Sunday, 22 March 2026

Blog

అమరావతి

మీడియా రిలేషన్స్ పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కొలుసు పార్ధసారధి • 2026-2027 రెండేళ్ళ కాలానికి అక్రిడిటేషన్లు జారీ

మీడియా రిలేషన్స్ పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కొలుసు పార్ధసారధి • 2026-2027 రెండేళ్ళ కాలానికి అక్రిడిటేషన్లు జారీ • మీడియా సంస్థల నుండి ధరఖాస్తులు ఆహ్వానం అమరావతి,10 నవంబరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు 2026-2027 రెండేళ్ళ కాలపరిమతితో కూడిన అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు సంబంధించి మీడియా రిలేషన్స్ పోర్టల్(వైబ్ సైట్)ను సోమవారం సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి లాంచనంగా ప్రారంభించారు. ఈమేరకు ఎపి సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో మీడియా రిలేషన్స్ వెబ్ సైట్ ను సమాచారశాఖ సంచాలకులు కెఎస్.విశ్వనాధన్ తోకలిసి ప్రారంభించారు.గతంలో జారీ చేసిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ఈనెల 30వ తేదీతో ముగియనున్న నేపధ్యంలో రానున్న 2026-2027 రెండేళ్ల కాలానికి నూతన అక్రిడిటేషన్లు జారీకి వివిధ మీడియా సంస్థల్లో పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతోంది.రాష్ట్ర మరియు జిల్లాస్థాయి అక్రిడిటేషన్లకై అర్హులైన మీడియా ప్రతినిధులు అందరూ ఈపోర్టల్ లో ధరఖాస్తు చేసుకోవచ్చును.ఈపోర్టల్ లో ధరఖాస్తు చేసుకున్న జర్నలిస్ట్ లు తమ అప్లికేషన్ స్టేటస్ ఏ దశలో ఉందో కూడా ఈవైబ్ సైట్ ద్వారా తెల్సుకోవచ్చును.ఈపోర్టల్ లో ఏవిధంగా ధరఖాస్తు చేసుకోవాలనే విధి విధానాలను మంగళవారం ప్రత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుంది. (జారీ చేసిన వారు:డైరెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం)

తెలంగాణ

జిల్లాస్థాయి రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించిన : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత, జిల్లా సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రోడ్డు భద్రతను, ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రత్యేకించి పోలీస్ శాఖ గుర్తించిన బ్లాక్ స్పాట్లు, సూచించిన ప్రదేశాలలో ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, అలాగే ఇతర శాఖలు, పూర్తి సహకారం అందించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన వివిధ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు గుర్తించి, సంబంధిత శాఖ అధికారులకు అధికారికంగా తెలియజేయడం జరుగుతుందని, అలాగే చిట్యాల అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల,నాలుగైదు రోజులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగిందని, దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కలెక్టర్ ను కోరారు.

అన్నమయ్య

రోడ్డు మీద ఇసుకతో ప్రజలకు ఇబ్బంది

నందలూరు పట్టణంలో రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో తాజ్ జిమ్ సెంటర్ ఎదురుగా ఇసుక పేరుకుపోవడం స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది ఇసుక వలన పాదచారులు,వాహనదారులు జారిపడి గాయపడే ప్రమాదం ఉంది అని స్థానిక ప్రజలు అభిప్రాయము వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఈ రోడ్డుపై వందలాది వాహనాలు వెళ్తాయి,కానీ ఎవరు ఈ ఇసుకను తొలగించే ప్రయత్నం చేయడం లేదు. పంచాయతీ అధికారులు ఈ విషయంపై స్పందించి రోడ్డును శుభ్రం చేయాలి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Blog

ఆంధ్రప్రదేశ్ సగర (ఉప్పర) వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన ఉప్పరి సురేష్ కుమార్ కి ఘన సన్మానం*

