Saturday, 7 March 2026

Blog

తిరుపతి

గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం- శివయ్య కృపకు పాత్రులవ్వాలని బొజ్జల పిలుపు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 18: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు ఎంతో వేడుకగా భావించే కైలాసగిరి ప్రదక్షిణ (కొండచుట్టు) కార్యక్రమం నేడు అత్యంత వైభవంగా జరగనుంది. ఉదయం 7 గంటలకు ఆలయం నుండి ప్రారంభమయ్యే ఈ పవిత్ర గిరి ప్రదక్షిణంలో శివనామ స్మరణతో గిరివీధులన్నీ పులకించనున్నాయి. అశేష భక్తజన సంద్రం మధ్య ఆధ్యాత్మిక మహోత్సవంగా సాగే ఈ అద్భుత వేడుకకు అశేష భక్తకోటి అందరం కలిసి ఈ పవిత్ర యాత్రలో పాల్గొని, ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు భక్తులను కోరారు.

తిరుపతి

బలరామయ్య మరణం మండలంలో పార్టీకి తీరని లోటు-గాలి మురళి నాయుడు

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 18: శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, కొణతనేరి గ్రామ పంచాయితీ, గుర్రప్ప నాయుడు కండ్రిగ హరిజనవాడకు చెందిన బలరామయ్య మూత్రపిండవ్యాధితో సమస్యతో మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి మురళి నాయుడు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గోగినేని భాస్కర్ నాయుడు, మాజీ ఎంపీటీసీ సింగమాల భాస్కరయ్య, కస్తూరయ్య, బూత్ ఇంచార్జ్ లెక్కల మురళి నాయుడు తదితర నాయకులు బలరామయ్య భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి బలరామయ్య కుటుంబ సబ్యులను పరామర్శించి తమ ప్రఘాడసానుభుతిని తిలిపారు. ఈ సందర్బ్గంగా గాలి మురళి నాయుడు మాట్లాడుతూ…బలరామయ్య పార్టీకి ఎంతో సేవ చేశారని, వారి కుమారులు కూడా పార్టీకి సేవ చేస్తారని వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

తిరుపతి

వర్లి ఆర్ట్ తో విద్యా బోధన సులభతరం -తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీతలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 18:శ్రీకాళహస్తి నివాసులైన గివింగ్ హాండ్స్ ఫౌండేషన్ వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ వరలక్ష్మి, కుమారి సాయి దీపికలకు వర్లి చిత్రకళ ద్వారా రామాయణాన్ని వినూత్న పద్ధతుల్లో చిత్రీకరించినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కడంపై బుధవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సంవేశంలో వారు మాట్లాదుతూ.. గిరిజన తెగలో అరుదుగా కనిపించే వర్లి ఆర్ట్ ద్వారా అతి సులువుగా విద్యా బోధన చేయొచ్చని 9, 10వ తరగతులు చదివే విద్యార్థులకు వారి పాఠ్యాంశాల్లోని సంపూర్ణ రామాయణాన్ని మొత్తం 20 నిమిషాల్లో రివిజన్ చేసే విధంగా వర్లీ చిత్రకళ దోహదపడుతుందన్నారు. అతి సులువైన త్రిభుజాలు వృత్తాలు, గీతలు ద్వారా పురాణ ఇతిహాసాలను పరిచయం చేస్తూ విలువలతో కూడిన విద్యను వినూత్న రీతిలో విద్యార్థులకు అందించే విధంగా తాము త్వరలో వంద పాఠశాలలో కార్యాచరణ చేపట్టనున్నామని ఈ వర్లి చిత్రలేఖనం ద్వారా 20 నిమిషాలలో విద్యార్థులకు చిత్రలేఖనంలో ఆసక్తితో పాటు రామాయణంలోని నీతిని, విలువలును తెలుసుకునే విధంగా అవగాహనా సదస్సులు నిర్వహించనున్నామని తొట్ట తొలిగా తాము తీసుకొచ్చిన పరిశోధనాత్మక వర్లీ ఆర్ట్ ను నూతన జాతీయ విద్యా విధానంలో సైతం ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నయని వృత్తి నైపుణ్య విద్యగా కూడా వర్లి ఆర్ట్ దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గివింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ప్రశంచిన శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 18: శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి చెందిన 220 మంది రోవర్లు, రేంజర్లు, స్కౌట్స్, గైడ్స్ సేవలందించారు. శివరాత్రి రోజున ఆలయంలోని క్యూ లైన్లలో భక్తులకు తగునీరు, మజ్జిగ, బిస్కెట్లు అందించి, రద్దీని క్రమబద్ధీకరించేందుకు సహకరించారు. అలాగే స్వామి, అమ్మవార్ల రధోత్సవం, తెప్పోత్సవం, కళ్యానోత్సవాలలో కూడా తమ వంతు సేవలందించారు.ఈ సందర్భంగా కళ్యానోత్సవంలో పాల్గొన్న రేంజర్లు, రోవర్లు, స్కౌట్స్, గైడ్లను శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కలసి మాట్లాడారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన వేలాది మంది భక్తులకు విశేషమైన సేవలు అందించారని వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యాలయ కమీషనర్ టి. రమేష్ బాబు పర్యవేక్షణలో ఇంచార్జి కార్యదర్శి విజయకుమార్, స్కౌట్ మాస్టర్లు మహేంద్ర, అజారుద్దీన్, విద్యాసాగర్, సుబ్రహ్మణ్యం, ధనుష్, మణికంఠ, గైడ్ కెప్టెన్లు, జ్యోతిర్మయి, సరిత, నిర్మల, రేంజర్, రోవర్ లీడర్లు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో తప్పుడు కుల పత్రంతో గెలిచిన నీలం శ్వేతపై కలెక్టర్ కు ఫిర్యాదు

