Thursday, 5 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తిరుపతిలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు.

చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల బీఎస్పీ మహిళా సదస్సు మంగళవారం తిరుపతిలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర మహిళా కన్వీనర్ కె. పుష్పాంజలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి మహిళలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షురాలు Mayawati మహిళేనని గుర్తు చేశారు. మహనీయుల ఆశయ సాధన కోసం Kanshi Ram అడుగుజాడల్లో నడిచి ఉత్తరప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

రాజ్యసభకు ఎస్సి -ఎస్టీలను పంపించాలి..

గద్వాల్ (పున్నమి ప్రతినిధి ) *రాజ్యసభకు ఎస్సీ–ఎస్టీలను పంపించాలి* *-కొమ్మల ప్రవీణ్ రాజ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ సెక్రటరీ మరియు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి డిమాండ్* తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యసభకు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రతినిధులను పంపించకపోవడం అన్యాయమని **తెలంగాణ రాజ్యాధికారం పార్టీ** స్టేట్ సెక్రటరీ మరియు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి **కొమ్మల ప్రవీణ్ రాజ్** తెలిపారు. రాబోయే రాజ్యసభ ఖాళీల్లో తప్పనిసరిగా ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకు అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని మరియు అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఎస్సీ–ఎస్టీ వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ మను సింఘ్వీ (ఓసీ), రేణు చౌదరి (ఓసీ), మందాడి అనిల్‌కుమార్ యాదవ్ (బీసీ) సభ్యులుగా ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీ నుంచి బి. పార్థసారథి రెడ్డి (ఓసీ), డి. దామోదరరావు (ఓసీ), కే.ఆర్. సురేష్ రెడ్డి (ఓసీ), వద్దిరాజు రవిచంద్ర (బీసీ) రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని తెలిపారు. వీరిలో అభిషేక్ మను సింఘ్వీ మరియు కే.ఆర్. సురేష్ రెడ్డిల పదవీకాలం వచ్చే ఏప్రిల్ 9న ముగియనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ప్రతి రాజ్యసభ ఎన్నికలోనూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశం కల్పించలేదని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ పరిస్థితి మారలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఎస్సీ, ఎస్టీ సమాజాలకు ఉన్నత సభలో స్థానం కల్పించడం సామాజిక న్యాయానికి నిదర్శనమని **కొమ్మల ప్రవీణ్ రాజ్** అన్నారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో కనీసం ఒక స్థానాన్ని ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థికి కేటాయించాలని తెలంగాణ రాజ్యాధికారం పార్టీ తరఫున ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమానత్వం, సామాజిక న్యాయం సాధించాలంటే అణగారిన వర్గాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

జోగులాంబ గద్వాల

ఎం ఎన్ ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా.. ఏదుల నాగరాజు

ఎం ఎన్ ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా.. ఏదుల నాగరాజు గద్వాల్ (పున్నమి ప్రతినిధి) గద్వాల్ జిల్లా గట్టు మండలం ఆరెగిద్ద గ్రామానికి చెందిన ఏదుల నాగరాజు గారు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్రీయ దృక్పథం వ్యాప్తి లక్ష్యంగా నిరంతరం ప్రజలను చైతన్య పరచడంలో ముందుండి పని చేస్తానని స్పష్టం చేశారు. మహనీయుల ఆలోచన విధానాన్ని, శాస్తవ్రేత్తల త్యాగాలను సమాజానికి తెలియజేయంలో తన పాత్ర పోషిస్తానని,తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు ఉద్యమాన్ని విస్తరించేందుకు కట్టుబడి పని చేస్తానని నాతో పాటు నూతన కమిటీ సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికను ఆమోదించి, అవసరమైన మార్పులు చేర్పులు చేసి ప్రమాణ స్వీకారం నిర్వహించిన డాక్టర్ బైరి నరేష్, సుజాత టీచర్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఎన్నికల ఇంచార్జ్, కేంద్ర కమిటీ సభ్యులు కిలో రాంబాబు, యూత్ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు అచ్చుత్ రాజ్, గోమాస సందీప్‌లకు రాష్ట్ర కమిటీ కి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

