Sunday, 22 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

*రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు ఎంపిక*

పున్నమి న్యూస్ నవంబర్ 10 (పామిడి) కృష్ణవేణి స్కూలు విద్యార్థులు టి. సత్య బ్రూస్లీ, తిరుపతి. అభిరామ్,హెచ్.నవనీత్, నేనావత్ కీర్తి వన్నె శ్రీ,ఎన్. జతిన్ రెడ్డి, ఎస్కే.షాకీర్, టి. సత్య గౌరవ్ లీ, వై. గోకుల్ కృష్ణ, బనావత్ ఉమామహేశ్వరి, బి.భవిష్య రెడ్డి, పి.అస్పియా ఐమాన్, వై. చరణ్ తేజ్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 14 నుంచి 16 వరకు కాకినాడలో జరగనున్న 39వ సబ్- జూనియర్ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో ఈ చిన్నారులు పాల్గొంటారు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన చిన్నారులను పాఠశాల కరస్పాండెంట్ ఆర్.అనురాధ రెడ్డి, ఇన్చార్జ్ కే.శశికళ, పిఈటి.వెంకటరమణ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.

నాగర్‌కర్నూల్

ఆ భూమి న్యాయంగానే కొన్నాం.. మాకు న్యాయం చేయండి

ఆ భూమిని న్యాయంగానే కొన్నాము. మాకు న్యాయం చేసి ఆక్రమణదారుల నుంచి మా భూమి దక్కేలా చూడండి అని బాధితురాలు మంచుకొండ హైమావతి కోరారు. సోమవారం మండల పరిధిలోని కొట్ర చౌరస్తా వద్ద దివంగత జైపాల్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ పరిధిలోని గొల్లోనిపల్లిలో సర్వేనంబర్లు 237, 238లోని 10 ఎకరాలు 6 గుంటల పొలాన్ని 2006లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించలేదని, తన భర్త పేరు పై ఉన్న అన్ని పత్రాలు, పాసుబుక్కులు సక్రమంగానే ఉన్నాయని వివరించారు. అయితే 2020లో తన భర్త వీరేశం గుండెపోటుతో మరణించాడని, ఆ తర్వాత కొన్నాళ్లకు తమ భూమిని రైతులు హద్దులు చూపించారని తెలిపారు. అప్పటి నుంచి ఆ పట్టా పొలాన్ని తన పేరు పై మార్పిడి చేయాలంటూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రైతులతో కలిసి తమ భూమి పై కన్నేశారని ఆరోపించారు. భర్త లేనందున తాను ఏమీ చేయలేనని భావించి భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆక్రమణకు పాల్పడుతున్న వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకుని, తమ భూమి తిరిగి తమకు దక్కేలా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని హైమావతి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆ గ్రామ రైతులు, నాయకులు మాట్లాడుతూ ఆ భూమి మంచుకొండ వీరేశం కొనుగోలు చేసినదే, అందువల్ల హైమావతికే చెందుతుందని పేర్కొన్నారు. ఆమెకు అండగా నిలబడి, న్యాయం జరిగేంత వరకు వెన్నంటి ఉంటామని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు నగర అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతున్న మంత్రి నారాయణ గారు -రూపు కుమార్ యాదవ్ గారు

నెల్లూరు నగరం లోని 4వ దివిసిన్ ధింధయాల్ నగర్ లో నారాయణ గారి అదేశాలకు పాలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపన చేసిన రూప్ కుమార్ యాదవ్ గారు. అమరావతి లో మంత్రి నారాయణ గారు ఎంత బిజీగా వునా మంత్రి నారాయణ గారు నెల్లూరు నగర అభివృద్ధి కి పటుధలతో క్రుషి చేస్తునారు అని రూప్ కుమార్ యాదవ్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మామిడాల మధు,మంజుల,అధినారాయణ రెడ్డి పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

జిగ్రిస్’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల

సినీ ప్రేక్షకులకు మత్తెక్కించే ఉత్సాహం రాబోతోంది. మౌంట్ మెరు పిక్చర్స్ సమర్పణలో రూపొందిన ‘జిగ్రిస్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ క్యాంపెయిన్‌లు ఇప్పటికే సోషల్ మీడియా వేదికలపై హల్‌చల్ సృష్టిస్తున్నాయి. “మూడురోజులు మాత్రమే మిగిలాయి… మాడ్‌నెస్ రాబోతోంది!” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ కెవి, మనివాక, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా నిర్మాణ బాధ్యతలు మౌంట్ మెరు పిక్చర్స్ నిర్వహించగా, హరీష్ ఉత్, కృష్ణ వాగల్, వినైచిట్టెం, సయ్యద్ కమ్రాన్, చాణక్య ఆర్ట్, వాసుదేవ మాక్, వంశీ శేఖర్ తదితరులు ఈ ప్రాజెక్ట్‌కి మద్దతు అందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తల్లికి వందనం – చెల్లింపు విఫలమైనవారికి ముఖ్య సమాచారం!