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ సగర (ఉప్పర) వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నంద్యాల 8వ వార్డుకు చెందిన ఉప్పరి సురేష్ కుమార్ నియమితులైన శుభ సందర్భంగా, నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి. ఫిరోజ్ హాజరయ్యారు. అనంతరం కొత్తగా డైరెక్టర్‌గా నియమితులైన ఉప్పరి సురేష్ కుమార్ ని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సురేష్ కుమార్ నియామకం సగర (ఉప్పర) వర్గానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని, ఆయన ఈ పదవి ద్వారా తమ వర్గం సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ ఎల్లప్పుడూ వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్ ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కి, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ కి, కృతజ్ఞతలు తెలియజేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, సగర వర్గం అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు ఈ సన్మాన కార్యక్రమంలో సుబ్రి , షేక్ మొహమ్మద్ రఫీ (మున్నా) , నాగేశ్వరరావు , ఎబినేజర్ , కృపాకర్ , బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా , జోసెఫ్ , మరాఠీ సూరి , అక్బర్ , శ్రీనివాసులు , ప్రదీప్ రెడ్డి , డాక్టర్ గురు ప్రసాద్ , చిలకల చెన్నయ్య , హరుణ్ బేగ్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సగర సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

విజయవంతమైన ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సదస్సు*

ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ వైద్య సంఘం ( సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్) ఆధ్వర్యంలో నంద్యాల,కర్నూలు జిల్లాల యూరాలజీ సంఘాల సంయుక్త నిర్వహణలో గత శని, ఆదివారాలలో నంద్యాలలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల రాష్ట్రస్థాయి యూరాలజీ వైద్య వైజ్ఞానిక సదస్సు విజయవంతమైందని సోమవారం సదస్సు నిర్వాహక కమిటీ కార్యదర్శి డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డి, నిర్వాహక కమిటీ కోశాధికారి డాక్టర్ జై బాబు రెడ్డి, కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ దాసరి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో 25 మంది జాతీయస్థాయిలో పేరుగాంచిన యూరాలజీ వైద్యనిపుణులు జననేంద్రియ, మూత్ర పిండాలు,మూత్రాశయం,మూత్ర నాళాలు, ప్రొస్టేట్ వ్యాధుల చికిత్సలో వచ్చిన అధునాతన మార్పులు, వినియోగంలోకి వచ్చిన అత్యంత ఆధునిక పరికరాలపై మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా యూరాలజీ వైద్యులకు అవగాహన కల్పించారని తెలిపారు. చికిత్స విధానాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్న కొన్ని వ్యాధులపై చర్చ పోస్టులు నిర్వహించారు. యూరాలజీ పి.జీ.విద్యార్థులు క్లిష్టమైన వ్యాధులకు చికిత్స విధానాలపై తమ పరిశోధన పత్రాలు సమర్పించారు. ఢిల్లీ కి చెందిన సఫ్ధర్ జంగ్ హాస్పిటల్ యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అనూప్ కుమార్, వారణాసిలో ఉన్న బెనారస్ హిందూ యూనివర్సిటీ యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సమీర్ త్రివేది, హైదరాబాద్ కు చెందిన దక్షిణ భారత యూరాలజీ వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్రమోహన్ వంటి ప్రముఖ నిపుణులు సదస్సులో పాల్గొనడం విశేషమని అన్నారు. 300 మంది ఉభయ తెలుగు రాష్ట్రాల కు చెందిన యూరాలజీ వైద్యులు ప్రతినిధులుగా సదస్సులో పాల్గొన్నారని తెలిపారు. ప్రతినిధులుగా పాల్గొన్నవారికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ తరపున నిరంతర వైద్య విద్య నాలుగు పాయింట్ల సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి వైద్యుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి తమ వైద్య రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకునే సమయంలో మొత్తం 25 నిరంతర వైద్య విద్య పాయింట్లు కలిగి ఉండాలని వివరించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ తరఫున పరిశీలకులుగా శాంతిరాం వైద్య కళాశాల రేడియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బి.ఈ.పనిల్ కుమార్ సదస్సుకు హాజరయ్యారు. సూపర్ స్పెషాలిటీ విభాగానికి చెందిన రాష్ట్రస్థాయి సదస్సు నంద్యాలలో నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి అని తెలిపారు. యూరాలజీ వైద్య విభాగానికి సంబంధించిన చికిత్సలన్ని ప్రస్తుతం నంద్యాలలో అందుబాటులో ఉన్నాయని, నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చికిత్సలు చేయడానికి అవసరమైన అత్యంత ఆధునిక పరికరాలు, వసతులు ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా అనేక యూరాలజీ చికిత్సలు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. నంద్యాలలో ఇంత పెద్ద వైజ్ఞానిక వైద్య సదస్సు నిర్వహించినందుకు నిర్వాహక కమిటీకి రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ లు అభినందనలు తెలిపారు.

