ప్రక్కిలంక సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ – వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తాత్కాలిక అంతరాయం
తాళ్లపూడి( పున్నమి ప్రతినిధి )ఫిబ్రవరి 19:ప్రక్కిలంక 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. నారాయణ అప్పారావు ప్రకటించినట్టు తాళ్లపూడి ఎలక్ట్రికల్ ఏఈ జి. శ్రీనివాసరావు తెలిపారు. అయితే రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 3 గంటల నుండి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ పనుల కారణంగా ప్రక్కిలంక సబ్ స్టేషన్ పరిధిలోని ప్రక్కిలంక, తాడిపూడి, కుకునూరు, వేగేశ్వరపురం, బల్లిపాడు, పోచవరం, రాగోలపల్లి, తుపాకులగూడెం, గజ్జరం, వీరభద్రపురం గ్రామాలకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. కావున మెయింటెనెన్స్ పనులకు రైతులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.