ప్రభుత్వం తెలిపిన ప్రకారం, తల్లికి వందనం పథకంలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు నమోదయ్యాయి. 🔹 ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉన్నాయి: 1️⃣ పేమెంట్ ఫెయిల్ అయిన తల్లుల బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసి నవంబర్ 13, 2025లోపు అప్‌డేట్ చేయాలి. 2️⃣ మీ బ్యాంకు ఖాతా నంబర్ లేదా IFSC కోడ్ మారినట్లయితే, దయచేసి వెంటనే మీ సచివాలయ సిబ్బంది / బ్యాంకు శాఖ ను సంప్రదించండి. 3️⃣ సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంక్‌లో ఖాతా వివరాలు నవీకరించేలా సహాయం చేస్తారు. గమనిక: మీరు “తల్లికి వందనం” పథకానికి అర్హురాలైతే, కానీ మీకు ఇంకా డబ్బు రాకపోతే, వెంటనే మీ గ్రామ / వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. చివరి తేదీ:* నవంబర్ 13, 2025 NPCI LINK UPDATE ( ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న వాళ్లకు మాత్రమే డబ్బులు వస్తుంది.) చెక్ చేసుకోగలరు NPCI Status Check Online 2025: మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఈ సమాచారాన్ని ఇతర తల్లులకు కూడా షేర్ చేయండి — ఎవరికైనా ఉపయోగపడొచ్చు

E-పేపర్

కర్కటేశ్వర స్వామి గుండాల కోనను దర్శించుకున్న టిడిపి మండలాధ్యక్షుడు కొమ్మా శివ

మూడవ(3) కార్తిక సోమవారం సందర్భంగా చిట్వేలు మండలంలోని పెద్దూరు గ్రామం నందు గల కర్కటేశ్వర స్వామి గుండాల కోనను దర్శించుకోవడం జరిగింది.

అల్లూరి సీతారామరాజు

అరకు: చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపిన సోమ కుటుంబ

2018 సెప్టెంబర్ లో మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు సురేష్ కుమార్ ను కారుణ్య నియామకంలో డీటీ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణి నేతృత్వంలో సోమ భార్య ఇచ్ఛావతి, తనయులు, కుటుంబ సభ్యులు విజయవాడ లో సిఎం చంద్రబాబు ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తమకు అండగా ఉన్న సిఎం చంద్రబాబుకి, ప్రభుత్వానికి రుణపడి ఉంటామని మాజీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యుడు సివేరి అబ్రహాం అన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని చంద్రబాబు దిశానిర్ధేశం చేశారని అబ్రహాం పేర్కొన్నారు. గత తప్పిదాలు మరల తలెత్తకుండా ఉండాలని చంద్రబాబు సూచించినట్లు అబ్రహాం పేర్కొన్నారు.

E-పేపర్

మారో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వధ విహారి ట్రావెల్స్ Atleast ఒకసారి గా మంటలు చెలరేగాయి.29 మంది సభ్యుల బస్సులో ఎమర్జెన్సీ అద్దాలు పగలకొట్టుకొని బయటకి వచ్చాడు తరువాత బస్సు పూర్తి గా కలిపోయింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నేటి నుంచి ‘స్వామిత్వ’ ప్రత్యేక గ్రామసభలు

గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ముందు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నారు. స్వామిత్వ పథకంలో రెండో విడత కింద 45 లక్షల ఆస్తులకు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు వీటిని అందించే ముందు మరోసారి గ్రామసభలు నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా ఈ నెల 22 వరకు గ్రామసభలు నిర్వహించనున్నాయి. డ్రోన్ సర్వే తర్వాత గ్రామకంఠాల్లో ఆస్తులకు సంబంధించిన కొలతలు నిర్ధారించుకునేందుకు 2,300 గ్రామాల్లో సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేశారు. గ్రామసభల్లో ప్రజల నుంచి వీటిపై అభ్యంతరాలు స్వీకరించాకే ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఇటీవల జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మూడో దశ కార్యక్రమం కూడా ప్రారంభించి మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి కార్డులు పంపిణీ చేయాలని ఆయన నిర్దేశించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోల్డ్ రిఫ్ ఘటనలపై కేంద్రం అల్టిమేటం – జనవరి 1 నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు తప్పనిసరి

కోల్డ్‌ రిఫ్‌ దగ్గు మందుతో పలు రాష్ట్రాల్లో చిన్నారులు మృతి చెందిన ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి 1 నాటికి అన్ని ఔషధ తయారీదారులు అంతర్జాతీయ ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌ (CDSCO) కొత్త ఆదేశాలు విడుదల చేసింది. ఉత్పత్తుల నాణ్యత, భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కంపెనీలకు సూచించింది. ప్రమాణాలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.