Blog

ఐఎంఏ నంద్యాల అన్ని మతాల పర్వదినాలు నిర్వహించడం అనవాయితీ: డాక్టర్ రవి కృష్ణ

పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని నంద్యాల ఐ ఎం ఏ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆర్ద్ర నక్షత్రంలో స్థానిక సంజీవనగర్ రామాలయం లో శివపార్వతుల కళ్యాణం, అభిషేక పూజలు నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ నిర్వహణలో, ప్రముఖ సిద్ధాంతి కార్తికేయ శర్మ పౌరోహిత్యంలో కల్యాణోత్సవం మూడు గంటలపాటు ఘనంగా నిర్వహించారు. కార్తికేయ శర్మ కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణ విశిష్టతను వివరించారు. కళ్యాణోత్సవం, అభిషేక పూజలలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, సతీమణి సునంద, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ ఈశ్వరి, మాజీ ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ , డాక్టర్ హరిత, నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, డాక్టర్ లలిత,డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, డాక్టర్ అరుణ కుమారి,డాక్టర్ పెసల అశోక్ కుమార్, డాక్టర్ సునీత, డాక్టర్ పాండురంగారావు, డాక్టర్ శైలజ, డాక్టర్ నిరంజన్ రెడ్డి దంపతులు కంకణ ధారణ చేసి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో అన్ని మతాల పర్వదినాలను అనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఐక్య భావన కోసం, లోక కళ్యాణం కాంక్షించి శివపార్వతుల కళ్యాణం నిర్వహించామని తెలిపారు. డాక్టర్ సహదేవుడు,డాక్టర్ జఫరుల్లా పురాణ, ఇతిహాసాల లో ఉన్న కార్తీక మాస విశేషాలను శ్లోకాలతో వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ,సునంద దంపతులను శాలువా, పూల మాలతో ఐఎంఏ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమాలలో భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య,డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవికాంత్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీబాయి, డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ జఫరుల్లా,డాక్టర్ షబ్నం తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ప్రముఖ కవివర్యులు మరియు గేయ రచయిత శ్రీ అందె శ్రీ గారి మరణ వార్త చాలా బాధాకరం

ప్రముఖ కవివర్యులు మరియు గేయ రచయిత శ్రీ అందె శ్రీ గారి మరణ వార్త చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారు మాట్లాడుతూ అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్య జగతికి తీరనిలోటు, ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. డివిజన్ ప్రెసిడెంట్ తో పాటు 138 డివిజన్ జనరల్ సెక్రెటరీ వకీల్ సలీం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం సత్తన్న మరియు తదితరులు పాల్గొని సంతాపం తెలియజేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

ప్రతి మండలంలోనూ 20 నుంచి 30 వర్క్ స్టేషన్లు…

AP: ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వర్క్ స్టేషన్ల ఏర్పాటు కోసం ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసుకునేందుకు వీలుగా ఈ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఉద్యోగులకు సౌకర్యంతో పాటు, వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి ఉపాధి లభించనుంది.

ఎన్ టి ఆర్ జిల్లా

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను

అమరావతి, వెలగపూడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఈ రోజు అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో పార్టీ కార్యక్ర మాలు, జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. సామినేని ఉదయభాను పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తల అభిప్రాయాలు, స్థానిక ప్రజల ఆకాంక్షలు వివరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ బలపరిచే చర్యలు కొనసా గించాలని సూచించారు. సచివాలయంలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో ఎన్టీఆర్ జిల్లా జనసేన నేతలు కూడా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పెద్ద చెర్లోపల్లిలో చక చక ఏర్పాట్లు, 750 మందితో భద్రత

ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పర్యటిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సోమవారం, స్థానిక డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ హెలిపాడ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా దాదాపు 750 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.