తిరుపతి

తిరుచానూరు శ్రీ విజయ గణపతి ఆలయంలో మహా కుంభాభిషేక మహోశ్చవ ఆహ్వానం

పున్నమి ప్రతినిధి , తిరుపతి రూరల్ 4, 5, తేదీలు బుదవారం, గురువారం ప్రత్యేక పూజలు శ్రీ విజయ గణపతి స్వామి అనుగ్రహం ఆశీస్సులు పొందండి MRR ట్రస్ట్ చైర్మన్ యం. మునిరామిరెడ్డి, ఆలయ ధర్మకర్త యం.పుష్ప రెడ్డి ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి సతీమణి శ్రీమతి పద్మావతి అమ్మవారి ఆలయం చెంత తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసిన అత్యంత పవిత్రమైన మహిమగల శ్రీ విజయ గణపతి ఆలయంలో మహా గణపతికి జీర్నోద్ధరణ ఆస్టబంధన కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని MRR ట్రస్టు చైర్మన్ యం. మునిరామిరెడ్డి, మరియు ఆలయ ధర్మకర్త యం. పుష్ప రెడ్డి లు తెలిపారు. శ్రీ విజయ గణపతి ఆలయంలో మహా గణపతికి ఈనెల 4వ తేదీ బుధవారం కలశ స్థాపన పూజలు,5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కుంభాభిషేకం ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు. 5వ తేదీన గురువారం ఉదయం 11_16 నిమిషాలకు హస్తా నక్షత్రయుక్త వృషభ లగ్నం పుస్కరాంశం సుమూర్తంనందు శ్రీ మహా గణపతికి జీర్నోద్ధరణ ఆస్టబంధన కుంభాభిసేకం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీ విజయ గణపతి స్వామి వారి ఆలయంలో కలశస్థాపన, కుంభాబిసేకం, గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ మండప ఆరాధన హోమాలు, మధ్యాహ్నం ప్రసాదాల వితరణ,అన్నదాన కార్యక్రమాలు జరుగును. ఈ పవిత్రమైన మహిమగల శ్రీ విజయ గణపతి ఆలయంలో మహా గణపతికి జరుగు పూజల్లో పలువురు ప్రముఖులు పార్టీలకు అతీతంగా హాజరు కానున్నారు.భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ విజయ గణపతి స్వామి అనుగ్రహం ఆశీస్సులు పొంది సకల శుభాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుతున్నట్లు శ్రీ విజయ గణపతి ఆలయం నిర్వాహకులు తెలిపారు. ఆలయ అర్చకులు ప్రముఖ శ్రీ మధు స్వామి ఆధ్వర్యంలో శ్రీ విజయ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.మధు స్వామి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ప్రభుత్వం తరుపు ప్రత్యేక హోమాలు,భూమి పూజ కార్యక్రమాలు,అదే విధంగా నేటి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాంటి ప్రముఖ అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో 4 ,5 తారీఖులలో కుంభాభిషేక మహోత్సవం జరుగనుంది.శ్రీ విజయ గణపతి ఆలయంలో పర్వదినాల్లో ,సంకష్ట హరచతుర్థి ప్రత్యేక పూజలు కూడా మధు స్వామి నిర్వహించడం విశేషం.ఎన్నో విశేష ,ప్రత్యేకతలు కలిగిన శ్రీ విజయ గణపతి ఆలయాన్ని చూసినవారు తన్మయత్నం చెందడం ఖాయమని,తప్పకుండా ప్రతీ ఒక్కరూ ఒకసారి ఐనా శ్రీ విజయ గణపతి స్వామి వారిని దర్శించుకుని అన్ని విజయాలు పొందాలని కోరారు.

అన్నమయ్య

అన్నాసముద్రంలో టిడిపి నాయకులను కలిసిన కె కె చౌదరి — కేసులపై చర్చ, న్యాయం చేస్తామని హామీ

కె కె చౌదరి గారు పుల్లంపేట మండలం అన్నాసముద్రంలో టిడిపి నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసిపి నాయకుల రౌడీయిజం, దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని పార్టీ పట్ల అంకితభావంతో నిలబడ్డ టిడిపి నాయకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇంచార్జీ ముద్దా సుభాష్ రెడ్డి (గంగిరెడ్డి) గారు, ముద్దా సుబ్బా రెడ్డి గారు, ముద్దా లక్ష్మీనరసమ్మ గారు, ఆకేపాటి జయరాం రెడ్డి గారు, దేశు వెంకటరెడ్డి గారు మరియు నక్కల సుబ్రమణ్యం గారిని ప్రత్యేకంగా కలుసుకుని, వారు గత పది సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న పలు కేసులు మరియు ఇబ్బందులపై చర్చించారు.నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్ధగా విన్న కె కె చౌదరి గారు, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా, ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ నాయకులు చేసిన త్యాగాలను ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందులో బొజ్జల కుటుంబం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మంత్రి నారా లోకేష్ తిరుపతి పార్లమెంట్ కూటమి ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల కోసం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…. నారా, బొజ్జల కుటుంబాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి అనుబంధం ఈ భేటీతో మరోసారి గుర్తుకు వచ్చిందన్నారు. తన తండ్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని, అలాగే లోకేష్ అన్నతో తనకున్న చిన్ననాటి అనుబంధాన్ని ఆత్మీయంగా చర్చించుకున్నామని తన తండ్రి గోపాలకృష్ణ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను, నియోజకవర్గంతో ఆయనకు ఉన్న మమేకాన్ని లోకేష్ అన్న ఎంతో గౌరవంగా స్మరించుకోవడం తనకు స్ఫూర్తినిచ్చిందని శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు లోకేష్ అన్న కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ, స్వామి వారి తీర్థ ప్రసాదాలను, శ్రీకాళహస్తి నియోజకవర్గ కళా వైభవాన్ని చాటిచెప్పే “శ్రీ విష్ణు మత్యావతారం” ప్రతిమ, ప్రసిద్ధ గుడిమల్లం టెంపుల్ బుక్ ను లోకేష్ అన్నకు జ్ఞాపికగా బహూకరించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