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ 18 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో తప్పుడు కుల పత్రంతో గెలిచిన నీలం శ్వేతపై కలెక్టర్ కు ఫిర్యాదు.* *నీలం శ్వేతా బాలకిషన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.* *కాంగ్రెస్ పార్టీ 23వ అభ్యర్థి చెనమోని చంద్రకళ యాదగిరి ముదిరాజ్.*

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో తప్పుడు కుల పత్రంతో గెలిచిన నీలం శ్వేతపై కలెక్టర్ కు ఫిర్యాదు

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ 18 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో తప్పుడు కుల పత్రంతో గెలిచిన నీలం శ్వేతపై కలెక్టర్ కు ఫిర్యాదు.* *నీలం శ్వేతా బాలకిషన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.* *కాంగ్రెస్ పార్టీ 23వ అభ్యర్థి చెనమోని చంద్రకళ యాదగిరి ముదిరాజ్.*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆయుష్ ఆదేశాలతో చెర్లోపల్లిలో ఆరోగ్య శిబిరం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో విజయవాడ ఆయుష్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించినట్లు మడమనూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి జగదీశ్వరి తెలిపారు. శిబిరంలో గ్రామస్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు వంటి సమస్యలకు ఆయుర్వేదంలో శాశ్వత నివారణ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అలోపతిలో నయం కాని వ్యాధులకు కూడా చికిత్సలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దేవదానం, ఫార్మసిస్ట్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.

తిరుపతి

నూతన తెదేపా కార్యాలయ భూమి పూజ పనులను పరిశీలించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి 18 ఫిబ్రవరి తిరుపతి తిరుపతి నగర శివార్లలో నూతనంగా నిర్మించ తలపెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ భూమి పూజ పనులను తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ నూతన కార్యాలయం నిలవబోతోంది. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, లోకేష్ గారి మార్గదర్శకత్వంలో కార్యకర్తలకు సకల సౌకర్యాలు ఉండేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దుతున్నాం. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యాలయం కేంద్ర బిందువు కానుంది,అత్యాధునిక వసతులతో, అందరికీ అందుబాటులో ఉండేలా ఈ భవనం రూపుదిద్దుకోనుంది. వేదిక ఏర్పాటు, తాగునీరు మరియు ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

నిలిచిపోయిన రాజమహేంద్రవరం భీములు దొండపూడి బస్సును పునరుద్దరణ.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంపురం మండలం భీములు గ్రామ ప్రజలు ఆనంద ఉత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ఎంతోకాలంగా నిలిచిపోయిన భీములు దొండపూడి బస్సును పునర్దించడం జరిగింది. కావున ఇలాంటి చక్కటి అవకాశాన్ని భీములు, గుడ్డుగూడం మరియు కొవ్వూరుపాడు గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాజమహేంద్రవరం దొండపూడి బస్సు యొక్క టైమింగ్స్ 1. తెల్లవారుజామున 4:00 గంటలకు దొండపూడి లో బయలుదేరి 4:30 గంటలకు భీమొలు గ్రామానికి వచ్చి రాజమహేంద్రవరం 6:00 గంటలకు వెళ్లడం జరుగుతుంది. 2. రాజమహేంద్రవరం లొ 6:00 గంటలకు బయలుదేరి భీమొలు మీదుగా 8:00 కు దొండపూడి వెళ్లడం జరుగుతుంది. 3. తిరిగి మరల దొండపూడి లో ఉదయం 8 గంటలకు బయలుదేరి భీమొలు 8:30 కి వచ్చి రాజమహేంద్రవరం 9 45 కి వెళ్లడం జరుగుతుంది. 4. మరల మధ్యాహ్నం రాజమండ్రిలో 2:00 గంటలకు బయలుదేరి భీమొలు మీదుగా దొండపూడి 4 గంటలకు వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా భీమొల్లో పునర్నిర్మాణం చేసిన రెండు బస్టాండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు END

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దర్గామిట్ట పాఠశాలలో సామాజిక తనిఖీపై ప్రజా విచారణ

నెల్లూరు, ఫిబ్రవరి 18: విద్యాశాఖ–సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దర్గామిట్ట ఉన్నత పాఠశాలలో సామాజిక తనిఖీ నివేదికపై ప్రజా విచారణ నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన 56 పాఠశాలలో తనిఖీలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ గోగుల రమణయ్య పాఠశాల నిధుల వినియోగం, మౌలిక వసతులు, హాజరు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై సమీక్ష జరిగిందన్నారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున, స్టేట్ రిసోర్స్ పర్సన్ సుబ్బారావు పాల్గొని లోపాలను సవరించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.