు కౌన్సిలర్ ఎండి రెహనా బేగం (కాంగ్రెస్ పార్టీ)ను ఎన్నుకున్నారు. ఈ ప్రతిపాదనను 4వ వార్డు కౌన్సిలర్ షేక్ మౌలాలి ప్రతిపాదించగా, 21వ వార్డు కౌన్సిలర్ మందపాటి ప్రభాకర్ రెడ్డి బలపరిచారు. అనంతరం జరిగిన ఓటింగ్‌లో ఆమెకు మెజారిటీ మద్దతు లభించడంతో చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. వైస్ చైర్‌పర్సన్‌గా 3వ వార్డు కౌన్సిలర్ బొంతు సుమలతను ఎన్నుకున్నారు. ఈ ప్రతిపాదనను 1వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్ ప్రతిపాదించగా, 8వ వార్డు కౌన్సిలర్ బండారు శరత్చంద్ర బలపరిచారు. ఓటింగ్ అనంతరం ఆమెను వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు పాల్గొనలేదు. అయితే, మిగిలిన సభ్యుల సమక్షంలో ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్ ఎండి రెహనా బేగం మరియు వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలతకు స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాగమయి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్ లతో పాటు గా సభ్యులు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

ఖమ్మం

ఎదులాపురం మున్సిపల్ చైర్మన్‌గా పోకబతిని అనిత, వైస్ చైర్మన్‌గా తమ్మీనేనీ నవీన్ ఎంపిక

ఖమ్మం ఫిబ్రవరి ( పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లా పరిధిలోని పాలేరు నియోజకవర్గంలో ఉన్న ఎదులాపురం మున్సిపాలిటీలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ చైర్మన్‌గా పోకబతిని అనితను సభ్యులు ఎన్నుకోగా, వైస్ చైర్మన్‌గా తమ్మీనేనీ నవీన్ ఎంపికయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగి, సభ్యుల మద్దతుతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు సమాచారం. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యుడు, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతనంగా ఎన్నికైన చైర్మన్ పోకబతిని అనిత, వైస్ చైర్మన్ తమ్మీనేనీ నవీన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నూతన మున్సిపల్ నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

కల్లూరు మున్సిపాలిటీలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక:

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. మున్సిపల్ సమావేశంలో సభ్యుల మద్దతుతో చైర్మన్‌గా మోహన్ నాయక్ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా శీలం కోటేశ్వరి ఎంపికయ్యారు. ఎన్నికల అనంతరం స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాఘమయి నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా నూతన చైర్మన్ మోహన్ నాయక్, వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి లకు అభినందనలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించి పని చేయాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

మధిర మున్సిపాలిటీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) మధిర మున్సిపాలిటీలో నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మున్సిపల్ సభ్యుల మద్దతుతో చైర్మన్‌గా శ్రీమతి సామినేని సుజాత ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా కోన ధని కుమార్ ఎంపికయ్యారు. ఎన్నికల అనంతరం స్థానిక శాసన సభ్యులుతెలంగాణ ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క నూతనంగా ఎన్నికైన చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన ధని కుమార్‌లకు అభినందనలు తెలియజేశారు. మధిర పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నూతన మున్సిపల్ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

వైరా మున్సిపల్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) వైరా మున్సిపాలిటీలో నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మున్సిపల్ సభ్యుల మద్దతుతో చైర్మన్‌గా డాక్టర్ శ్రీమతి కాపా చంద్ర కళ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా కట్ల సంతోష్ ఎంపికయ్యారు. ఎన్నికల అనంతరం స్థానిక శాసన సభ్యులు మాలోత్ రామ్ దాస్ నూతనంగా ఎన్నికైన చైర్మన్ డాక్టర్ కాపా చంద్ర కళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల దిశగా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నూతన మున్సిపల్ నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

నూతన మేయర్‌, చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన మేయర్‌లు, చైర్మన్లు, డిప్యూటీ మేయర్‌లు, వైస్ చైర్మన్లు అలాగే ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ నూతన సారథులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్‌కు తొలి మేయర్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన మూడ్ గణేష్ (సీపీఐ), డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సిరిపురపు లలిత (కాంగ్రెస్)లకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధి దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికైన చైర్మన్లకు అభినందనలు అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు మంత్రి అభినందనలు తెలిపారు. మధిర మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోట ధనమూర్తి సత్తుపల్లి చైర్మన్ రెహానా బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత వైరా చైర్మన్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ అశ్వారావుపేట చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ ఎదులాపురం చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ కల్లూరు చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి వారందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన పాలన అందించాలని మంత్రి సూచించారు. పూర్తి పాలకవర్గాల సమన్వయం కీలకం పట్టణాల్లోని ప్రతి వార్డు, డివిజన్ అభివృద్ధి చెందాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కూడిన పూర్తి పాలకవర్గం పాత్ర అత్యంత కీలకమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డులు, డివిజన్లలో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. నూతన పురపాలక పాలకవర్గాలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఆశలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.