తిరుపతి

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమం ఆగదు- సిఐటియు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి పట్టణ స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద మంగళవారం అంగన్వాడీలు వారి డిమాండ్ల సాధనలో భాగంగా అమరావతిలో శాంతియుత ధర్నా చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు, ఎఐటియూసీ, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య మాట్లాడుతూ….అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమం ఆగదని, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించేంతవరకు ఉద్యమం ఆగదని అయన స్పష్టం చేశారు. ఈ నిరసనలో పలువురు అంగన్వాడి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

రేపు ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి పట్నంలోని ముత్యాలమ్మ గుడి వీధిలోని ఏడు గంగమ్మ గుడి పక్కన ఉన్న ప్రధానమంత్రి జెన్ ఔషది కేంద్రంలో ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ పర్యవేక్షణలో 8వ జన్ ఔషధీ దివాస్- కార్యక్రమంలో భాగంగా 5వ తేదీన జరిగే ఉచిత వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఔషడాకేంద్ర నిర్వవహుకులు తెలిపారు. ఈ మెడికల్ హెల్త్ చెక్-అప్ క్యాంప్ లో ఉచితముగా బ్లడ్ చెకప్ , బిపి చెకప్, వెయిటేజ్, పరీక్షలు జరిపి డాక్టర్ సలహాలు, సూచనలు అందిస్తారన్నారు. ఈ వైద్య శిభిరంలో వైద్యులు డాక్టర్ కే.వెంకట భాస్కర్, ఎంబిబిఎస్ ఎండి జనరల్ సర్జన్ అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, బి.డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్, ప్రధానమంత్రి జన్ ఔషధ కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్. స్టేట్ కోఆర్డినేటర్ హరికృష్ణ, పట్టణ అధికారులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొంటారని నిర్వహుకులు తెలిపారు.

తిరుపతి

ఇన్స్పైర్ అవార్డులకు ఎంపికైన అక్కుర్తి హై స్కూల్ విద్యార్థులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 03, శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు వైష్ణవి, జీవనరేఖ, మీనాక్షి ముగ్గురు విద్యార్థులు ఇన్స్పైర్ మనక్ అవార్డులకు ఎంపిక కావడం గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయ కుమారి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎంపిక చేయబడిన సైన్స్ ప్రాజెక్టులలో ఎంపిక అవడం ఎంతో ఆనందదాయకమని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, సరైన మార్గదర్శకత్వం లభిస్తే వారు అద్భుత విజయాలు సాధించగలరని మా విద్యార్థులు నిరూపించారని ఆమె పేర్కొన్నారు. ఈ విజయానికి మార్గనిర్దేశం చేసిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీ ప్రకాశం రాజును ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఎంపిక కావడం పాఠశాలకు గౌరవకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు విద్యార్థులను అభినందించారు.

తిరుపతి

ఏర్పేడులో ఉత్సాహంగా జనసేన ‘ఉద్యమి’ నమోదు

ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 03, శిరకళహస్తీశ్వర దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ అధ్యక్షతన ఏర్పేడు పట్టణంలో నిర్వహించిన “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కిరణ్ రామిశెట్టి, జనసైనికులు పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను ఉత్సాహంగా కొనసాగించారు. ఉద్యమి సభ్యత్వం పొందిన వారికి పార్టీ గుర్తింపు, కార్యక్రమాల్లో ప్రాధాన్యత, కమిటీల్లో బాధ్యతలు, నాయకత్వ శిక్షణతో పాటు నాయకులుగా ఎదిగే అవకాశాలు లభిస్తాయని నాయకులు తెలిపారు. అదనంగా రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ద్వారా కుటుంబాలకు భరోసా కల్పించనున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 10 వరకు “ఉద్యమి” సభ్యత్వ నమోదు కొనసాగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.